Raw Mango: డయాబెటిస్ ఉందా? అయితే పచ్చి మామిడిని తినడం ప్రారంభించండి
మధుమేహ రోగులకు పచ్చి మామిడిపండు మేలు చేస్తుంది.
వేసవి వచ్చిందంటే మార్కెట్లో మామిడికాయలు, మామిడి పండ్లు సందడి చేస్తాయి. భారతదేశంలో ప్రజలు అత్యంతగా ఇష్టపడే పండ్లలో మామిడి పండ్లు కూడా ఒకటి. దీనిలో విటమిన్లు, మినరల్స్ డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. మండుతున్న వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఈ పోషకాలన్నీ అవసరం. ఎక్కువ మంది మామిడి పండ్లను తినడానికి ఆసక్తి చూపిస్తారు కానీ, పచ్చి మామిడికాయను తినడానికి ఇష్టపడరు. కానీ పచ్చిమామిడిని తినడం కూడా చాలా అవసరం. ఇది శరీరానికి శీతలీకరణాన్ని అందిస్తుంది. వేడి నుంచి తట్టుకునే శక్తిని ఇస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ముందుంటుంది. వేసవిలో వచ్చే వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడానికి శరీరానికి శక్తిని ఇస్తుంది. పచ్చి మామిడికాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరుగుతామనే భయం అవసరం లేదు.
డయాబెటిస్ ఉంటే...
మధుమేహంతో బాధపడే రోగులు సీజనల్‌గా దొరికే పచ్చి మామిడికాయల్ని తినడం చాలా అవసరం. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా డయాబెటిస్ రోగం అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలోనూ, తగ్గించడంలోనూ పచ్చి మామిడికాయ చాలా సహకరిస్తాయి. కాబట్టి వేసవిలో ప్రతిరోజూ పచ్చిమామిడి ముక్కలను తినడం అవసరం.
పచ్చిమామిడి కాయలు తినడం వల్ల మనకు కావాల్సిన రోజువారి విటమిన్ Aలో 10 శాతం ఇది అందిస్తుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు ఇది చాలా అవసరం. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మామిడిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇది రక్తప్రసరణ సవ్యంగా జరగడానికి అవసరం. రక్తప్రసరణ సవ్యంగా జరగడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఈ పోషకాలు రక్తనాళాలు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడతాయి. అధిక రక్తపోటు రాకుండా అడ్డుకుంటాయి. తక్కువ రక్తపోటు ఉండటం వల్ల గుండెకు మంచిది. ఈ పచ్చి మామిడికాయలో మాంగిఫెరిన్ అని యాక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
పచ్చి మామిడికాయలో ఒత్తిడిని తగ్గించే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. పచ్చి మామిడికాయ తినడం వల్ల లుకేమియా, పెద్ద పేగు, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, రొమ్ము వంటి క్యాన్సర్లు రాకుండా ఇది అడ్డుకుంటుంది. పచ్చి మామిడి కాయని ఈ రోజు నుంచే తినడం అలవాటు చేసుకోండి.
Also read: కంటి చూపు తగ్గుతోందా? ఈ ఐదు ఆహారాలు రోజూ మెనూలో ఉండేలా చూసుకోండి
Also read: పదేళ్ల వయసులో కలగంది, పంతొమ్మిదేళ్లకు ఆ కల నెరవేర్చుకుంది - మిస్ ఇండియా నందిని గుప్తా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.