Black Water Melon: ప్రపంచంలోనే అరుదైనవి నల్లని పుచ్చకాయలు, వీటిని పెళ్లికి గిఫ్టులుగా ఇస్తారు
ఆకుపచ్చని పుచ్చకాయలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. కానీ నల్లని పుచ్చకాయలు మాత్రం కనిపించవు.
వేసవి వచ్చిందంటే రోడ్లపై పుచ్చకాయల్ని పోగులుగా పోసి అమ్ముతూ ఉంటారు. వాటి ధర కూడా చాలా తక్కువ. పేదవారికి కూడా ఇవి అందుబాటు ధరలోనే ఉంటాయి. వేసవిలో కచ్చితంగా తినాల్సిన పండ్లలో పుచ్చకాయ ఒకటి. సాధారణంగా పుచ్చకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని ధర 20 రూపాయలు నుంచే మొదలవుతుంది. అయితే ప్రపంచంలోనే అరుదైన పుచ్చకాయ ఒకటి ఉంది, అదే నల్లని పుచ్చకాయ. బయట తొక్క మొత్తం చాలా నలుపుగా ఉంటుంది. వీటిని బ్లాక్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. కేవలం జపాన్లో మాత్రమే ఇవి పండుతాయి. అక్కడి హక్కయిడో ద్వీపంలోనే అధికంగా పండిస్తారు. వీటిని అక్కడ డెన్సుకే అని పిలుస్తారు.
ఈ డెన్సుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయగా పేరుగాంచింది. నాణ్యతలో ఇవి చెప్పుకోదగ్గవి. బయట మొత్తం నలుపు రంగు తొక్కలో ఉంటుంది. లోపల సాధారణ పుచ్చకాయలాగే ఉంటుంది. భిన్నమైన తీపి రుచిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా దీనిలో విత్తనాలు చాలా తక్కువగా ఉంటాయి. 92 శాతం నీటితో నిండి ఉంటుంది. జపాన్ వారికి ప్రత్యేకమైన పండు ఇది. ఈ పండు తినడానికే జపాన్ కు ప్రయాణం చేసేవారే సంఖ్య ఎక్కువే. వీటిని ‘బ్లాక్ వాటర్ మెలన్’ అని కూడా పిలుస్తారు. జపాన్లోనే పుట్టిన పండు ఇది.
ఈ పండ్లను వేరే దేశాల వాళ్ళు కొనుక్కొని వెళ్లి తమ దేశాల్లో వేలం వేస్తూ ఉంటారు. కొన్ని లక్షల రూపాయలకు ఈ పండ్లు అమ్ముడుపోతాయి. జపనీస్ సంప్రదాయాల ప్రకారం ఈ నల్ల పుచ్చకాయను వివాహ బహుమతులుగా అందిస్తారు. అలా ఇస్తే అది అమూల్యమైన వివాహ బహుమతిగా పరిగణిస్తారు. వీటిని పండించడం చాలా కష్టం. సాధారణ పుచ్చకాయలకు కావాల్సిన స్థలం కన్నా వీటికి రెట్టింపు స్థలము అవసరం.
జపాన్ లోని వాతావరణానికే ఈ పుచ్చకాయలు ఆరోగ్యంగా పండుతాయి. మిగతా చోట్ల పండించే ప్రయత్నాలు చేశారు, కానీ అవి అంతగా విజయవంతం కాలేదు. 2019లో ఒక పుచ్చకాయను వేలం వేస్తే ఏకంగా నాలుగున్నర లక్షల రూపాయలు పలికింది. ఏడాదికి పండే ఈ పండ్ల సంఖ్య ఏడాదికి లక్షలోపే. అందుకే వీటిని చాలా అరుదైనవి గా పరిగణిస్తారు. కొంతమంది ఈ దేశంలో కొనుక్కొని తమ దేశానికి వెళ్లి వాటిని అమ్ముకుంటారు. ఒక్కో పుచ్చకాయ ధర 6000 డాలర్ల వరకు పలుకుతాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి.
Also read: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మీ మెదడు మొదట ఏ బొమ్మను గుర్తించింది?
Also read: డయాబెటిస్ ఉందా? అయితే పచ్చి మామిడిని తినడం ప్రారంభించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.