అన్వేషించండి

Drug for deadly cancer: ఆ భయానక క్యాన్సర్‌కు అద్భుతమైన పరిష్కారం - ఆశలు రేకెత్తిస్తున్న యూకే శాస్త్రవేత్తల పరిశోధన

రెండు దశాబ్ధాల కాలంలో క్యాన్సర్ మెటాబాలిజం ఆధారంగా జరిగిన పరిశోధనల్లో ఒక ముందడుగు పడిందని ఈ పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Drug for cancer: యూకేకు చెందిన శాస్త్రవేత్తలు ప్రాణాంతకమైన, చికిత్సకు లొంగని క్యాన్సర్‌ను అడ్డుకొనే అద్భుతమైన కొత్త ఔషధాన్ని కనుగొన్నారు. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. క్యాన్సర్ కణితికి ఆహార సరఫరాను నిలిపివేయడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చెయ్యగలిగారు. JAMA ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆ క్యాన్సర్‌‌ను కంట్రోల్ చేసే అద్భుత ఔషదం

మెసోథెలియోమా అనేది ఒకరకమైన క్యాన్సర్, ఇది ఊపిరితిత్తుల్లో ఏర్పడుతుంది. ముఖ్యంగా అతిగా ఆస్బెస్టాస్‌కు గురయ్యేవారిలో ఈ క్యాన్సర్ ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. వీరందరికీ ఈ పరిశోధన కొత్త జీవితాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

కీమోథెరపీతో కలిపి ఇచ్చే మందు

దీనిపై క్వీన్ మేరి యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ దేశాల్లో అంతర్జాతీయ ట్రయల్ నిర్వహించారు. క్వీన్ మేరీ యూనివర్సిటి ప్రొఫెసర్ పీటర్ స్జ్లోసరెక్ నేతృత్వంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశోధకులు కొంతమంది రోగులను ఎంపిక చేసుకున్నారు. వారికి ప్రతి మూడు వారాలకు ఆరు సార్లు కీమోథెరపిని అందించారు. వారిలో సగం మందికి కేవలం ప్లెసిబో మాత్రమే ఇచ్చారు.

జీవిత కాలం పెరిగింది

ATOMIC-meso అనే ఈ ట్రయల్‌ను 2017, 2021 మధ్య ఐదు దేశాలలో 43 కేంద్రాలలో నిర్వహించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులను కనీసం ఒక సంవత్సరం పాటు పరిశీలించారు. పెగార్గిమినెస్ తోపాటు కీమోథెరపీని పొందిన వారు సగటున 9.3 నెలలు ఎక్కువ జీవించారు. ప్లెసిబో.. కీమోథెరపీతో పోలిస్తే 36 నెలల జీవిత కాలం పెంచింది. ఇది మిగతా మందులతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. కొత్త సమస్యలు లేకుండా పెగార్గిమినెస్ ఆధారిత కీమోథెరపీ మంచి ఫలితాలను ఇచ్చిందని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెప్పారు.

క్యాన్సర్‌కు ప్రభావవంతమైన చికిత్స

ఈ కొత్త ఔషదంతో కలిపి ఇచ్చే కీమోథెరపీ మరింత విజయవంతమైన చికిత్సా విధానం. రక్తప్రవాహంలో అర్జినైన్ స్థాయిలను తగ్గించడం ద్వారా ఇది క్యాన్సర్ మీద పనిచేస్తుంది. ఈ ప్రక్రియ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. క్యాన్సర్ కణాలకు పోషణను పూర్తిగా అడ్డుకోవడం వల్ల వాటిని నశింపజేస్తుందని ప్రొఫెసర్ స్లోసారెక్ వివరించారు. ప్రొఫెసర్ స్లోసారెక్ ఈ ఆవిష్కరణను మొదటి నుంచి పరిశీలించిన నిపుణుల్లో ఒకరు. ఈ చికిత్స మెసోథెలియోమా రోగుల జీవితాలను తప్పకుండా మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు. క్యాన్సర్ జీవక్రియలను లక్ష్యంగా చేసుకుని.. కీమోథెరపీతో కలిపి ఇచ్చే ఔషధాల తయారీ విజయవంతం కావడం ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు.

Also read : Onions Benefits: ఉల్లితో ఆరోగ్యమే కాదు, ఈ ప్రయోజనాలు కూడా లభిస్తాయ్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Zarina Wahab On Prabhas: ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటోన్న బాలీవుడ్ నటి - రెబల్ స్టార్‌కు తల్లిగా ఎందులో నటిస్తుందో తెలుసా?
ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటోన్న బాలీవుడ్ నటి - రెబల్ స్టార్‌కు తల్లిగా ఎందులో నటిస్తుందో తెలుసా?
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
Embed widget