Onions Benefits: ఉల్లితో ఆరోగ్యమే కాదు, ఈ ప్రయోజనాలు కూడా లభిస్తాయ్
Onion: ఉల్లిని సలాడ్ గా తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా పచ్చి ఉల్లిపాయ తినడంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట.
Onions Benefits: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదనే సామెత ఉంది. రకరకాల కారణాలతో ఉల్లిపాయ తినని వారు చాలా నష్ట పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిలో పోషకాలు చాలా ఎక్కువ. అంతేకాదు ఉల్లి చలువ చేస్తుందని కూడా అంటుంటారు. ఉల్లి రసం ఆయుర్వేద వైద్యానికి కూడా వాడుతారు. కొన్ని రకాల విషాలకు ఉల్లి.. విరుగుడుగా పని చేస్తుందని అంటారు. ఉల్లిని సలాడ్ గా తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా పచ్చి ఉల్లిపాయ తినడంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట.
ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువ. ముఖ్యంగా క్వెర్సెటిన్ ఉన్నందువల్ల కేవలం రోజుకో పచ్చి ఉల్లిపాయ తిన్నాసరే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. క్వెర్సెటిన్ వల్ల రక్తప్రసరణ మెరుగువుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఉల్లిపాయల్లో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్న అల్లిసిన్ అనే సమ్మేళన ఉంటుంది. తద్వారా ఉల్లి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పచ్చిఉల్లిలో ఫైబర్ అధికం, క్యాలరీలు తక్కువ. సహజంగా జీర్ణక్రియ, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ మెరుగు పరుస్తుంది.
క్యాన్సర్ ను నివారిస్తుంది
ఆర్గానోసల్ఫర్, క్వెర్సెటిన్, ఆంథోసైనిన్లు ఉల్లిపాయల్లో ఉండే కొన్ని యాంటీక్యాన్సర్ సమ్మేళనాలు. ఇవి క్యాన్సర్ నివారణ మాత్రమే కాదు.. చికిత్స వల్ల మెరుగైన ఫలితాలకు దోహదం చేస్తాయట.
యవ్వనాన్ని నిలిపి ఉంచుతుంది
ఉల్లిపాయల్లోని సల్ఫర్ కంటెంట్ కొల్లాజెన్ వృద్ధికి తోడ్పడుతుంది. వీటిలోని ఫ్లవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాల వల్ల చర్మంలో ముడుతలు రావడాన్ని నివారిస్తుంది. దీంతో యవ్వనం మీ సొంతమవుతుంది.
సంతాన సాఫల్యానికి
ఉల్లితో సంతాన సాఫల్య సామర్థ్యాన్నిసహజంగా పెంచుకోవచ్చు. ప్రతిరోజూ ఉల్లిపాయలు తినడం వల్ల వీటిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచడంలో ఉపయోగపడతాయి. ఇది పురుషుల్లో వీర్య వృద్ధికి దోహదం చేస్తుంది. ఉల్లిపాయలు తినడం వల్ల క్యాపులేటరీ ప్రవర్తన, టెస్టోస్టిరాన్ స్థాయిలు కూడా మెరుగుపడతాయి.
రోగనిరోధక శక్తికి
ఉల్లిపాయల్లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కొంత మందిలో నిరోధక వ్యవస్థ విపరీతంగా ప్రవర్తించడం వల్ల ఆటోఇమ్యూన్ సమస్యలు వస్తాయి. నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరచడానికి ఉల్లి చాలా ఉపయోగపడుతుంది. నిరోధక కణజాలాలను ఆక్సిడేషన్ నుంచి రక్షిస్తుంది. ప్రొటీన్ సింథసిస్, క్యాల్షియం ట్రాన్స్ఫర్ వంటి చర్యలను కూడా అదుపు చేసేందుకు దోహదం చేస్తుంది.
మానసిక ఉల్లాసానికి
ఉల్లిపాయలు శరీరంలో హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడానికి సహాయ పడతాయి. హోమోసిస్టీన్ లు మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతాయి. ఇవి సెరోటోనిన్ ఉత్పత్తిని తగ్గించి మానసికంగా కుంగిపోవడానికి కారణం అవుతాయి. ఫలితంగా డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఉంటంది. డిప్రెస్డ్ గా ఉన్నపుడు ఉల్లిపాయ నమలడం వల్ల మూడ్ బాగు పడి తిరిగి ఉత్సాహంగా ఉండవచ్చు.
Also read : Weight loss Tips: సులభంగా బరువు తగ్గాలా? ఈ కాఫీ ట్రై చెయ్యండి