By: ABP Desam | Updated at : 08 Sep 2021 01:37 PM (IST)
Edited By: Suresh Chelluboyina
Representational Image/Pixabay
ప్రపంచంలో దాదాపు 6,500 భాషలు ఉన్నాయి. కేవలం మన ఇండియాలోనే 121 భాషలు, 270 మాతృ భాషలు ఉన్నాయి. అలాగే రాష్ట్రాలు మారేకొద్ది భాషలు మారుతుంటాయి. జిల్లాలు.. ప్రాంతాలు మరేకొద్ది మాండలికాలు, యాశలు కూడా మారుతుంటాయి. భాష ఏదైనా.. ఆయా ప్రాంతాల్లో స్త్రీ, పురుషులు మాట్లాడే భాష ఒక్కటే. లింగాల్లో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. అయితే, ఓ గ్రామంలో మాత్రం మహిళలు, పురుషులు ఒకే భాషలో మాట్లాడుకోరు. స్త్రీలకు, పరుషులకు ప్రత్యేక భాషలు ఉన్నాయి. మహిళలంతా బాల్యం నుంచి తమ పెద్దలు నేర్పే భాషలోనే మాట్లాడుతారు. పురుషులు కూడా అంతే. మరి, ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఏ భాషలో మాట్లాడతారనేగా మీ సందేహం? అయితే, ముందుగా ఆ భాష ప్రత్యేకత ఏమిటీ తెలుసుకుందాం.
నైజిరియాలోని ఉబాంగ్ అనే గ్రామంలో ప్రజలు చాలా భిన్నమైన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి స్త్రీ, పురుషులు ఒకే భాషలో మాట్లాడరు. స్త్రీలకే వేరేగా, పురుషులకు వేరేగా భాషలు ఉన్నాయి. పైగా వారు స్త్రీలు, పురుషులు వేర్వేరు గ్రహాలకు చెందినవారిగా భావిస్తారు. మహిళలు శుక్రుడు, పురుషులు అంగాకర గ్రహానికి చెందినవారుగా భావిస్తారు. ఇందుకు ప్రాచీన కాలం నుంచి వారు స్త్రీ, పురుషులు వేర్వేరుగా మాట్లాడుతున్న భాషలే నిదర్శనమని చెబుతారు. మహిళలు మాట్లాడే భాషను ‘ఇరుయ్ (Irui)’ అని అంటారు. పురుషులు మాట్లాడే భాషను ‘ఇటాంగ్ (Itong)’ అంటారు.
అయితే, వారు మాట్లాడుకొనే భాషల్లో పదాలు కూడా చాలా తేడాగా ఉంటాయి. ఉదాహరణకు పురుషులు.. దుస్తులను ‘న్కీ’ అని పిలుస్తారు. మహిళలు మాత్రం ‘అరిగా’ అంటారు. పురుషులు చెట్లను ‘కిట్చీ’ అని పిలిస్తే.. మహిళలు ‘ఒక్వేంగ్’ అని అంటారు. ఇలా చాలా పదాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. అంటే హిందీకి చైనీస్ భాషకు ఉన్నంత తేడా వారి భాషల్లో ఉంటుందన్నమాట.
మరి స్త్రీ, పురుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే?: ఒక ఇంట్లో భార్య తమిళం, భర్త తెలుగు కుటుంబానికి చెందినవాడైతే పిల్లలు ఏ భాషలో మాట్లాడుకుంటారు? ఎక్కువగా తండ్రి భాషకే అలవాటు పడతారు కదూ. అలాగే, వారికి తల్లి భాష మీద కూడా అవగాహన ఉంటుంది. తల్లిదండ్రుల కుటుంబాలను కలిసేప్పుడు మాట్లాడేందుకు వీలుగా ఆ పిల్లలు రెండు భాషలను నేర్చుకుంటారు. ఉబంగ్‌లో కూడా అంతే.. పిల్లలకు బాల్యం నుంచే రెండు భాషలను నేర్పిస్తారు. అయితే, వారికి పదేళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఎవరి భాష వారే మాట్లాడుకోవాలి. అంటే అబ్బాయి.. పురుషుల భాష, అమ్మాయి.. స్త్రీల భాష మాట్లాడాలి. బాల్యం నుంచి స్త్రీ, పురుషులకు రెండు భాషలపై అవగాహన ఉండటం వల్ల వారికి ఒకరి భాషను ఒకరు అర్థం చేసుకుంటారు. కాబట్టి పెద్దగా గందరగోళం ఉండదు. అయితే, కాలక్రమేనా.. కొన్ని పదాలను ఉమ్మడిగా వాడటం మొదలుపెట్టారట. స్త్రీ, పురుషుల మధ్య కమ్యునికేషన్ కోసం, సౌలభ్యం కోసం కొన్ని సవరణలు చేసుకున్నామని అక్కడి పెద్దలు ఓ వార్తా సంస్థకు వెల్లడించారు.
Also Read: చీకటి గదిలో 25 ఏళ్లు బందీ.. కూతురికి నరకం చూపిన తల్లి, శరీరం కుళ్లుతున్నా..
ఉబాంగ్ ద్వంద్వ భాషా సంప్రదాయం ఎలా మొదలైందో.. ఎప్పుటి నుంచి ఉందో ఎవరికీ తెలియదు. కానీ చాలా మంది స్థానికులు మత సిద్ధాంతాన్ని నమ్ముతారు. దేవుడు ఉబాంగ్ ప్రజలను ఆడమ్, ఈవ్‌లుగా సృష్టించాడని, వారికి రెండు భిన్నమై భాషలను ఇచ్చారని చెబుతారు. దేవుడు ప్రతి జాతి సమూహానికి రెండు భాషలు ఇవ్వాలని ప్లాన్ చేశాడని, తగినన్ని భాషలు లేవని గ్రహించి ఉబాంగ్‌లో ఆగిపోయాడని తెలుపుతారు. ఈ గ్రామాన్ని ప్రపంచంలోని ఇతర వర్గాలకు భిన్నంగా ఉంచాడని స్థానికులు చెబుతారు. భాషలకు తగినట్లే.. ఇక్కడి స్త్రీ, పురుషులు వేర్వేరుగా జీవిస్తారు. ఇద్దరిది ఒకే మానవ జాతి అంటే నమ్మరు. దీనివల్ల అక్కడి బంధాలు బలహీనంగా ఉంటాయనే అభిప్రాయం కూడా ఉంది.
Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?
Also Read: ‘అవి’ పెంచుకొనే సర్జరీ వికటించి.. కూర్చోలేక పాట్లు, నిలబడే కోట్లు గడిస్తున్న మోడల్
Ghosts: మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూశారా? అవి కొందరికే ఎందుకు కనిపిస్తాయి?
Minister Jagadish Reddy: "కాళేశ్వరం జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేశారు సీఎం కేసీఆర్"
ఆ ‘ఐ డ్రాప్స్’తో పిల్లల్లోని దృష్టి లోపాన్ని నివారించవచ్చట - తాజా పరిశోధనలో వెల్లడి
Salt: ఉప్పు తగ్గించండి, కానీ పూర్తిగా తినడం మానేయకండి - మానేస్తే ఈ సమస్యలు తప్పవు
World Brain Tumor Day 2023: మెదడులో కణితులు త్వరగా గుర్తిస్తే చికిత్స చేయడం సులభమే, లక్షణాలు ఇవిగో
Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !
YS Viveka Case : వివేకా లెటర్కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
కోలీవుడ్ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్
Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!