California IVF Case: ఈమె బిడ్డను ఆమె.. ఆమె బిడ్డను ఈమె కన్నది.. కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఏం జరిగిందో చూడండి
బాలీవుడ్ చిత్రం ‘గుడ్ న్యూస్’ తరహాలో ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఏం జరిగిందో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.

టైటిల్ చూసి కన్‌ఫ్యూజ్ అయ్యారా? మీరు చదివింది నిజమే. ఇంకా అర్థం కానట్లయితే.. మీకు బాలీవుడ్ చిత్రం ‘గుడ్ న్యూస్’ గురించి చెప్పాల్సిందే. ఆ చిత్రంలో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ దంపతులు ఐవీఎఫ్(IVF) ద్వారా బిడ్డను కనాలని అనుకుంటారు. అదే సమయంలో దిల్జీత్, కియరా అద్వానీ జంట కూడా పిల్లల కోసం అదే హాస్పిటల్‌లో ఐవీఎఫ్ చేయించుకోడానికి వస్తారు. వైద్యులు పొరపాటున అక్షయ్ కుమార్ స్పెర్మ్‌ను కియారకు.. ఆమె దిల్జీత్ స్పెర్మ్‌ను కరీనా అండాశయంలోకి ప్రవేశపెడతారు. దీంతో కరీనా కడుపులో పెరగాల్సిన బిడ్డ కియరాలో.. కియరా బిడ్డ కరీనా కడుపులో పెరుగుతారు. ఇదే ఘటన కాలిఫోర్నియాలో కూడా చోటుచేసుకుంది.
ఒకప్పుడు బిడ్డలు పుట్టిన తర్వాత హాస్పిటల్‌లో మారిపోయేవారు. ఒకరి బిడ్డను మరొకరికి మార్చేసేవారు. అయితే, ఐవీఎఫ్ విదానంలో ఏకంగా కడుపులో ఉండగానే బిడ్డలు మారిపోతున్నారు. కాలిఫోర్నియాలోని ఇద్దరు మహిళలకు ఇదే జరిగింది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న ఇద్దరు మహిళలు IVF విధానంలో బిడ్డను కనేందుకు క్లినిక్‌కు వెళ్లారు. అయితే, అక్కడ వారి భర్తల వీర్యం తారుమారైంది. ఫలితంగా ఒకరికి అండాశయంలోకి ప్రవేశపెట్టాల్సి్న వీర్యాన్ని మరొకరికి ఇచ్చారు. దీంతో ఒకరి బిడ్డను ఇంకొకరు కనాల్సి వచ్చింది. దీంతో వారు లాస్‌ఏంజిల్స్‌లో వాజ్యం దాఖలు చేశారు. అయితే, వారి సొంత బిడ్డలను వారు తిరిగి సొంతం చేసుకొనేందుకు 9 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. వేరేవారి బిడ్డను తమ గర్భంలో మోశారు.
Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
కాలిఫోర్నియా సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్‌లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ప్రక్రియ ద్వారా డఫ్నా కార్డినాల్ అనే మహిళ సెప్టెంబర్ 2010న ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ ముదురు రంగులో ఉండటంతో డాఫ్నా, ఆమె భర్తకు అనుమానం వచ్చింది. ఆ బిడ్డ తమది కాదని సందేహం కలిగినా.. వైద్యుల మీద నమ్మకంతో ఆ బిడ్డను తమతో తీసుకెళ్లి 3 నెలలు పెంచారు. అయితే, DNA పరీక్షలు ఆ బిడ్డ కాదని తేలింది. దీంతో ఆ దంపతులు ఆందోళనకు గురయ్యారు. తమ సొంత బిడ్డను ప్రేమతో మోయలేకపోయాననే బాధ ఆమెను వెంటాడింది. అయితే, వారికి పుట్టాల్సిన బిడ్డ మరొకరి కడుపులో పెరుగుతుందని తెలుసుకుని సంతోషించారు. క్లీనిక్ మీద దావా వేశారు. తమ బిడ్డ తమకి కావాలని కోరారు. మొత్తానికి కోర్టు వారి సొంత బిడ్డలను తీసుకుని పెంచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే.. తన బిడ్డ తన కడుపులో పెరగలేదనే బాధను డఫ్నా మరిచిపోలేకపోతోంది. పైగా తన కడుపులో పెరిగిన మరోకరి బిడ్డపై ప్రేమను చంపుకోలేకపోతున్నానని.. ఆమె కూడా తన బిడ్డే అనే భావనలో మనసులో ఉండిపోయిందని ఆమె ఓ మీడియా సంస్థతో వెల్లడించింది.
Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















