అన్వేషించండి

Traveling with a Baby : పిల్లలతో ప్రయాణించేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ఈ టిప్స్ ఫాలో అయితే జర్నీలో ఇబ్బందులుండవు

Baby on Board : పిల్లలతో ట్రావెల్ చేయడమంటే సాహసం అనే చెప్పాలి. వారితో ప్రయాణించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూసేద్దాం. 

Baby Travel Tips and Tricks : పిల్లలతో ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టంతో కూడిన విషయం. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 3 ఇయర్స్​లోపు పిల్లలతో ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు కిడ్స్​తో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? మీ జర్నీ స్మూత్​గా అయ్యేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి?  వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ట్రావెల్​కి ముందు.. 

పిల్లలతో కలిసి ట్రావెల్​ చేయాలనుకుంటున్నప్పుడు కచ్చితంగా పిడియాట్రిషియన్​ని మీట్ అవ్వాలి. వారి నుంచి ట్రావెల్ సలహాలు తీసుకోవాలి. అలాగే కచ్చితంగా ప్యాక్ చేసుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. డైపర్స్, మిల్క్ ఫార్మూలా, బేబి ఫుడ్​ ప్రధానంగా ఉండేలా చూసుకోవాలి. మీరు వెళ్లకముందే స్టే చేయాల్సిన హోటల్స్, లేదా రూమ్స్​పై కచ్చితంగా అవగాహన ఉండాలి. విమానంలో ప్రయాణించాలనుకుంటే ఎయిర్​ లైన్​ బేబి పాలసీలు, జెట్​ లాగ్ వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. 

కచ్చితంగా ప్యాక్ చేసుకోవాల్సినవి..

డైపర్స్, వైప్స్​ ప్యాక్ చేసుకోవడమే కాకుండా.. అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మిల్క్ ఫార్మూలా లేదా బ్రెస్ట్​మిల్క్ స్టోరేజ్​ సిద్ధం చేసుకోవాలి. పిల్లలు తినే ఫుడ్స్, స్నాక్స్ అందుబాటులో ఉంచుకోవాలి. బాటిల్స్​, సిప్పర్స్ ఉండాలి. ఎక్స్​ట్రా డ్రెస్​లు ఉండాలి. పిల్లల్నీ క్యారీ చేసేందుకు స్టోలర్స్ లేదా బేబి క్యారియర్స్ వాడాలి. మెడిసన్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుకోవాలి. బొమ్మలు, పుస్తకాలు, మ్యూజిక్​ కూడా ఉండేలా చూసుకోవాలి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రోడ్ ట్రిప్స్ అయితే రెగ్యూలర్ బ్రేక్ ఉండేలా చూసుకోవాలి. విమానంలో అయితే ఏ టైమ్​కి వెళ్లుతున్నారనే అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. బేబి ఎమర్జెన్సీ కిట్ తీసుకువెళ్లాలి. కార్​లో బేబి కార్ సీట్ ఉండేలా చూసుకోవాలి. బేబి ఫ్రెండ్లీ హోటల్స్ తీసుకోవాలి. మీరు వెళ్లిన తర్వాత ఉయ్యాల లేదా క్రిబ్ ఉండేలా సెట్ చేసుకుంటే మంచిది. 6 నెలల్లోపు పిల్లలు అయితే కంఫర్ట్, రోటీన్​ ఉండేవిధంగా చూసుకోవాలి. 6 నుంచి 12 నెలల లోపు పిల్లలతో ట్రావెల్ చేస్తుంటే బొమ్మలు, స్నాక్స్ ఉండేలా పిప్రేర్ అవ్వాలి. 1 నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు అయితే ఎంటర్​టైన్మెంట్​తో పాటు బ్రేక్స్ ఇవ్వడంపై ఫోకస్ చేయాలి. 

ఆరోగ్యం విషయంలో.. 

పిల్లల విషయానికొస్తే ముందుగా ఆరోగ్యానికే ప్రధాన్యతనివ్వాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఇతర ప్రదేశాల్లో వివిధ రకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు వెళ్లే ప్రాంతం, ట్రావెల్​ని బట్టి నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇన్​సెక్ట్ రిప్లెంట్స్ ఉండేలా చూసుకోవాలి. పిల్లల బాడీ టెంపరేచర్​ని మానిటర్ చేస్తూ ఉండాలి. వెళ్లే ప్రాంతంలో ఆస్పత్రులు, వైద్య సేవలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవాలి. 

ఇబ్బంది లేకుండా..

పిల్లల విషయంలో ఏది ఎప్పుడు అవసరం అవుతుందో తెలీదు కాబట్టి.. ప్రతి వాటిని ఎక్స్​ట్రాగా ప్లాన్ చేసుకోవడమే మంచిది. మీరు వెళ్లే ప్రాంతంలో కూడా అవి అందుబాటులో లేకుంటే ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. మీకు తోడుగా ఓ పర్సన్​ కూడా ఉంటే మరీ మంచిది. అయితే ఇక్కడో విషయం గుర్తించుకోవాలి. ప్రతి పిల్లలు డిఫరెంట్​గా ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు కాబట్టి.. వాటికి తగ్గట్లు తల్లిదండ్రులు ప్రిపేర్ అవ్వాలి. 

Also Read :  అమ్మాయిలు సోలోగా ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Embed widget