Courses After Intermediate for Girls : ఇంటర్ తర్వాత అమ్మాయిలకు ఈ కోర్సులు బెస్ట్.. కెరీర్ గ్రోత్‌కి హెల్ప్ అవుతాయి, డిమాండ్ ఎక్కువ
Career Guidance for Girls : ఇంటర్ తర్వాత అమ్మాయిలు కొన్ని కోర్సులపై.. తమకున్న ఇంట్రెస్ట్‌కి అనుగుణంగా దృష్టి పెట్టాలి. అయితే ఇండియాలో ప్రస్తుతం గర్ల్స్‌కి టాప్‌లో ఉన్న ఆప్షన్స్ ఏంటో చూసేద్దాం.

Best Courses for Girls After Inter in India : కెరీర్ గురించి ముందు నుంచి ఓ గోల్ ఉంటే పర్లేదు. ఎందుకంటే వారికి ఇంటర్ తర్వాత ఏ కోర్సు చేయాలి అనేదానిపై క్లారిటీ ఉంటుంది. కానీ కెరీర్‌పై అలాంటి గోల్ లేకుండా ఇంటర్ తర్వాత ఏమి చేయాలి? ఎలాంటి కోర్స్‌ని ఎంచుకుంటే గ్రోత్ ఉంటుందని ఆలోచిస్తున్నారా? అయితే డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇది మీకోసమే. మీ అమ్మాయి ఇంటర్ తర్వాత ఏది చేస్తే కెరీర్‌కి హెల్ప్ అవుతుందో.. మీ ఇంట్రెస్ట్‌కి తగ్గట్లు ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ కెరీర్ కోర్సులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
సైన్స్ స్టూడెంట్స్ కోసం..
అమ్మాయిలకు హెల్త్‌కేర్‌లో మంచి స్కోప్ ఉంది. ఇది సమాజంలో గౌరవాన్ని పెంచే ప్రొఫెషన్. అలాగే ఆర్థికంగా కూడా మంచి కెరీర్ అవుతుంది. కాబట్టి మీరు హెల్త్ కేర్ సైడ్ వెళ్లాలనుకుంటే మెడిసన్ (MBBS), డెంటిస్ట్(BDS), ఆయుర్వేదం(BAMS), హోమియోపతి (BHMS), ఫిజియోథెరపీ(BPT) వంటివి చేయొచ్చు.
నర్సింగ్
B.Sc. నర్సింగ్ లేదా B.Sc. పారామెడికల్ చేయవచ్చు. వీటికి ఇండియాలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఆస్పత్రుల్లో ఈ తరహా కోర్సులకు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. మీరు బీఎస్సీ తర్వాత మీరు M.Sc. కూడా చేయవచ్చు.
రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉండే అమ్మాయిలు B.Sc.లో బయోటెక్నాలజీ, మైక్రోబయోలజీ, జెనిటిక్స్, అగ్రీకల్చర్ వంటి కోర్సుల్లో జాయిన్ అవ్వవచ్చు. ఈ డిగ్రీ చేస్తే ల్యాబ్స్, ఫార్మా, ఫుడ్, బయోటెక్ ఫిర్మ్స్లో జాబ్స్ దొరుకుతాయి.
ఇంజినీరింగ్..
అమ్మాయిలు B.Tech లేదా BEలో చేరాలనుకుంటే వారి ఇంట్రెస్ట్‌కి తగ్గట్లు కొన్ని బ్రాంచ్‌లు ఎంచుకోవచ్చు. అయితే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్‌లో అమ్మాయిలకు మంచి డిమాండ్ ఉంది. వీటిని చేయడం వల్ల టాప్ IT, టెక్ జాబ్స్‌లో ఎక్కువ జీతంతో సెటిల్ అవ్వొచ్చు. BCA (బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్) చేసిన వాళ్లు కూడా ఐటీ, సాఫ్ట్వేర్ జాబ్స్ చేయవచ్చు. బెటర్ ఫ్యూచర్ కోసం MCA లేదా MBA కూడా చేసుకోవచ్చు.
కామర్స్ స్టూడెంట్స్ అయితే..
మీరు కామర్స్ స్టూడెంట్స్ అయితే మీ కెరీర్‌ను ఫైనాన్స్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్ వైపు వెళ్లేందుకు B.Com, BBA, BBM వంటివి చేయవచ్చు. వీటితో పాటు MBA చేస్తే కెరీర్‌కి మంచిది. చార్టెడ్ అకౌంట్స్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెన్సీ వంటి కోర్సులు కూడా కామర్స్ చదివే అమ్మాయిలు జాయిన్ అవ్వవచ్చు. ఈ డిగ్రీలకు మంచి శాలరీలు వస్తాయి. డిమాండ్ కూడా ఎక్కువే.
ఫ్రీలాన్సింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, బిజినెస్ వంటివి చేయాలనుకునే అమ్మాయిలు డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ కోర్సుల్లో చేరవచ్చు. షార్ట్ టెర్మ్‌లో ఈజీగా జాబ్స్ తెచ్చుకోవడంలో హెల్ప్ అవుతాయి. హాస్పిటాలిటీ, టూరిజం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు హోటల్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులు చేయవచ్చు. క్రియేటివ్‌గా కెరీర్‌ను తీసుకెళ్లాలనుకునేవారికి ఇవి బెస్ట్.
ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే..
టీచింగ్, రచయిత, సివిల్ సర్వీసెస్, మీడియాలో చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నవారు BA తీసుకోవచ్చు. సైకాలజీ, ఇంగ్లీష్, పొలిటకల్ సైన్స్, జర్నలిజం కోర్సులు చేయవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్‌పై ఇంట్రెస్ట్ ఉంటే వాటి వైపు వెళ్లొచ్చు. ఇవి ఫ్రీలాన్స్కి, జాబ్స్‌కి, బిజినెస్ సొంతంగా చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతాయి. మీరు గొప్ప ఆర్టిస్ట్ లేదా మ్యూజిషన్, డ్యాన్స్ వంటి వాటిలో ముందుకు వెళ్లాలనుకుంటే ఫైన్ ఆర్ట్స్ బెస్ట్. లాయర్ అవ్వాలనుకునేవారికి హై డిమాండ్ ఉంది. కాబట్టి BAలో LLB లేదా BBA LLB చేయవచ్చు.
నర్సింగ్, టీచింగ్, సివిల్, డిఫెన్స్‌లో అమ్మాయిలకు మంచి కెరీర్ ఉంది. ఫారిన్ ల్యాంగ్వేజ్ నేర్చుకుని దానికి ట్రాన్స్‌లేట్ చేయడం, ఎయిర్ హోస్టస్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్ వంటివి కూడా చేయవచ్చు. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉండే.. మీరు చేయగలను అనుకునేవి మాత్రమే కెరీర్‌కోసం ఎంచుకోండి. ఎవరో చెప్పారని లేదా ఇంకెవరిదో బలవంతం మీద ఇంటర్ తర్వాత కెరీర్ ఎంచుకోకూడదు. లేదంటే లైఫ్ లాంగ్ రిగ్రేట్ అవ్వాల్సి వస్తుంది.






















