అమ్మాయిలు ఒడిలో ల్యాప్​టాప్​ పెట్టుకుంటే కలిగే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri

ఈ మధ్యకాలంలో అందరికీ వర్క్ ల్యాప్​టాప్​తోనే ఉంటుంది. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే.. దానిని టేబుల్​పై కాకుండా ఒడిలో పెట్టుకుని వాడతారు.

అయితే ల్యాప్​టాప్ అస్సలు ఒడిలో పెట్టుకుని వర్క్ చేయవద్దని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా అమ్మాయిలు అస్సలు ఒడిలో పెట్టుకోకూడదట.

​ల్యాప్​టాప్​లు వేడిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దీనిని ఒడిలో పెట్టుకుంటే ఆ ప్రాంతంలో వేడి పెరుగుతుంది. ఎక్కువ కాలం ఇలా చేస్తే సంతానోత్పత్తి సమస్యలు రావొచ్చు.

ల్యాప్​టాప్​ నుంచి వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ కిరణాలను విడుదల చేస్తుంది. ఇది గర్భస్రావమయ్యే ప్రమాదం పెంచుతుంది. జనన లోపాలు కూడా వచ్చే ప్రమాదముంది.

స్కిన్ ఇరిటేషన్​ను పెంచుతుంది. వేడి చేయడంతో పాటు స్కిన్ డార్క్​నెస్​ని పెంచుతుంది.

భంగిమ మారిపోతుంది. ఒడిలో ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల మీరు కూర్చొనే భంగిమ మారిపోతుంది. వెన్నునొప్పి, ఒత్తిడి పెరుగుతుంది. భుజం, చేతుల నొప్పులు వస్తాయి.

ఇది రక్తప్రసరణను తగ్గిస్తుంది. మీరు యాక్టివ్​గా ఉండలేరు. మెటబాలీజం తగ్గుతుంది. వాపు, డీప్ సిర థ్రాంబోసిస్ సమస్యలను పెంచుతుంది.

ల్యాప్​టాప్​ని ఉపయోగించేప్పుడు స్టాండ్ లేదా డెస్క్ ఉపయోగించాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే చూసేందుకు సరైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

బిల్డ్ ఇన్​ కూలింగ్ సిస్టమ్స్​ని ఎంచుకుంటే మంచిది. ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తుంటే మధ్యలో గ్యాప్స్ తీసుకోమని చెప్తున్నారు.