Sweedon Village Name : పొరపాటున కూడా అక్కడికి వెళ్లి ఇది ఏ ఊరని అడగకండి ! చెబితే తట్టుకోలేరు..
బూతు అర్థాలతో ఉండే గ్రామాల పేర్లతో ఆ గ్రామ వాసులకు ఇబ్బందే. ఎవరైనా పేరు అడిగితే చెబితే ఓ బాధ.. చెప్పకపోతే మరో బాధ. అలాంటి బాధనే అనుభవిస్తోంది.. స్వీడన్‌లోని ఓ గ్రామం..
ఆ దారి వెంట అలా లాంగ్ డ్రైవ్‌కు వెళ్తూ... ఏ ఊరు వచ్చామో అని రోడ్డు పక్కన ఉన్న వారిని అడిగి తెలుసుకుందామని కారు ఆపి.. " బాబూ.. ఇదేం ఊరు " అని అడిగారనుకుకోండి.. వెంటనే భయంకరమైన బూతు మాట ఒకటి వినిపిస్తుంది. ఊరు పేరు అడిగినందుకు బూతులు తిడతావా అని ఎదుటి వారికి బీపీ పెరుగుతుంది కానీ.. పేరు మాత్రం మార్చరు అదే చెబుతారు. చివరికి ఊరు పేరు అడిగిన వ్యక్తే రియలైజ్ అయి... ఆ " బూతే" ఆ ఊరి పేరు అని తెలుసుకుని.. మరోసారి ఆ దారిలో వస్తే అక్కడ మాత్రం ఆగి.. ఊరి పేరు అడగకూడని డిసైడై వెళ్లిపోతారు.
స్వీడన్‌లో అంతమైన ప్రకృతి మధ్య ఉండే ఆ చిన్న గ్రామ వాసులకు అది కామన్ ఎక్స్‌పీరియన్స్. ఆ ఊరి పేరు "ఫకే". స్వీడిష్‌లో ఆ పదానికి అందమైన అర్థం ఏదో ఉంది. కానీ ఇంగ్లిష్ లో మాత్రం చాా తేడా అర్థం ఉంది. అలా ఉదని ఆ గ్రామస్తులు ఎప్పుడూ ఫీల్ కాలేదు. తమ గ్రామం పేరును గొప్పగా చెప్పుకునేవారు. అయితే ఇటీవల వారు కూడా తమకు ఆ పేరు వద్దని.. అర్జంట్‌గా మార్చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ల కష్టాలు వినిపి స్వీడన్ అధికారులు కూడా ఆ దరఖాస్తును ప్రాసెస్ చేస్తున్నారు.
Also read: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? హ్యాపీగా తినవచ్చు... కానీ ఈ జాగ్రత్తలతో...
అయితే ఇంత కాలం రాని పేరు ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే... ఆ పేరును సోషల్ మీడియా సైట్లలో బ్లాక్ చేయడమే. సోషల్ మీడియా సైట్లు కొన్ని అభ్యంతరక పేర్లను బ్లాక్ చేశాయి. సెక్స్, ఫక్ లాంటి వాటిని చూపించవు. ఆ గ్రామం వాళ్లేమో.. సోషల్ మీడియాను ఉపయోగించుకుని తమ గ్రామంలో పండిన పంటలు.. ఇతర ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకుని అమ్ముతూ ఉంటారు. ఈ పేరు వల్ల వాళ్ల వ్యాపారం దెబ్బతింటోంది. ఎన్ని సార్లు సోషల్ మీడియా కంపెనీలకు రిక్వెస్ట్ పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఉపాధి దెబ్బతినకుడా ఉండాలంటే పేరు మార్చుకోక తప్పదని డిసైడై ఆ మేరకు ప్రోసీడ్ అయ్యారు.
Also read: మానసిక హింసకు గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ వచ్చే అవకాశం... ఏంటీ బ్రోకెన్ హార్ట్?
నిజానికి ఇలాంటి అసభ్యకర పదాలతో ఉండే గ్రామాల పేర్లు విదేశాల్లో కాదు.. ఇండియాలోనూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అయితే గ్రామస్తులే వాటి వాడుక పేరును గాంధీ నగర్ అనో... మరొకటనో మార్చేసుకుని పిలుచుకుంటున్నారు. కానీ రికార్డుల్లో మాత్రం "కొజ్జేపల్లి" లాంటి పేర్లు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.