Health Diseases : మధుమేహం ఉన్నవారికి, ఆడవాళ్లకే ఆ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువట
Thyroid Symptoms and Causes : థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది. దానిలో ఎన్ని రకాలు ఉంటాయి. కారకాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
Thyroid Diseases : థైరాయిడ్.. వయసుతో, లింగబేధం లేకుండా వచ్చే ఆరోగ్య సమస్యల్లో ఇది ఒకటి. ఇది పురుషులు, స్త్రీలు, శిశువులు, యువకులు, వృద్ధులు ఇలా ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. ఇది బై బర్త్నే కొందరికి రావచ్చు. మహిళల్లో రుతి విరతి తర్వాత రావొచ్చు. ఇలా వచ్చే దానిని హైపో థైరాయిడిజం అంటారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. పురుషుల కంటే స్త్రీలకు ఎనిమిది రెట్లు థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలలో హార్మోన్ల ప్రభావం వల్ల ఇది కలుగుతుంది. వయసుతో పాటు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే థైరాయిడ్ అనేది చాలా సాధారణమైన వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో దీనిని బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. అయితే థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణాలు ఏముంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
థైరాయిడ్ వారికి వచ్చే అవకాశం ఎక్కువ..
మీ కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ ఉంటే.. మీకు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత, మధుమేహం టైప్ 1, అడ్రినల్ లోపం, ఆర్థరైటిస్ వంటి వైద్య సమస్యలున్నప్పుడు థైరాయిడ్ ప్రమాదం పొంచి ఉంటుంది. అయోడిన్ అధికంగా ఉండడం వల్ల, 60 ఏళ్లు పైబడిన వారిలో.. ముఖ్యంగా మహిళల్లో గతంలో థైరాయిడ్ లేదా క్యాన్సర్ చికిత్స తీసుకున్న వారికి థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
థైరాయిడ్ రకాలు
ఈ వ్యాధిలో రెండు ప్రధాన రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంధి పని చేసే విధానాన్ని ఇతర సమస్యలు ప్రభావితం చేయడంవల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశముంది.
హైపో థైరాయిడిజం కారకాలు
థైరాయిడిటిస్ : ఈ రకమైన థైరాయిడ్ మీకు వస్తే థైరాయిడ్ గ్రంధి వాపు మీకు తెలుస్తుంది. దీనివల్ల థైరాయిడ్ ఉత్పత్తి చేసే హార్మోన్ల పరిమాణాన్ని తగ్గిస్తుంది.
హషిమోటోస్ థైరాయిడిటిస్ : ఇది స్వయం ప్రతిరక్షక స్థితి. ఇక్కడ శరీరంలోని కణాలు థైరాయిడ్‌పై దాడి చేసి దెబ్బతీస్తాయి. ఇది వారసత్వంగా వస్తుంది.
ప్రసవానంతర థైరాయిడిటిస్ : ప్రసవం తర్వాత ఈ సమస్య 9 శాతం మహిళల్లో సంభవిస్తుంది.
అయోడిన్ లోపం : అయోడిన్ హ్మార్మోన్లను ఉత్పత్తి చేయడానికి థైరాయిడ్ గ్రంధి ఉపయోగపడుతుంది. అయితే గ్రంథి ఉత్పత్తి చేయలేకపోతే అయోడిన్ లోపం ఏర్పడుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిలో వస్తున్న సమస్య.
థైరాయిడ్ గ్రంధి పని చేయకుంటే.. కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయదు. కొందరికి పుట్టుక నుంచే ఈ సమస్య ఉంటుంది. దానికి చికిత్స చేయించకుండా వదిలేస్తే.. పిల్లలకి భవిష్యత్తులో శారీరక, మానసిక సమస్యలు రావొచ్చు. కాబట్టి నవజాత శిశువులుక థైరాయిడ్ పరీక్ష కచ్చితంగా చేయించాలి.
హైపర్ థైరాయిడిజం కారకాలు
గ్రేవ్స్ : ఈ సమస్య ఉన్నవారిలో థైరాయిడ్ గ్రంధి అతి చురుగ్గా పని చేస్తుంది. చాలా హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
నోడ్యూల్స్ : హైపర్ థైరాయిడిజం థైరాయిడ్‌లో అతిగా పనిచేసే నాడ్యూల్స్ వల్ల రావచ్చు.
థైరాయిడిటిస్ : ఇది కొందరిలో చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. మరికొందరిలో అస్సలు ఎలాంటి ప్రభావం చూపించదు.
అధిక అయోడిన్ : మీ శరీరంలో అయోడిన్ ఎక్కువగా ఉన్నప్పుడు.. థైరాయిడ్ అవసరమైన దానికంటే ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్లను తాయరు చేస్తుంది.
మధుమేహం ఉన్నవారిలో
మీకు మధుమేహం ఉంటే.. మధుమేహం లేని వ్యక్తుల కంటే మీకు థైరాయిడ్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారిలో త్వరగా మధుమేహం వచ్చే అవకాశముంది. వారితో పోలిస్తే.. టైప్ 2 మధుమేహం ఉన్నవారికి దీని ప్రభావం తక్కువగానే ఉంటుంది.
థైరాయిడ్ లక్షణాలు
థైరాయిడ్ ఉంటే ఆందోళన, చిరాకు, భయం ఎక్కువగా ఉంటుంది. నిద్రపోయేందుకు ఇబ్బందులు పడతారు. బరువు తగ్గడం లేదా పెరగడం వంటివి జరుగుతాయి. కండరాల బలహీనత, వణుకు, పీరియడ్స్‌లో మార్పులు, వేడికి సెన్సిటివ్‌గా మారడం వంటివి దీనిలోని లక్షణాలే. కంటి సమస్యలు పెరుగుతాయి. మతిమరుపు, జుట్టు రాలడం, ఏమి తినకపోయినా బరువు పెరగడం, చలికి సెన్సిటివ్‌గా ఉండడం వంటివి కూడా థైరాయిడ్ లక్షణాలే.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీకు థైరాయిడ్ ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. తగినంత నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. వైద్యులు సూచించిన మందులు కచ్చితంగా తీసుకోవాలి. రెగ్యూలర్ చెక్అప్ చేయించుకోవాలి. ఇది థైరాయిడ్ పెరగకుండా చేస్తుంది.
Also Read : టెస్ట్ కన్నా ముందే గర్భవతి అవునో కాదో తెలుసుకోవచ్చట!