Skin Care: శీతాకాలంలో చర్మం పొడి బారిపోతుందా? ఇలా చేస్తే మృదువుగా మారుతుంది
చలికాలంలో చర్మం తెల్లగా కనిపిస్తుంది. గోర్లతో గీరితే తెల్లగా అసహ్యంగా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇలా ట్రై చేసి చూడండి.
చలికాలం వచ్చేసింది చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ఈ సమయంలో చర్మం తేమని కోల్పోయి పొడిబారినట్టుగా కనిపిస్తుంది. చేతులు, మొహం తెల్లగా పగిలిపోయినట్టు కనిపిస్తాయి. ఒక్కోసారి చర్మం పొలుసుగా కూడా ఉంటుంది. సహజ తేమని కోల్పోవడం వల్ల దురద, పొడి చర్మం ఎర్రబడుతుంది. చూసేందుకు కూడా చర్మం తెల్లగా, పొడిపొడిగా అనిపిస్తుంది. చర్మం మృదుత్వం కోల్పోతుంది. అందుకే చర్మం కోసం సరైన పదార్థాలు ఎంచుకోవాలి. చర్మాన్ని హైడ్రేట్ గా చేయడమే కాకుండా తేమని కోల్పోకుండా అడ్డుకుంటుంది. శీతాకాలమంతా ఆరోగ్యకరమైన చర్మాన్ని కలిగి ఉండటం కోసం ఈ నాలుగు రకాల ఆయిల్స్ వినియోగిస్తే చక్కని ఫలితాలు పొందుతారు. వీటి వల్ల శీతాకాల చర్మపు సమస్యలు ఎదుర్కోవచ్చు.
స్క్వాలేన్: చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో బాగా ఉపయోగపడే ప్రసిద్ధమైనదిగా గుర్తింపు పొందింది. ఆలివ్, రైస్ బ్రాన్ వంటి మొక్కలతో దీన్ని తయారు చేస్తారు. ఇది నూనె అయినప్పటికీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. స్క్వాలేన్ తేలికగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. పొడి, దురదతో కూడిన చర్మాన్ని మృదువుగా చేసి పోషణ అందిస్తుంది. స్క్వాలేన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వాపు, చర్మం ఎర్రగా మారదాన్ని తగ్గిస్తాయి. ఎటువంటి చర్మ సమస్యకి అయిన ఇది చక్కని రెమిడిగా ఉపయోగపడుతుంది. ఉత్తమమైన చర్మ సంరక్షణ పదార్థాలలో ఒకటి.
హైలురోనిక్ యాసిడ్: చలికాలంలో ఎటువంటి చర్మానికి అయిన ఉపయోగపడే ఉత్తమ చర్మ సంరక్షణ పదార్థాల్లో ఇది ఒకటి. ఇది రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. చర్మంపై నీటిని తీసుకొచ్చేందుకు సహకరిస్తుంది. తేమ ఉండేలా చేసి చర్మం పొడి బారకుండా చేస్తుంది.
ఆర్గాన్ ఆయిల్: ఇది ఆర్గాన్ చేట్ల కెర్నల్స్ నుంచి తియ్యబడుతుంది. ఆర్గాన్ ఆయిల్ కి చర్మాన్ని మృదువుగా చేసే లక్షణాలని కలిగి ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. శీతాకాలపు పొడి చర్మాన్ని ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ అధికంగా ఉన్నప్పటికీ ఆర్గాన్ ఆయిల్ చాలా తేలికగా ఉంటుంది. ఇందులోని చిన్న మాలిక్యులర్ ఫార్ములా కారణంగా ఈ నూనె చర్మంలోకి చొచ్చుకుపోయి స్కిన్ పొడి బారిపోకుండా చూస్తుంది. జిగటగా అనిపించకుండా చర్మంలోకి శోషించబడుతుంది. ఇది రాసుకున్న కూడా చర్మం జిడ్డుగా అనిపించదు.
పటావా ఆయిల్: చర్మ సంరక్షణలో పోషకాహార మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. వృద్ధాప్య ముడతలు, జిడ్డు చర్మం ఉన్న వారికి బాగా సహాయపడుతుంది. ఎపిడెర్మిస్‌పై లిపిడ్ ఫిల్మ్ ఏర్పడటం ద్వారా పొడి చర్మాన్ని పునరుద్ధరించడానికి అద్భుతమైన మాయిశ్చరైజింగ్ గా పని చేస్తుంది. పటావా ఆయిల్‌లో విటమిన్ ఇ, విటమిన్ ఎ, అమైనో యాసిడ్ ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని దృఢంగా మారుస్తుంది. చర్మంలోకి శోషించబడుతుంది. శక్తివంతమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. తేలికగాను ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.