News
News
X

Vastu Tips: ఈ సుగంధ ద్రవ్యాలు మీ వెంట పెట్టుకుంటే అదృష్టం, సంపద మీదే!

కొన్ని సుగంధ ద్రవ్యాలు వంటలకి రుచి మాత్రమే కాదు ఇంట్లో పాజిటివిటీ ఉండేలా కూడా చేస్తాయి.

FOLLOW US: 
Share:

సుగంధ ద్రవ్యాలు వంటగదిలో ఎప్పుడు విలువైనవి. అవి ఆధ్యాత్మికపరంగా, వైద్యపరంగా ఉపయోగపడతాయి. ఇవి ఆహారానికి రుచి ఇవ్వడమే కాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ లేదా వాలెట్ లోపల పెట్టుకుంటే ప్రతికూల శక్తులని తొలగించేందుకు సహకరిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ పదార్థాలు ఎప్పుడు మీ వెంట ఉంటే అడ్డంకులు అన్ని తొలగిపోతాయి. మీరు అభివృద్ది చెందడానికి తక్షణమే సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. వీటిని మీ వెంట ఎప్పుడు పెట్టుకుంటే మంచి జరుగుతుందని వాస్త శస్త్ర నిపుణులు చెబుతున్నారు.

సొంపు, లవంగం

ఈ రెండు మసాలా దినుసులు ప్రతికూల శక్తులని ఎదుర్కొనేందుకు ఉపయోగిస్తారనే నమ్మకం కొన్ని యుగాలుగా ఉంది. అనేక సంస్కృతులలో తలుపు లేదా గుమ్మానికి సోంపు లేదా లవంగం ఉన్న చిన్న మూట కట్టి పెడతారు. ఇవి దెయ్యాలు, ఆత్మలని ఇంటికి దూరంగా ఉంచుతాయని నమ్ముతారు. అంతే కాదు సోంపు తల దిండు కింద ఉనహుకుంటే బాగా నిద్రపట్టడానికి సహాయపడతాయి. లవంగాన్ని పర్సులో ఉంచుకోవడం వల్ల ప్రతికూలత పరిస్థితులకి దూరంగా ఉంచుతుంది. సోంపు, లవంగం తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి, దీర్ఘాయువు, ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, ధైర్యం, బలం పెరుగుతాయని నమ్ముతారు. లక్ష్మీ దేవికి ఎర్ర గులాబీలతో పాటు లవంగాలు కలిపి పూజ చేయడం ద్వారా అదృష్టం, డబ్బు కలిసి వస్తాయని నమ్ముతారు.

గరం మసాలా

గరం మసాలా వేయడం వల్ల వంటకం ఏదైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మసాలా మీకు సంపడం విజయాన్ని ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఈ మసాలా ప్యాకెట్ మీ వాలెట్ లో ఉంచుకోండి. లేదంటే ఈ పొడి ఇల్లు లేదా షాపు మూలల్లో చల్లుకోవచ్చు. ఇది విజయం వరించేలా అదృష్టం, డబ్బు తీసుకొస్తుందని నమ్మకం.

దాల్చిన చెక్క

ఈ తీపి మసాలా సంపదని పెంచడంలో సహాయపడుతుందని అంటారు. పొదుపు పెంచుకోవడానికి చేయాల్సిందల్లా దాల్చిన చెక్కని పర్సులో ఉంచుకోవడం. ఇది ఆరోగ్యం, ప్రేమ, విజయం అందిస్తుంది. ఇది దగ్గర పెట్టుకోవడం వల్ల మన చుట్టూ పాజిటివిటీ ఉంటుందని అంటారు.

పుదీనా ఆకులు

వాస్తు ప్రకారం సంపద పొందేందుకు ఇది అద్భుతమైన మూలిక మార్గం. వాలెట్ లేదా డబ్బులు ఉండే ప్రదేశంలో 2-3 పుదీనా ఆకులు ఉంచుకుంటే మంచిది. దాని సువాసన మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు పెట్టె పెట్టుబడులు విజయవంతంగా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. సంపద పెంచుకోవడానికి పుదీనా ఆకుల రంగు డబ్బు నోట్లకి అయ్యేలా చూసుకుంటే మంచిదని నమ్మకం.

ఇక పచ్చ యాలకులు, నల్ల మిరియాలు తీసుకుంటే ఇంట్లోని కష్టాలు తీరిపోతాయని నమ్ముతారు. యాలకులు తింటే మనసుని శాంతపరిచి, గందరగోళం తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. జీవితంలో కెరీర్ వృద్ది అవకాశాలని ఆహ్వానించడానికి ఈ మసాలా తింటే మంచి ఫలితం పొందుతారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: PCOS అంటే ఏమిటీ? హార్మోన్లు సమతుల్యత కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?

Published at : 17 Jan 2023 03:26 PM (IST) Tags: Vastu Shastram Positive Energy Vastu Tips Clove Fennel Spices Importance

సంబంధిత కథనాలు

సప్లిమెంట్లను వాడుతున్నారా? ఏ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు గ్రీన్ టీ తాగకూడదో తెలుసా?

సప్లిమెంట్లను వాడుతున్నారా? ఏ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు గ్రీన్ టీ తాగకూడదో తెలుసా?

సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి

సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి

రైస్ టీ ఎప్పుడైనా తాగారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రైస్ టీ ఎప్పుడైనా తాగారా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ జ్యూస్ రోజూ తాగారంటే చర్మం మెరిసిపోవడం ఖాయం

ఈ జ్యూస్ రోజూ తాగారంటే చర్మం మెరిసిపోవడం ఖాయం

జుట్టు రాలిపోతోందా? మీ ఆహారంలో ఈ మార్పులు చేసి చూడండి

జుట్టు రాలిపోతోందా? మీ ఆహారంలో ఈ మార్పులు చేసి చూడండి

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్