News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Beauty Tips: వంటగదిలో దొరికే ఈ అయిదు పదార్థాలు ముఖానికి పూయద్దు,అవేంటంటే

ముఖానికి పూయకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి, కానీ చాలా మంది తెలియక రాసుకుంటున్నారు.

FOLLOW US: 
Share:

ముఖానికి చాలా పదార్థాలు పూస్తూ ఉంటారు. పసుపు, పండ్ల రసాలు,పాలు, పెరుగు... ఇలా వంటింట్లో దొరికే ఎన్నో పదార్థాలను అందానికి వాడుతుంటారు. రసాయన ఆధారిత ఉత్పత్తులను వాడేందుకు ఇష్టపడని వ్యక్తులు ఇలా ఇంట్లో వాడే వస్తువులనే వినియోగిస్తుంటారు. సహజ ఉత్పత్తులు చర్మానికి ఎటువంటి హాని కలగించవని చాలా మంది అభిప్రాయం. అందుకే వాటిని స్ర్కబ్ లుగా, క్లెన్సర్లుగా, టోనర్లుగా, ఫేస్ ప్యాక్ లుగా వాడుతుంటారు. కానీ వంటగదిలో దొరికే కొన్ని పదార్థాలలో ముఖానికి అప్లై చేయకూడనివి కొన్ని ఉన్నాయి. అవేంటంటే...

నిమ్మరసం
దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పిగ్మెంటేషన్ సమస్యలను, ఇతర చర్మ సమస్యలను తీరుస్తుందని, చర్మాన్ని కాంతివంతం చేయడానికి దీని రసాన్ని ముఖానికి రాసుకుంటారు. ఇది మంచిది కాదు. నిమ్మరసాన్ని నేరుగా ముఖచర్మంపై రాయకూడదు. నిమ్మకాయలో అధిక ఆమ్ల స్వభావం ఉంటుంది. ఇది pH బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల చర్మంపై అలెర్జీలు, పొడిగా మారడం అధికమవుతుంది. అందుకే నిమ్మరసం ఒక్కటే నేరుగా చర్మంపై రాయకూడదు. ఏదైనా మిశ్రమంలో చాలా తక్కువ మోతాదులో కలుపుకోవాలి. అరస్పూను కన్నా అధికంగా రాయకూడదు. 

చక్కెర
చాలామంది చర్మంపై మురికిని పోగొట్టుకోవడానికి చక్కెరను స్క్రబ్‌లా వాడతారు. చక్కెరతో  రుద్దడం వల్ల చర్మంపై వాపు, చికాకు, మంట, పొడి చర్మం సమస్యలు మొదలవుతాయి. మొటిమల సమస్యకు ఉప్పు, చక్కెర ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఆ రెండూ వాడడం వల్ల మచ్చలు, మంట మరింత పెరుగుతాయి. 

బేకింగ్ సోడా
బేకింగ్ సోడాను ముఖానికి ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. దీన్ని ఫేస్ మాస్క్ గా లేదా స్క్రబ్ గా వాడడం వల్ల చర్మంపైన ఉండే నూనెను పూర్తిగా తొలగిస్తుంది. ఆ నూనె పూర్తిగా పోతే ఇన్ఫెక్షన్లు, మొటిమలు బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు దీన్ని వాడడం వల్ల హైపర్‌పిగ్మెంటేషన్‌ వచ్చే సమస్య ఉంది. కాబట్టి బేకింగ్ సోడా మీ బ్యూటీ ఉత్పత్తుల జాబితా నుంచి తొలగించాలి. 

దాల్చినచెక్క పొడి 
దాల్చినచెక్క పొడి వంటలకు మంచి సువాసనను అందిస్తుంది.అలాగే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. కానీ అందాన్ని పెంచే ఉత్పత్తి మాత్రం కాదు.ఈ మసాలాను నేరుగా చర్మంపై రాయకూడదు. నిజానికి దీన్ని ఏ సౌందర్య ఉత్పత్తులలోనూ వాడినట్టు కనిపించదు. ఇది చర్మానికి చికాకు కలిగిస్తుంది. అంతగా వాడాలనుకుంటే ఆలివ్ ఆయిల్, తేనె వంటి వాటిల్లో కాస్త కలుపుకుని అప్లయ్ చేసుకోవాలి. 

వెజిటబుల్ నూనెలు
కొందరు వ్యక్తులు చర్మానికి వెజిబుల్ నూనెలు రాస్తుంటారు. అవి రాయడం వల్ల తాత్కాలికంగా కాస్త మంచి ఫలితాలు వచ్చినప్పటికీ దీర్ఘకాలంగా చూస్తే అవి రాయడం మంచిది కాదు. ఈ నూనెలు రసాయనాలతో కలిపి ప్రాసెస్ చేస్తారు. వాటిని ముఖంపై ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. పొడి చర్మం ఉన్నవారు కోల్డ్ ప్రెస్డ్, ఆర్గానిక్ ప్లాంట్ నూనెలను మాత్రమే ఉపయోగిస్తారు. 

Also read: పుట్టుమచ్చలు అధికంగా ఉన్నాయా? అది కూడా ఒక రకమైన క్యాన్సరే

Also read: అరుదైన వ్యాధితో బాధపడుతున్న మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు, అందుకే లావైపోయిందట

Published at : 03 Apr 2022 07:03 AM (IST) Tags: Beauty hacks Beauty tips Kitchen Ingredients Kitchen Hacks

ఇవి కూడా చూడండి

Mineral Water: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!

Mineral Water: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!

Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!

Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!

Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా- మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!

Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా-  మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!

Diabetes: వీటి వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త

Diabetes: వీటి వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త

High BP: హై బీపీ లేనివారు కూడా ఉప్పు తింటే ప్రమాదమే

High BP: హై బీపీ లేనివారు కూడా ఉప్పు తింటే ప్రమాదమే

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?