Melanoma: పుట్టుమచ్చలు అధికంగా ఉన్నాయా? అది కూడా ఒక రకమైన క్యాన్సరే
క్యాన్సర్లలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో అధికంగా పుట్టుమచ్చలను కలిగి ఉండడం కూడా.
![Melanoma: పుట్టుమచ్చలు అధికంగా ఉన్నాయా? అది కూడా ఒక రకమైన క్యాన్సరే Do you know about Mole cancer or Melanoma? The symptoms are as follows Melanoma: పుట్టుమచ్చలు అధికంగా ఉన్నాయా? అది కూడా ఒక రకమైన క్యాన్సరే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/01/50545f27d8ec12d8e52044f853c2d0af_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కొందరికి పుట్టు మచ్చలు అధికంగా ఉంటాయి. కనీసం 50 నుంచి వంద వరకు ఉండొచ్చు. ఒకే ప్రదేశంలో చిన్నచిన్న చుక్కల్లా కనిపిస్తాయి. అది కూడా ఒకరకమైన క్యాన్సర్ అయ్య అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. దాన్ని ‘మోల్ క్యాన్సర్ లేదా మెలనోమా’అంటారు. అలాగని పుట్టు మచ్చలు అధికంగా ఉండే కచ్చితంగా అది క్యాన్సరేనని చెప్పలేం. కానీ పుట్టుమచ్చలు అధికసంఖ్యలో ఏర్పడుతున్నప్పుడు ఓసారి వైద్యుడిని సంప్రదించడం చాలా మేలు.
పుట్టుమచ్చ క్యాన్సర్ కణితిగా ఎలా మారుతుంది?
క్యాన్సర్ పుట్టుమచ్చ లేదా మెలనోమా చాలా కొద్దిమందిలో కలుగుతుంది. ఇది చర్మకణాలలోని డీఎన్ఏకు చాలా నష్టం కలిగిస్తుంది. పుట్టుమచ్చ క్యాన్సర్ లేదా మెలనోమా అనేది ఒక రకమైన చర్మ క్యాన్సర్. ఇది మెలనైసైట్స్ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు అనియంత్రంగా పెరగడం, పరివర్తన చెందడం ద్వారా ఏర్పడుతుంది. మెలనోసైట్స్ నుంచి మెలనిన్ ఉత్పత్తి అవుతుంది. చర్మం రంగుకు ఇదే బాధ్యత వహిస్తుంది. మెలనిన్ చాలా ముఖ్యమైనది. సూర్యరశ్మిలోని ప్రమాదకరమైన యూవీ కిరణాల నుంచి ఇదే చర్మాన్ని కాపాడుతుంది. రంగు తక్కువగా ఉన్నవారిలో మెలనిన్ ఉత్పత్తి అధికంగా ఉంటుంది. పుట్టుమచ్చలు మెలనోసైట్లు అధికంగా పోగుపడిన సమూహాలు. అందుకే అంత నల్లగా ఉంటాయి. దెబ్బతిన్న మెలనోసైట్లు విభజనకు గురై క్యాన్సర్ పుట్టుమచ్చలుగా మారుతాయి.
ఎందుకొస్తాయి?
సాధారణంగా సూర్యరశ్మిలోని హానికరమైన అతినీలలోహిత కిరణాలకు అధికంగా గురైనప్పుడు క్యాన్సర్ పుట్టుమచ్చలు వస్తుంటాయి. కొందరిలో తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా కూడా క్యాన్సర్ పుట్టుమచ్చులు వచ్చే అవకాశం ఉంది.
చికిత్స...
మిగతా క్యాన్సర్లలాగే పుట్టుమచ్చ క్యాన్సర్ కు కూడా చికిత్స ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటివి చేస్తారు. ఇవి ప్రాణాంతకమైనవి కావు. కానీ ఈ పుట్టుమచ్చ క్యాన్సర్ ఇతర అవయవాలకు అంటే ఎముకలు, రక్తనికి విస్తరిస్తే మాత్రం సమస్య చాలా తీవ్రంగా మారుతుంది. అందుకే ఏమాత్రం సందేహం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సమస్యకు చికిత్స సులభతరం అవుతుంది.
లక్షణాలు
1. కొత్త పుట్టమచ్చలు హఠాత్తుగా రావడం
2. ఇప్పటికే ఉన్న పుట్టుమచ్చల రంగు, ఆకారం, లేదా సైజు మారడం
3. నొప్పి పుట్టే పుట్టుమచ్చ
4. దురద పెట్టడం, రక్తం రావడం
ఇలా సాధారణ పుట్టుమచ్చలో ఏమాత్రం తేడా కనిపించినా తేలికగా తీసుకోవద్దు.
Also read: ఉగాదికి తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి ఇలా
Also read: ఎలాంటి ఆహారాలు తింటే రక్తనాళాలు మూసుకుపోతాయో తెలుసా? ఇదిగో ఇవే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)