అన్వేషించండి

Heart Health: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి - అవి మాత్రం తినొద్దు!

చిన్న వయసులోనే గుండె పోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మనం ఏయే ఆహారాలు తీసుకోవాలనేది తప్పకుండా తెలుసుకోవాలి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సమస్యల్లో గుండె సమస్యలు అగ్రస్థానంలో ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచ మరణాలలో ఐదో వంతు భారత్ లోనే నమోదు అవుతాయి. అదీ కూడా యువకులు ఎక్కువగా గుండె పోటుకి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అనారోగ్యకరమైన జీవనశైలి పాటించడమే గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం అనుసరించడం ముఖ్యం.

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు

ఇవి గుండె ఆరోగ్యానికి కీలకమైన పాలిఅన్ శాచురేటెడ్ కొవ్వులు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెల్లో మంటని తగ్గిస్తుంది. హృదయ స్పందనని నియంత్రణలో ఉంచుతుంది. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. చేపలు, అవిసె గింజలు, సబ్జా గింజలు, చియా విత్తనాలు, వాల్ నట్స్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.

సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ తగ్గించుకోవాలి

సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ వినియోగాన్ని పరిమితం చేస్తే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇవి రెడ్ మీట్, వెన్న, చీజ్, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో కనిపిస్తాయి. రక్తప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతాయి. ధమనుల్లో ఫలకాలు ఏర్పడటానికి దోహదపడుతుంది. అథెరోస్క్లెరోసిస్, గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే వీటి వినియోగాన్ని తగ్గించుకోవాలి. బదులుగా లీన్ ప్రోటీన్స్ ఎంచుకోవాలి. నెయ్యికి బదులుగా ఆవాలు లేదా రైస్ బ్రౌన్ ఆయిల్ ఉపయోగించాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తగ్గించుకోవాలి.

ఫైబర్ బాగా తినాలి

ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డైటరీ ఫైబర్ ఉన్న పదార్థాలు జీర్ణవ్యవస్థని కాపాడతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తాయి. ధమనుల్లో ఫలకాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. గుండె పోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. బజ్రా, రాగి, జోవర్ వంటి తృణధాన్యాలు చనా, మూంగ్, రాజ్మా వంటి పప్పులు ఎంచుకుంటే ఉత్తమం.

సోడియం తగ్గించాలి

గుండె పదిలంగా ఉండాలంటే అదుపులో ఉంచుకోవాల్సిన మరొకటి సోడియం. అధిక సోడియం నీరు నిలుపుదలకి దారి తీస్తుంది. ఫలితంగా రక్తపోటుని పెంచుతుంది. అధిక రక్తపోటు గుండె, రక్తనాళాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. స్ట్రోక్, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. రెస్టారెంట్ భోజనం, ప్రాసెస్ చేసిన ఆహారాలు సోడియం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు తగ్గించుకోవాలి. భోజనంలో టేబుల్ సాల్ట్, ఊరగాయల వాడకాన్ని పరిమితం చేయాలి. స్టోర్ కొన్న స్నాక్స్ కంటే ఇంట్లో తయుయర్ చేసుకునే వాటిని ఎంచుకోవాలి. కొత్త మీర్, జీలకర్ర, పసుపు తీసుకుంటే మంచిది.

యాంటీ ఆక్సిడెంట్ ఆహారాన్ని చేర్చుకోవాలి

యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్, కణాలని దెబ్బతీసే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వాపు, ధమనుల్లో ఫలకాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఉసిరి, జామూన్, ఫాల్సా వంటి భారతీయ బెర్రీలు, బాదం, వాల్ నట్ వంటి గింజలు, బచ్చలికూర, మెంతులు, ఆవాలు వంటివి చేర్చుకోవాలి.

చక్కెర ఆహారాలు వద్దు

అధిక చక్కెర వినియోగం బరువు పెరగడానికి, ట్రైగ్లిజరైడ్ స్థాయిలని పెంచుతుంది. అది మాత్రమే కాదు ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుంది. చక్కెర పానీయాలు, ఆహారాలు గుండె పోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: భారత్‌లో చికెన్ పాక్స్ కొత్త వేరియంట్ - ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Embed widget