అన్వేషించండి

Chickenpox: భారత్‌లో చికెన్ పాక్స్ కొత్త వేరియంట్ - ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే?

మొన్న కరోనా, నిన్న నిఫా.. ఇప్పుడు చికెన్ పాక్స్ కొత్త వేరియంట్ భారత్ మీద దాడి చేసేందుకు సిద్ధమైంది.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భారత్ లో మొదటిసారిగా చికెన్ పాక్స్ కి కారణమయ్యే వరిసెల్లా జోస్టర్ వైరస్(VZV) క్లాడ్ వేరియంట్ ఉనికిని కనుగొంది. ఈ క్లాడ్ అనేది ఉపరకం వేరియంట్ లేదా జన్యురూపంగా పరిగణిస్తారు. ఇప్పటి వరకు ఈ క్లాడ్ 9 వేరియంట్ జర్మనీ, యూకే, యూఎస్ వంటి దేశాలలో ఉన్న అత్యంత సాధారణ VZV జాతి. కానీ తొలిసారిగా భారత్ లో కనుగొన్నారు.

వరిసెల్లా జోస్టర్ వైరస్ అంటే ఏంటి?

చికెన్ పాక్స్ అనేది వరిసెల్లా జోస్టర్ వైరస్ అనే వైరస్ వల్ల కలిగే ఒక ఇన్ఫెక్షన్. దీన్నే మనం అమ్మవారు అని కూడా పిలుచుకుంటాం. ప్రధానంగా పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో కనిపిస్తుంది. మనుషులకి సోకే తొమ్మిది హర్పేస్ వైరస్ లో ఇదీ ఒకటి. ఈ కొత్త అధ్యయనంలో VZV కి సంబంధించి 331 అనుమానిత కేసులు నమోదయ్యాయి. వాటిలో 28 వెసిక్యులర్ దద్దుర్లు VZVకి అనుకూలంగా ఉన్నట్టు శాస్ర్తవేత్తలు గుర్తించారు. భారత్ లో ఇప్పటి వరకు క్లాడ్ 1, 5 ఇంతకముందు కనుగొన్నారు. అయితే క్లాడ్ 9 కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారని అధ్యయనం వెల్లడించింది.

భారత్ లో కొత్త క్లాడ్ 9 వేరియంట్ గుర్తించినప్పటికీ రోగులలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న సూచనలు ఏమి లేవు. కోవిడ్ మహమ్మారి సమయంలో కేసులు పెరుగుతున్నప్పుడు ఈ కొత్త క్లాడ్ ని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం సెప్టెంబర్ 6న ఆనల్స్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు.

లక్షణాలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చికెన్ పాక్ లక్షణాలు క్లాడ్ 9 కి కారణమవుతాయి. దద్దుర్లు, జ్వరం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, అలసట, నీరసంగా అనిపిస్తుంది. చికెన్ పాక్స్ దద్దుర్లు సాధారణంగా వైరస్ కి గురైన 2-3 వారాల తర్వాత కనిపిస్తాయి. పాపుల్స్ అనే గడ్డల రూపంలో ఉంటాయి. ఇవి పెరిగితే రోగి జ్వరం, ఒళ్ళు నొప్పు, తలనొప్పి వంటి ఇతర లక్షణాలు అనుభవిస్తారు. 2 వారాల వ్యవధిలో లక్షణాలు పూర్తిగా కనిపిస్తాయి. స్కాబ్ ఏర్పడే వరకు రోగి ఇన్ఫెక్టివిటీ కొనసాగుతోంది.

నివారణ చిట్కాలు

ఈ కొత్త వైరస్ వల్ల భయంకరమైన పరిస్థితులు లేనప్పటికీ వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చికెన్ పాక్స్ ని నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం టీకాలు వేయడం. వైరస్ బారిన పడే ప్రమాదాన్ని నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. సబ్బు, నీరు ఉపయోగించి చేతులని క్రమం తప్పకుండా కడగాలి. దగ్గు, తుమ్ములు వచ్చిన తర్వాత లేదా ఎవరైనా మీ పక్కన తుమ్మినప్పుడు, ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళని తాకినప్పుడు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. చికెన్ పాక్స్ లేదా దద్దుర్లు ఉన్న రోగులకు దూరంగా ఉండటం మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: మళ్ళీ విజృంభిస్తోన్న నిఫా వైరస్- లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

టాప్ హెడ్ లైన్స్

Repeated Pregnancy : 13 సార్లు అబార్షన్.. 14వ సారి గర్భం దాల్చిన మహిళ.. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
13 సార్లు అబార్షన్.. 14వ సారి గర్భం దాల్చిన మహిళ.. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Dussehra Navratri Day 2 : దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
దసరా స్పెషల్ రెండో రోజు శ్రీ గాయత్రి దేవికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రవ్వకేసరి, పులిహోర, కొబ్బరి అన్నం రెసిపీలు ఇవే
Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
Embed widget