అన్వేషించండి

Cancer Symptoms: ఈ జలుబు లక్షణాలు క్యాన్సర్‌కు సంకేతాలు కావచ్చు, వెంటనే చెక్ చేసుకోండి

జలుబును చిన్న చూపు చూడొద్దు. కొన్ని లక్షణాలు గొంతు, నోరు, రక్త సంబంధిత క్యాన్సర్లకు సంకేతం కావచ్చు.

సీజన్లు మారుతున్నప్పుడు వివిధ రోగాలు వెంటాడుతుంటాయి. అయితే, జలుబు మాత్రం సీజన్లతో పనిలేకుండా పలకరిస్తుంది. వేసవిలో చల్లని పానీయాలు తాగినా, ఏసీలో ఎక్కువ సేపు గడిపినా జలుబు చేస్తుంది. అలాగని జలుబును చిన్న చూపు చూడొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. కొన్ని జలుబు సంకేతాలు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని చెబుతున్నారు.  

యూకేలో నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం.. ఏటా 12 వేల మంది తల, మెడ క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు తెలిసింది. వీరిలో కామన్‌కు కనిపించిన లక్షణాలేమిటని పరిశోధిస్తే.. జలుబు లక్షణాలు బయటపడ్డాయి. వాస్తవానికి గొంతు, తలకు సంబంధించిన క్యాన్సర్లను గుర్తించడం అంత ఈజీ కాదు. వాటిని ముందుగానే కనిపెడితే.. నివారణ సాధ్యమని భావించిన నిపుణులు.. ఈ పరిశోధన చేపట్టారు. వారిలో తరచుగా కనిపించిన లక్షణాలు గురించి తెలుసుకున్నారు.

ఎలా తెలుసుకోవాలి? 

⦿ గొంతు దగ్గర వాపు లేదా అక్కడ తాకినప్పుడు నొప్పిగా అనిపించినట్లయితే.. తప్పకుండా అనుమానించాలి. 
⦿ మీరు దీర్ఘకాలిక చెవినొప్పి, చెవులు నిరంతరం మూసుకుపోతున్నా అనుమానించాలి. 
⦿ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు చెవులు మూసుకుపోయినట్లు ఉన్నా, చెవి నొప్పి పెడుతున్నా సందేహించాలి. 
⦿ చెవి నొప్పి వస్తుందంటే.. ఆ చుట్టుపక్కల క్యాన్సర్ ఉన్నట్లు సంకేతం. 
⦿ గొంతు నొప్పి రెండు వారాలు కంటే ఎక్కువ రోజులు ఉన్నా క్యాన్సర్ డౌటే.
⦿ మీ గొంతు బొంగురుగా ఉన్నా లేదా వాయిస్‌లో మార్పు వచ్చినా డాక్టర్‌ను సంప్రదించాలి.
⦿ జలుబు వచ్చినప్పుడు గొంతు దురదగా అనిపించినా, మింగడం కష్టంగా ఉన్నా సందేహించాలి. 
⦿ ఏది తిన్నా నోటికి రుచి లేకపోతే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. 

సాధారణంగా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు గొంతు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాస్తవానికి గొంతు నొప్పి.. స్ట్రెప్ థ్రోట్, అలెర్జీలు, ఫ్లూ, ఇతరాత్ర శ్వాసకోశ వ్యాధులకు లక్షణం. అయితే, గొంతు నొప్పి, జలుబు నిరంతరంగా ఉన్నట్లయితే అది క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించాలి. ఎందుకంటే.. ఇది స్వరపేటిక (వాయిస్ బాక్స్), స్వర తంతువులు (గ్లోటిక్) క్యాన్సర్‌తో సహా అనేక గొంతు క్యాన్సర్లకు అది సూచన కావచ్చు. అలాంటివి తరచుగా వస్తున్నాయంటే.. మీ ఆ ప్రాంతంలో గ్రంధులు ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నట్లు అర్థం. ఆ సమయంలో మెడకు ఎవరువైపులా సున్నితమైన గడ్డలు ఏర్పడతాయి. అవి వారం కంటే ఎక్కువ రోజులు ఉంటే.. అది బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా) లేదా లింఫోమా వంటి సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. ఆ గడ్డలు నొప్పి లేకుండా పరిమాణం పెరుగుతున్నట్లు కనిపిస్తే డాక్టర్‌‌ను సంప్రదించాలి. 

లుకేమియా, లింఫోమా లక్షణాలేమిటీ?

లుకేమియా వచ్చినట్లయితే జ్వరం, చలి, తరచుగా అంటువ్యాధులకు గురికావడం, ముక్కు నుంచి రక్తస్రావం వంటివి ఏర్పడతాయి. లింఫోమా ఏర్పడినట్లయితే శోషరస కణాల్లో వాపు, అలసట, రాత్రిపూట చెమటలు, దురద వంటివి ఏర్పడతాయి.  

అలసర్లు వచ్చినా అనుమానించాల్సిందే

నోటి పూతలు కూడా క్యాన్సర్‌కు సంకేతం. నోటి లోపల, బుగ్గలు, పెదవులు, నాలుకపై ఎక్కువగా ఈ పూతలు వస్తాయి. ఆహారం తిన్నప్పుడు అలర్జీలు ఏర్పడినా, బరువు తగ్గడం, మాట్లాడేందుకు ఇబ్బంది, నోటిలో నొప్పి, నోటి దుర్వాసనలు వచ్చినా డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే.. అల్సర్లు నోటి క్యాన్సర్‌కు సంకేతాలు. ఒక వేళ మీ చెవులు తరచుగా మూసుకుపోతున్నట్లయితే నాసోఫారింజియల్ కార్సినోమా అనే అరుదైన క్యాన్సర్‌కు సంకేతం. ఇది ముక్కు వెనుక భాగాన్ని నోటి వెనుకకు కనెక్ట్ చేసే గొంతుపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్య ఉంటే చెవి నొప్పి, ముఖం వాపు, ముక్కు నుంచి చీము కారుతుంది. కొందరికి రక్తం కూడా కారవచ్చు. 

Also Read : పండుగ వేళ అన్ని తినేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Travis Head: అలా ఎలా  కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
Viral News: సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
Embed widget