Marital Problems: నేటి జంటల మధ్య గొడవలకు కారణమయ్యే విషయాలు ఇవే... అర్థం చేసుకుంటే అపార్థాలుండవ్
వైవాహిక బంధంలో గొడవలు రావడం సహజం, కానీ కొన్నిసార్లు అవి చాలా పెద్దవిగా మారతాయి.
వివాహబంధం కలకాలం నిలబడాలంటే భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోవాలి. అలా సర్దుకుపోనప్పుడు చిన్న గొడవలే పెద్ద తుఫానుగా మారి ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో ప్రధానంగా జరిగే గొడవలు కొన్ని అంశాలపైనే జరుగుతాయి. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడితే మీ వివాహబంధాన్ని నిలబెట్టుకోవచ్చు.
బోరింగ్ లైఫ్
రొటీన్ జీవితం బోరింగ్ మారుతుంది. జీవితభాగస్వామిపై ఆసక్తిని కోల్పోయేలా చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జీవితాల వల్ల ఇద్దరూ పక్కపక్కనే ఉన్నా కూడా మాట్లాడుకోలేని పరిస్థితి. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతోంది. దాదాపు ఫోన్లతోనే జీవితాన్ని గడిపేస్తున్నారు దీంతో జీవితం బోరింగ్ అనిపించి, ఒకరిపై ఒకరికి ఇష్టం, ఇంట్రస్టె కూడా తగ్గిపోతోంది. దాని వల్ల ఇద్దరూ చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు.
మానసికంగా తోడు లేక
చాలా జంటలు అవసరమైన సమయంలో జీవిత భాగస్వామికి ఎమోషనల్‌గా అండగా ఉండలేకపోతున్నారు. ఇది కమ్యూనికేషన్ లోపం వల్ల, బిజీ జీవితం వల్ల జరుగుతోంది. రోజువారీ పని ఒత్తిడి కూడా కారణం అవుతోంది. ఒకరు భావోద్వేగాలకులోనై ఏడుస్తున్నప్పుడు ఓదార్చే తోడు కోరుకుంటారు. అది దొరకనప్పుడు జీవితభాగస్వామిపై విరక్తి కలిగి గొడవలు పెరుగుతాయి.
లైంగిక వాంఛలు
ఒత్తిడితో కూడిన జీవితం వల్ల భార్యాభర్తలు లైంగిక జీవితానికి చాలా తక్కువ ప్రాధానత్యనిస్తున్నారు. కొన్ని జంటల్లో ఒకరికి ఆసక్తి ఉంటే, మరొకరికి లేకపోవడం వల్ల కూడా వారి మధ్య దూరం పెరుగుతుంది. దీనివల్ల వారిద్దరి మధ్య ప్రేమాభిమానాలు తగ్గి తగాదాలు తరచూ అవ్వడం ప్రారంభవుతున్నాయి.
ఆహార ప్రభావం
కెఫీన్, ఆల్కహాల్ తాగడం ఇప్పుడు పెరిగిపోయింది. వీటి వల్ల మానసిక స్థితి మారిపోతుంది. అవి వ్యసనాలుగా మారి బానిసలను చేస్తున్నాయి. ఆల్కహాల్‌కు బానిసైన వ్యక్తులు ఇంటి బాధ్యతలను, జీవిత భాగస్వామిని పెద్దగా పట్టించుకోరు. వారి కోసం డబ్బును, సమయాన్ని ఖర్చుచేయడం తగ్గిస్తారు. ఈ పరిస్థితి సాధారణంగానే గొడవలకు కారణమవుతుంది.
పైన చెప్పిన సమస్యలు ఎదుర్కొంటున్న జంటలు ముందుగా మనసువిచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. ఒకరి కోసం ఒకరు రోజులో కొంత సమయాన్ని కేటాయించండి. వీలైతే థెరపిస్టు లేదా మ్యారేజ్ కౌన్సిలర్ వద్దకు వెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి.
Also read: రోజును అందంగా మార్చుకోవాలంటే... ఉదయం తొమ్మిదిగంటల్లోపు చేయాల్సిన పనులు ఇవే
Also read: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన
Also read: సెలెబ్రిటీ గాసిప్స్ ఇష్టపడేవారికి తెలివి తక్కువగా ఉంటుంది... కొత్త అధ్యయన ఫలితం
Also read: పంది గుండె మనిషికి ప్రాణం పోసింది, చరిత్రలోనే తొలిసారిగా జంతువు గుండెతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.