అన్వేషించండి

Productive Day: రోజును అందంగా మార్చుకోవాలంటే... ఉదయం తొమ్మిదిగంటల్లోపు చేయాల్సిన పనులు ఇవే

రోజంతా మరింత ప్రొడక్టివ్‌గా ఉండాలంటే ఉదయం తొమ్మిదిలోపు కొన్ని పనులు చేయాలి.

ప్రొడక్టివ్ డే... అంటే రోజంతా ఉపయోగకరంగా, ఉల్లాసంగా, ఆనందంగా గడవడం. మీ రోజు కూడా అలాగే ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. అది కూడా ఉదయం 9 గంటల్లోపే. 

1. త్వరగా లేవాలి
విజయవంతమైన వ్యక్తుల్లో ఉండే కామన్ లక్షణం ఉదయానే  లేవడం. పొద్దెక్కేవరకు పడుకుంటే బద్దకం పెరుగుతుంది. కాబట్టి ఉదయం ఆరు గంటల్లోనే లేవడం అలవాటు చేసుకోవాలి. ప్రారంభంలో కష్టంగా ఉండొచ్చు. తరువాత అలవాటుగా మారుతుంది. 

2. గ్లాసు నీళ్లతో మొదలు
మీ ప్రశాంతమైన రోజును గ్లాసుడు నీళ్లు తాగడం ద్వారా మొదలుపెట్టాలి. జీవక్రియ పనితీరుకు, చర్మ ఆరోగ్యానికి, శరీరంలోని వ్యర్థ పదార్థాల తొలగింపుకు నీళ్లు తాగడం చాలా అవసరం. మెదడులో 75 శాతం నీరు ఉంటుంది, కాబట్టి నీళ్లు తాగడం ముఖ్యం. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.  రాత్రి పడుకోబోయే ముందు నీళ్లు తాగుతారు, ఆ తరువాత మళ్లీ ఉదయం లేచే వరకు తాగరు కాబట్టి, శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే లేచిన వెంటనే నీళ్లు తాగాలి. 

3. వ్యాయామం
వ్యాయామం కేవలం శారీరకంగానే కాదు మానసికంగానూ ఎన్నో లాభాలు చేకూరుస్తుంది. ఏకాగ్రత, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉదయాన లేచాక వ్యాయామం చేయడం వల్ల రోజంతా చురుకుగా ఉంటారు.  పడుకుని లేచిన అరగంట తరువాత వ్యాయామం ప్రారంభించాలి. 

4. ధ్యానం
ధ్యానం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటూ, ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంపై చాలా సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. ఉదయం ధ్యానం చేయడం వల్ల ఆ రోజంతా సవాళ్లను స్వీకరించే శక్తి మీకు లభిస్తుంది. రోజుకు కేవలం 10 నిమిషాల పాటూ ధ్యానం చేసినా చాలు.

5. పోషకాల బ్రేక్‌ఫాస్ట్
ఉదయం తొమ్మిదిలోపే మీరు బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తి చేసుకోవాలి. ఇది శరీరం, మెదడులోని గ్లూకోజ్ నిల్వలను తిరిగి నింపుతుంది. మెదడు సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా అవసరం. పోషకాహారం కలిగిన అల్పాహారం మీ శరీరానికి మంచి ఇంధనంగా ఉపయోగపడుతుంది. 

6. పుస్తకం చదవడం, పాటలు వినడం
ఉదయాన లేచిన వెంటనే పనుల్లోకి దిగి పోకండి. మీకంటూ కొంత సమయాన్ని వెచ్చించండి. ఓ పావుగంట సేపు పుస్తకం చదవడం, లేదా పాటలు వినడం చేయండి. టీ, కాఫీ తాగుతూ ఈ పనులు చేస్తే మీకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. 

Also read: సెలెబ్రిటీ గాసిప్స్ ఇష్టపడేవారికి తెలివి తక్కువగా ఉంటుంది... కొత్త అధ్యయన ఫలితం

Also read:  పంది గుండె మనిషికి ప్రాణం పోసింది, చరిత్రలోనే తొలిసారిగా జంతువు గుండెతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్

Also read: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు

Also read: కుకీలు, బిస్కెట్లు మిగిలిపోయాయా... వాటితో ఈ సింపుల్ రెసిపీలు చేసుకోవచ్చు

Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Egg Maggi Recipe : ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
High Blood Pressure : హై బీపీ ఉందా? ఈ ఆహారాలను తగ్గించండి.. లేదంటే బీపీ కంట్రోల్‌ కావడం కష్టమే
హై బీపీ ఉందా? ఈ ఆహారాలను తగ్గించండి.. లేదంటే బీపీ కంట్రోల్‌ కావడం కష్టమే
HIV Prevention Injection : హెచ్​ఐవీ నివారణకు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్.. ఇకపై రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదట
హెచ్​ఐవీ నివారణకు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్.. ఇకపై రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదట
Creatine and Hair Loss : క్రియేటిన్ వల్ల బట్టతల వస్తోందా? 20-30 ఏళ్లకే జుట్టు రాలడానికి డాక్టర్లు చెప్తోన్న కారణాలు ఇవే
క్రియేటిన్ వల్ల బట్టతల వస్తోందా? 20-30 ఏళ్లకే జుట్టు రాలడానికి డాక్టర్లు చెప్తోన్న కారణాలు ఇవే

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Issue: సీఈసీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్.. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసనలు
సీఈసీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్.. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసన
Nara Lokesh News: ఏపీలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టండి.. టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ను కోరిన మంత్రి నారా లోకేష్
ఏపీలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టండి.. టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ను కోరిన మంత్రి నారా లోకేష్
Balapur Ganesh Laddu Auction: రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి ఎవరంటే
రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డూ.. విజేత సామ ప్రణీత్ రెడ్డి ఎవరంటే
Romantic Horror Thriller OTT : ది ప్యారడైజ్ బ్యూటీ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ది ప్యారడైజ్ బ్యూటీ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
Tamannaah Bhatia: తమన్నా ఖాతాలో మరో డిజాస్టర్... హిందీలో మిల్కీ బ్యూటీకి కలిసి రావట్లేదుగా
తమన్నా ఖాతాలో మరో డిజాస్టర్... హిందీలో మిల్కీ బ్యూటీకి కలిసి రావట్లేదుగా
టాటా టియాగో EV BAAS అంటే ఏంటి? తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు.. బ్యాటరీకి నెలనెలా చెల్లింపులు!
Tata Tiago EV కొనాలంటే బ్యాటరీకి భారీ ఖర్చు అక్కర్లేదు.. BAAS మోడల్ ఫుల్‌ డిటైల్స్‌
Smapoornesh Babu : సినిమాల్లోకి ఎందుకొచ్చావ్? - క్వశ్చన్స్ కాంట్రవర్సీ... సంపూర్ణేశ్ బాబు రియాక్షన్
సినిమాల్లోకి ఎందుకొచ్చావ్? - క్వశ్చన్స్ కాంట్రవర్సీ... సంపూర్ణేశ్ బాబు రియాక్షన్
Egg Maggi Recipe : ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
Embed widget