Summer Foods: తాటి ముంజలు తింటే వేసవి సమస్యలేవీ దరి చేరవు, రోజుకు రెండు తిన్నా చాలు
వేసవిలో మాత్రమే దొరికే అద్భుత ఫలాలు తాటిముంజలు.
వేసవి వచ్చిందంటే గ్రామాల్లో కుప్పలుకుప్పలుగా కనిపిస్తాయి తాటి ముంజలు. నిండుకుండల్లా ఉండే తాటిముంజలు వేసవి తాపాన్ని తీర్చడంలో ముందుంటాయి.వేడి పెరుగుతున్న కొద్దీ ఆ ఉష్ణోగ్రతను మన శరీరం తట్టుకోలేదు. దానికి తట్టుకునే శక్తి ఇవ్వాలంటే తాటి ముంజల్లాటి చలువ చేసే ఆహారాన్ని తినాల్సిందే. వీటిని ఇంగ్లిషులో ఐస్ ఆపిల్ అని, పాల్మీరా పామ్ అని పిలుస్తారు. జెల్లీలా, చేత్తో పట్టుకుంటే జారిపోయేంత సున్నితంగా ఉంటాయివి.
ఎన్నితిన్నా మంచిదే...
మండే ఎండల్లో వీటిని పొట్టనిండుగా తినేయాల్సిందే. ఇవి తింటే క్యాలరీలు తక్కువగా, శక్తి ఎక్కువగా అందుతుంది. వేడి వల్ల వచ్ సమస్యలన్నీ తాటి ముంజలతో తీరిపోతాయి. ఎండవేడిమికి డీ హైడ్రేట్ అయిపోతారు చాలా మంది. అలా డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలన్న, గురయ్యాక త్వరగా కోలుకోవాలన్న తాటిముంజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఖనిజాలు,చక్కెరలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి, ఐరన్, కాల్షియం తాటి ముంజల్లో లభిస్తాయి. వీటి గుజ్జు రుచి లేత కొబ్బరిలా ఉంటుంది.
వేసవిలో గర్భిణులు కచ్చితంగా వీటిని తినాలి. ఇవి జీర్ణ వ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. దీనివల్ల మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు రావు. వీటిలో అధికమొత్తంలో నీరే ఉంటుంది కనుక శరీర బరువును కూడా తగ్గిస్తాయి. అమ్మవారు వంటి వేసవి వ్యాధుల బారిన పడిన వారు కూడా వీటిని తింటే మంచిది. ఇవి కాలేయ సంబంధ వ్యాధులును కూడా తగ్గిస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం కాలేయంలో ఉన్న టాక్సిన్లను బయటికి పంపిస్తుంది.
ఎండను తట్టుకోలేక కొందరికి వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. అలాంటి వారికి ఒక్కరోజులో ఉపశమనం కావాలంటే తాటి ముంజలు ఓ అరడజను వరకు లాగించేయాలి. వీటితో పాటూ నిమ్మరసం, మజ్జిగ కూడా తాగితే త్వరగా సమస్య నుంచి బయపపడతారు. ఎండలను విపరీతంగా ఉక్కపోత, చెమట పడుతుంది. శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. అలాంటప్పుడు శరీరానికి చాలా అలసటగా అనిపిస్తుంది. ఆ నీరసాన్ని, అలసటను వెంటనే దూరం చేస్తాయి తాటిముంజలు. కొందరు పొట్టు తీయకుండానే వీటిని తినేస్తారు. పొట్టులో కూడా చాలా పోషకాలు ఉంటయన్నది వారి నమ్మకం. కానీ దాని రుచి అందరికీ నచ్చదు. తొక్క తీసే తినడం బెటర్.
Also read: గర్భస్రావం అయితే ఆ లోపం భార్యది మాత్రమే కాదు, ఈ కారణాలు మీకు తెలుసా !
Also read: వేసవిలో పెట్టే ఆవకాయలు, ఊరగాయలతో ఆరోగ్యానికి ఎంతో మేలు