Milk: పాలు ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత తాగేస్తున్నారా? పాలు తాగేందుకూ ఓ పద్దతుంది...
పాలు తాగితే ఆరోగ్యకరమే, కానీ అతిగా తాగితే అనర్థమే అంటున్నారు ఆరోగ్యనిపుణులు.
ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల జాబితాలో టాప్ ఫైవ్ లోనే ఉంటాయి పాలు. వాటిలోని పోషక విలువలు పిల్లలకే కాదు, పెద్దలకు చాలా అవసరం. మంచి కాల్ఫియం వనరు పాలు. ప్రతి రోజూ పాలు తాగేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు నిపుణులు. ఎన్నో పోషక విలువలు పాల ద్వారా శరీరానికి అందుతాయి. అయితే పాలను అతిగా తాగితే మాత్రం ఆరోగ్యసమస్యలు తప్పవు, అంతేకాదు కొన్ని సమయాల్లో పాలను తాగకూడదు. ఎప్పుడెప్పుడు పాలను తాగకూడదంటే...
1. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే బాగా నిద్రపడుతుందని చాలా మంది నమ్మకం. ఇది నిజమే. కానీ గ్లాసుడు పాలు గడగడ తాగేసి, వెంటనే నిద్రపోకూడదు. పడుకోవడానికి గంటముందు పాలను తాగాలి. వీటిని తాగి వెంటనే పడుకుంటే కొందరిలో ఆరోగ్య సమస్యలు తలెత్తచ్చు. సరిగా జీర్ణం కాకపోవడం, కడుపునొప్పి వంటివి కలగవచ్చు.
2. పాలను అధికంగా తీసుకున్నా అనర్థమే. రోజుకు గ్లాసుడు పాలకు మించి తాగకూడదు. కొంతమందికి అతిగా తాగితే పాలలో ఉన్న ప్రోటీన్స్ వల్ల అలెర్జీలు కలిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తగిన మోతాదులోనే పాలను తీసుకోవాలి.
3. శరీరంలో ఆమ్ల స్థాయి పెరగకూడదు. ఆమ్ల, క్షార స్థాయిలు ఒకే విధంగా ఉండాలి. కానీ రోజూ పాలను అధికంగా తాగితే ఆమ్ల స్థాయి పెరిగిపోతుంది. దీనివల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.
4. ఎసిడిటీ సమస్య ఉన్న వారు పాలను పరిమితంగా తీసుకోవాలి. ఆ సమస్య లేనివారు కూడా అధికంగా పాలను తీసుకోవడం ఎసిడిటీ బారిన పడే అవకాశాలు ఎక్కువ.
5. పాలల్లో చక్కెర కలుపుకుని తాగే అలవాటు ఉంటే మానుకోండి. తాగితే కేవలం పాలు మాత్రమే తాగండి, లేదా హార్లిక్స్, బూస్ట్ వంటివి కలుపుకుని తాగండి, కానీ చక్కెర మాత్రం కలుపుకోకండి. చక్కెరకు బదులుగా బెల్లం తురుము, తేనె, పసుపు వంటివి కలుపుకుని తాగితే చాలా మంది. పాలల్లో చక్కెర కలుపుకోవడం ఆరోగ్యం కన్నా అనారోగ్య లక్షణాలు అధికంగా కలుగుతాయి.
6. పాలు తాగడానికి మంచి సమయం ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైమ్. అలాగే రాత్రి పడుకోవడానికి ఓ గంట ముందు. ఉదయం తాగిన పాలు శక్తినిస్తే, రాత్రి తాగిన పాటు మెదడుకు సాంత్వనను ఇస్తాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు, నిద్రపోకూడదా? ఈ నమ్మకాల గురించి సైన్స్ ఏం చెబుతోంది?
Read Also: అన్నం తినలేకపోతున్నారా? దానికి బదులు వీటిని తినండి
Read Also: అవిసెగింజలు తింటే ఆరోగ్యం... కానీ ఏం చేసుకుని తినాలో తెలియడం లేదా? ఇవిగో కొన్ని రెసిపీలు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి