Rice Alternatives: అన్నం తినలేకపోతున్నారా? దానికి బదులు వీటిని తినండి
మూడు పూటలా అన్నం తింటే బరువు పెరుగతామని భయపడుతున్నారా? ప్రత్యామ్నాయాలు ఇవిగో...
భారతీయ ఆహారం అంటే అన్నమే. బియ్యంతో చేసిన ఈ వంటకానికే మొదటి ప్రాధాన్యత. బ్రేక్‌ఫాస్ట్‌గా ఏం తిన్నా, మధ్యాహ్నం, రాత్రి మాత్రం అన్నం తినేవారి సంఖ్యే ఎక్కువ. అయితే వారిలో చాలా మందికి రాత్రి అన్నం తినడం కష్టంగా మారింది. బరువు పెరుగుతామని కొందరు భయపడుతుంటే, డయాబెటిస్ ఉన్నవాళ్లు చక్కెరస్థాయిలు పెరుగుతాయని బెంగపెట్టుకుంటున్నారు. వీరి కోసం అన్నానికి బదులు కొన్ని ప్రత్యామ్నాయాలు సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. ఇవన్నీ తేలికపాటి ఆహారాలే. సూపర్ మార్కెట్లలో, ఆన్ లైన్ గ్రోసరీ స్టోర్లలో ఈ ప్రత్యామ్నాయ ఆహారాలు లభ్యమవుతాయి.
1. డాలియా
ఇది అన్నానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. దీంతో కిచిడీ లేదా ఉప్మా చేసుకోవచ్చు. ఇందులో మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటుంది. ఫొలేట్, విటమిన్ బి6, బి5, ఫైబర్ కూడా పుష్కలంగా అందుతుంది.
2. బార్లీ
మరొక ఆరోగ్యకరమైన ఎంపిక బార్లీ. బార్లీతో కూడా ఎన్నో మంచి వంటకాలు చేసుకోవచ్చు. ఇందులో జింక్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, మాంగనీస్, పొటాషియం, ఫొలేట్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం అరకప్పు బార్లీలో కేవలం 105 కేలరీలు ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే కరిగే ఫైబర్ (సొల్యుబల్ ఫైబర్) ఇందులో అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ, బీటా కెరోటిన్, లుటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
3. చిరు ధాన్యాలు
రాగులు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యాలతో కూడా అనేక రకాల వంటకాలు వండుకోవచ్చు. వీటిలో ఫెరులిక్ యాసిడ్, కాటెచిన్స్ వంటి రెండు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటో న్యూట్రియెంట్లు. అధ్యయనం ప్రకారం అరకప్పు మిల్లెట్లలో 22 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుంది. శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.
4. క్వినోవా
శరీరానికి అవసరమయ్యే తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు క్వినోవాలో ఉంటాయి. ఇందులో ప్రోటీన్తో పాటూ, క్వెర్సెటిన్, కెంఫ్పెరోల్ అనే ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఎక్కువ.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: రోజూ వీటిని తింటే బోలెడంత వెచ్చదనం... చలి దరిచేరదు
Read also: శీతాకాలంలో గుండెపోటు అధికంగా వస్తుంది ఎందుకు? రిస్క్ ఇలా తగ్గించుకోండి
Read also: పాలు, అరటిపండు ఒకేసారి తినకూడదా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Read also: అవిసెగింజలు తింటే ఆరోగ్యం... కానీ ఏం చేసుకుని తినాలో తెలియడం లేదా? ఇవిగో కొన్ని రెసిపీలు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి