News
News
X

Diabetes Food: డయాబెటిస్ ఉందా?.. ఈ ఆహారం యమ డేంజర్!

మీకు డయాబెటిస్ ఉందా? ఎలాంటి ఆహారం తినాలి? తినకూడదో తెలుసా? అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకుని మంచి ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

FOLLOW US: 
Share:

డయాబెటిస్.. ఈ వ్యాధి ఒక స్లో పాయిజన్ లాంటిది. నిర్లక్ష్యం చేస్తే త్వరగానే ఆయుష్షును మింగేస్తుంది. జాగ్రత్తగా ఉంటే.. కొన్నాళ్లు ఎక్కువ జీవించేందుకు అవకాశం ఇస్తుంది. అందుకే.. ఈ వ్యాధితో బాధపడేవారు తప్పకుండా ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. ఏది పడితే అది తినేస్తే.. చక్కెర స్థాయిలు పెరిగిపోయి.. ఆస్పత్రిపాలయ్యేలా చేస్తుంది. అలాగని నోటిని కట్టేసుకోవక్కర్లేదు. డయాబెటిస్ బాధితులు కూడా తినేందుకు అనేక ఆహారాలు ఉన్నాయి. మరి, మధుమేహం సమస్య నుంచి బయటపడాలంటే.. ఏయే ఆహారాలను తినాలి? ఏవి తినకూడదో తెలుసుకుందామా?

ఈ ఆహారం అస్సలు వద్దు:
⦿ డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు.. అన్నీ తినయడానికి వీల్లేదు. పండ్లు ఆరోగ్యానికి మంచిదని ఏవి పడితే అవి తినకూడదు. 
⦿ కొన్ని పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి. 
⦿ బంగాళ దుంపలు, చిలకడ దుంపలు, బీట్ రూట్, క్యారెట్‌లకు దూరంగా ఉండాలి. (వీటిని మితంగా తీసుకుంటే పర్వాలేదు).
⦿ మామిడి పండ్లు, ద్రాక్ష, అరటి పండ్లు, కర్జూరాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి.
⦿ తీపి పదార్థాలను అస్సలు తినొద్దు. అలాగే, నూనె వంటకాలు, అన్నం మితంగా తీసుకోవాలి.
⦿ ఆహార వేళలను కూడా మధుమేహ బాధితులు కచ్చితంగా పాటించాలి. 
⦿ ఒకేసారి ఎక్కువగా తినేయకూడదు.
⦿ సమయానికి ఆహారాన్ని తీసుకోకపోతే ప్రమాదకరం. లో-షుగర్ వల్ల నీరసం ఆవహిస్తుంది.
⦿ భోజన వేళలు పాటించకపోతే హైపోగ్లైసీమియా లేదా హైపర్గ్లైసీమియా‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
⦿ కాస్త గ్యాప్ ఇస్తూ విడతలవారీగా ఆహారాన్ని తీసుకోవాలి. 
⦿ ఆహారాన్ని అప్పుడప్పుడు తినడం వల్ల చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగడం, తగ్గడం జరగదు.

ఈ ఆహారం తింటే సేఫ్: 
బొప్పాయి మంచిదే: డయాబెటీస్‌ బాధితులు పైన పేర్కొన్న కూరగాయలు, పండ్లను మినహా మిగతావన్నీ తినొచ్చు. టమోటాలు, ముల్లంగి, కీరదోశ, సొరకాయలు మంచివే. పండ్లలో బొప్పాయి చాలా మేలు చేస్తుంది. పుచ్చకాయలు కూడా తినొచ్చు. కానీ, చాలా మితంగా తీసుకోవాలి. ఆపిల్, ఆరెంజ్ కూడా మంచివే. వీటిని రోజూ తీసుకోవచ్చు. 

మెంతులు మేలు చేస్తాయ్: మధుమేహ బాధితులకు మేలు చేసే ఆహార పదార్థాల్లో మెంతులు కూడా ఒకటి. ఇందులో ఉండే ఫైబర్.. జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఒకేసారి పెరగకుండా మెంతులు సహకరిస్తాయి. రోజూ మెంతులను నీటిలో నానబెట్టుకుని లేదా పొడి చేసుకుని తాగవచ్చు. ఉదయం వేళ్లల్లో తాగితే మరింత మంచిది. 

నేరేడు పండ్లను మిస్ కావద్దు: డయాబెటిస్ బాధితులకు ఇవి చాలా మంచిది. ఇందులో ఐరన్‌తోపాటు విటమిన్-C, విటమిన్-A, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. నేరేడు వల్ల శరీరంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇవి అన్ని సీజన్లలో లభించడం కష్టం. అయితే, బయట మార్కెట్లో మీకు నేరెడు పండ్ల పొడి లభిస్తుంది. ఆయుర్వేద దుకాణాల్లో కూడా ఇది లభ్యమవుతుంది. 

ఓట్స్, బార్లీతో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా ఓట్లు, బార్లీ వంటివి తీసుకోవడం మంచిది. డయాబెటీస్ బాధితులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. గోదుమతో తయారు చేసిన వంటకాలు కూడా మంచివే. అవి అందుబాటులో లేకపోతే బార్లీని తీసుకోవచ్చు. 

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క

Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Dec 2021 06:14 AM (IST) Tags: Diabetes food Food Habits మధుమేహం Diabetes Worst Food Best Diabetes Food Diabetes Eating Habits

సంబంధిత కథనాలు

కడుపులో మంటగా ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే ఉపశమనం

కడుపులో మంటగా ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే ఉపశమనం

Knee Pain: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మోకాళ్ళు అరిగిపోతున్నాయని సంకేతాలు కావొచ్చు

Knee Pain: మీలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మోకాళ్ళు అరిగిపోతున్నాయని సంకేతాలు కావొచ్చు

Hair Conditioner: జుట్టుకి షాంపూ చేసిన ప్రతిసారీ కండిషనర్ పెట్టడం అవసరమా? ప్రయోజనం ఏంటి?

Hair Conditioner: జుట్టుకి షాంపూ చేసిన ప్రతిసారీ కండిషనర్ పెట్టడం అవసరమా? ప్రయోజనం ఏంటి?

Weight Loss: బరువు తగ్గించే ఈ ఐదు ఆహారాలు మీ ఫ్రిజ్‌లో ఎప్పుడూ ఉంచుకోండి

Weight Loss: బరువు తగ్గించే ఈ ఐదు ఆహారాలు మీ ఫ్రిజ్‌లో ఎప్పుడూ ఉంచుకోండి

Diabetes: మధుమేహానికి మెంతులను మించిన పరమౌషధం మరొకటి లేదు

Diabetes: మధుమేహానికి మెంతులను మించిన పరమౌషధం మరొకటి లేదు

టాప్ స్టోరీస్

TS Teachers Transfers : ఉపాధ్యాయ దంపతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్

TS Teachers Transfers :  ఉపాధ్యాయ దంపతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్,  స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Pawan Vs Byreddy : నన్ను ముసలోడ్నంటావా ? కొండారెడ్డి బురుజు వద్ద కుస్తీకొస్తావా ? - పవన్‌కు బైరెడ్డి సవాల్ !

Pawan Vs Byreddy : నన్ను ముసలోడ్నంటావా ? కొండారెడ్డి బురుజు వద్ద కుస్తీకొస్తావా ? - పవన్‌కు బైరెడ్డి సవాల్ !

AP Capital supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ - ఈ సారి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుపై...

AP Capital supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ -  ఈ సారి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుపై...

Sai Dharam Tej's Satya: రిపబ్లిక్ డే స్పెషల్, సాయి ధరమ్ తేజ్ - కలర్స్ స్వాతి మ్యూజికల్ వీడియో

Sai Dharam Tej's Satya: రిపబ్లిక్ డే స్పెషల్, సాయి ధరమ్ తేజ్ - కలర్స్ స్వాతి మ్యూజికల్ వీడియో