News
News
X

Wedding: యాభైమూడేళ్ల వయసు తేడాతో పెళ్లి చేసుకున్న ఆ జంట ఇప్పుడెలా ఉందో తెలుసా?

ప్రేమకు వయసుతో పనిలేదని నిరూపించింది ఆ జంట. ఇప్పుడు వారిద్దరూ ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉందా?

FOLLOW US: 

ప్రేమకు కులం, మతమే కాదు వయసుతో కూడా పని లేదని నిరూపించింది ఓ జంట. వారిద్దరి పెళ్లి ఫోటోలు చూసి అప్పట్లో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. హీరోలాంటి ఓ నవయువకుడు తన కన్నా 53 ఏడేళ్లు పెద్దదైమన ఓ ముసలామెను ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసకున్నారు. ఇదంతా జరిగింది 2015లో అప్పట్లో వీరిద్దరి ఫోటోలు వైరల్ గా మారాయి. చాలా మంది వారి పెళ్లి సమయంలో ఎన్నో కామెంట్లు చేశారు. ఈ పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటేనని ఒకరంటే, ఆమెకు ఆస్తి ఉండుంటుంది అది తీసుకున్నాక ఆమెను వదిలేస్తాడు అంటూ రకరకాల కామెంట్లు చేశారు. కానీ వారికి షాకిచ్చేలా ఈ జంట అన్యోన్యంగా బతకసాగారు. వారికి పెళ్లై ఆరేళ్లు అవుతున్నా వారిద్దరూ ప్రేమగా నివసిస్తున్నారు. కాకపోతే వారికున్న లోటు ఒకటే... పిల్లలు. 

అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో జీవిస్తోంది ఈ జంట. పేర్లు గేరీ, అల్మెడా. ప్రస్తుతం గేరీకి 24, అల్మెడాకు 77. 2015లో వారి పెళ్లి సమయానికి గేరీకి  17 ఏళ్లు కాగా, అల్మెడాకు 71. వీరిద్దరికీ 53 ఏళ్ల వయసు తేడా. అల్మెడాకు మనవడి వయసు గేరీది. గేరీ మీడియాతో మాట్లాడుతూ ‘మా పెళ్లిజీవితం చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంటుంది. అందుకే మేము కలిసి ఉండగలుస్తున్నాం. ఆమె నా సోల్ మేట్’ అని చెప్పాడు. 

ఈ జంట ఈ మధ్యనే ఒక కారు కొనుక్కున్నారు. వచ్చే ఏడాది సొంత ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో వీరిని విమర్శించిన చాలా మంది ఇప్పుడు ఈ జంటకు మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాదు వారి కుటుంబాలు కూడా ఇప్పుడు వీరి ప్రేమను, పెళ్లిని అంగీకరించాయి. అల్మెడాకు మునిమనవరాళ్లు కూడా ఉన్నారు. 

View this post on Instagram
 
A post shared by Gary & Almeda (@garyandalmeda)

[/insta]

Published at : 06 Mar 2022 09:33 AM (IST) Tags: Viral news Love Marriage Weird news Married couple

సంబంధిత కథనాలు

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Diarrhoea: ప్రయాణాల్లో కడుపు గడబిడ? జర్నీకి ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!

Diarrhoea: ప్రయాణాల్లో కడుపు గడబిడ? జర్నీకి ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి!

Eye Problems: కంటి చూపు సమస్యలా? ఈ ఆహారంతో కళ్లజోడుకు బై బై చెప్పొచ్చు!

Eye Problems: కంటి చూపు సమస్యలా? ఈ ఆహారంతో కళ్లజోడుకు బై బై చెప్పొచ్చు!

Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

టాప్ స్టోరీస్

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

Cinnamon Tea: దాల్చిన చెక్కతో టీ ఎప్పుడైనా ట్రై చేశారా? దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు

Cinnamon Tea: దాల్చిన చెక్కతో టీ ఎప్పుడైనా ట్రై చేశారా? దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు