Teflon flu: నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేస్తున్నారా? టెఫ్లాన్ ఫ్లూతో ముప్పు తప్పదంటున్న నిపుణులు
మీ కిచెన్ లో నాన్ స్టిక్ పాత్రలు వాడుతున్నారా? అయితే, టెఫ్లాన్ ఫ్లూ ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. ఇంతకీ ఈ టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏంటి? దానితో కలిగే నష్టాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
What is Teflon Flu?: ఈ రోజుల్లో ఎవరి కిచెన్ లో చూసినా నాన్ స్టిక్ పాత్రలే కనిపిస్తున్నాయి. ఈజీగా వంట చేసుకునేందుకు నాన్ స్టిక్ పాత్రలు అనుకూలంగా ఉండటంతో చాలా మంది వాటినే వినియోగిస్తున్నారు. అయితే, నాన్ స్టిక్ పాత్రలు వాడటం ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. నాన్ స్టిక్ పాత్రల కారణంగా టెఫ్లాన్ ఫ్లూ సోకుతుందంటున్నారు. గత ఏడాది అమెరికాలో ఏకంగా 267 టెఫ్లాన్ ఫ్లూ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు కూడా అక్కడ ఈ కేసులు రికార్డు అవుతున్నాయి. ఇంతకీ టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏంటి? అది ఎలా సోకుతుందంటే?
టెప్లాన్ ఫ్లూ ఎలా సోకుతుందంటే?
టెఫ్లాన్ అనేది ఓ రకమైన రసాయనిక సమ్మేళన పూత. నాన్ స్టిక్ పాత్రల మీద టెప్లాన్ పూత పూస్తారు. దీని ద్వారా వంట చేసేటప్పుడు ఆహార పదార్థాలు అంటుకోకుండా ఉంటాయి. అయితే, నాన్ స్టిక్ పాత్రలను ఎక్కువగా వేడి చేయడం, సరైన విధానంలో ఉపయోగించకపోవడం వల్ల టెఫ్లాన్ ఫ్లూ సోకే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. నాన్ స్టిక్ పాత్రలను విపరీతంగా వేడి చేయడం వల్ల రసాయనాలతో కూడిన పొగ వస్తుంది. ఈ పొగ ద్వారా పర్ అండ్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధాలు శరీరంలోకి వెళ్తాయి. ఇవి ఫ్లూ లాంటి లక్షణాలను కలిగించడమే కాకుండా ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి. ఈ విషపూరితమైన పొగ విడుదలైన కొంత సమయం తర్వాత టెఫ్లాన్ ఫ్లూ సోకే అవకాశం ఉంటుంది. టెప్లాన్ ఫ్లూ వల్ల తలనొప్పి, కండరాల నొప్పి, ఫీవర్ ఏర్పడుతుంది. కిడ్నీ సమస్యలతో పాటు పలు రకాల క్యాన్సర్లు సోకే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఇంతకీ టెప్లాన్ అంటే ఏంటి?
టెఫ్లాన్ అనేది సింథటిక్ కార్బన్, ఫ్లోరిన్ సమ్మేళనం. దీన్ని పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ అని కూడా పిలుస్తారు. వీటిని నాన్ స్టిక్ పాత్రలకు కోటింగ్ వేస్తారు. నాన్‌స్టిక్ పాత్రలు వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఎక్కువ మొత్తంలో వేడి చేయడం వల్ల పాత్రల మీద పూసే కెమికల్స్ కరిగి పొగరూపంలో శరీరంలోకి చేరి హాని కలిగిస్తాయి. నాన్ స్టిక్ పాత్రల నుంచి వచ్చే పొగ ప్రభావం సుమారు 12 గంటల నుంచి 24 గంటల వరకు ఉంటుంది. అయితే, ఈ పొగ ద్వారా సోకే లక్షణాలు అంత ప్రమాదం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది మాత్రం మున్ముందు పలు ఆరోగ్య సమస్యలు కలుగుతాయంటున్నారు.
నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నాన్ స్టిక్ పాత్రలతో వచ్చే సమస్యలను తగ్గించుకోవాలంటూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
⦿ ఖాళీ నాన్ స్టిక్ ప్యాన్ లను ముందుగా వేడి చేయకూడదు. అలా చేయడం వల్ల ఈజీగా హై హీట్‌కు చేరుకుంటాయి.
⦿ నాన్‌స్టిక్ ప్యాన్‌లను బ్రాయిలింగ్ కోసం ఉపయోగించకూడదు. ఎందుకంటే, అవి సాధారణంగా 450 నుంచి 500 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు మాత్రమే సేఫ్ గా ఉంటాయి.
⦿ వంట చేసేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, కిటికీలు తెరవడంతో పాటు సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
⦿ నాన్‌స్టిక్ పాత్రల్లో వంటలు చేసేటప్పుడు గీతలు పడకుండా ఉండేందుకు కేవలం చెక్కతో తయారు చేసిన పాత్రలనే ఉపయోగించాలి.
Also Read : నగ్నంగా నిద్రపోతే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.. ముఖ్యంగా మహిళలకు చాలా మంచిదట