నాన్‌స్టిక్ పాన్లతో క్యాన్సర్ వచ్చే ముప్పు నాన్ స్టిక్ పాన్‌లు కొన్నారో వాటిని ఎన్నాళ్లయినా పడేయరు చాలా మంది. వాటి కోటింగ్ పోయినా... తెల్లగా మారిపోయినా వాడేస్తుంటారు. నాన్ స్టిక్ పాన్లలో వండితే మాడే సమస్యా ఉండదు. అందుకే అవి అంత పాపులర్ అయ్యాయి. వాటికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంది. కొన్ని రకాల సంకేతాల ద్వారా వాటి ఎక్స్‌పైరీ డేట్‌ను అంచనా వేయచ్చు. నాన్ స్టిక్ పాన్లు కొన్ని రోజులు వాడాక తెల్లని గీతలు పడతాయి. ఈ గీతలు అడుగు భాగంలో వేసిన కోటింగ్ పోతోందని చెప్పే సంకేతం. నాన్ స్టిక్ పాన్‌లను టెఫ్లాన్ ఉపయోగించి తయారుచేస్తారు. టెఫ్లాన్లో పెర్‌ఫ్లోరోఆక్టానిక్ యాసిడ్ అనే ప్రమాదకరమైన రసాయనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకం. గీతలు పడుతోందంటే టెఫ్లాన్ ఉపరితలం దెబ్బతింటోందని అర్థం. ఊడిపోయిన ఆ కోటింగ్ ఆహారంతో పాటూ కలిసి మన శరీరంలోకి చేరిపోతుంది. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. నాన్ స్టిక్ పాన్‌లు ఎలాంటి గీతలు పడకుండా ఉంటే అయిదేళ్ల పాటూ వాడవచ్చు. అయిదేళ్లయ్యాక గీతలు పడినా, పడకపోయినా మార్చేయడం ఉత్తమం. గీతలు పడితే మాత్రం వెంటనే వాడడం ఆపేయాలి.