యాంగ్జయిటీ, డిప్రెషన్‌కు చెక్ పెట్టే పుట్టగొడుగులు



పుట్టగొడుగుల్లో ఉండే పోషకాలు కేవలం శారీరక శక్తినే కాదు, మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.



కొన్ని అధ్యయనాల్లో పుట్టగొడుగుల్లోని కొన్ని రకాలు డిప్రెషన్‌ను తగ్గించే గుణాలను కలిగి ఉంటాయని తేలింది.



పుట్టగొడుగులను తరచూ తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం చాలా తక్కువ.



మానసిక ఆరోగ్యం కోసం వారానికి ఒక్కసారైనా తినమని ప్రోత్సహిస్తున్నారు ఆహారనిపుణులు.



వైట్ బటన్ మష్రూమ్‌లు, లయన్స్ మేన్ రకం పుట్టగొడుగులు అధికంగా తింటారు ప్రజలు.



ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను కలిగి ఉంటాయి.



నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.



విటమిన్లు, ఖనిజాలతో పాటూ ఎర్గోథియోనినన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటి డిప్రెసెంట్లుగా పనిచేస్తాయి.