Egg Dosa Recipe : రాయలసీమ స్పెషల్ ఎగ్ దోశ.. ఆ ఒక్కటి యాడ్ చేస్తే రుచి నెక్స్ట్ లెవల్ అంతే
Rayalaseema Food for Breakfast : దోశలలో ఎగ్ దోశ రుచే వేరు. దానికి ఎందరో అభిమానులు కూడా ఉంటారు. మరి ఈ రోజు రాయలసీమ స్పెషల్ ఎగ్ దోశను ఎలా తయారు చేయాలో చూసేద్దాం.
Tasty Egg Dosa with Red Chutney : సౌత్ ఇండియాలో దోశల్లో వివిధ రకాలు ఉంటాయి. పైగా ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన దోశ ఫేమస్ అవుతుంది. అలా రాయలసీమలో ఎగ్ దోశ బాగా ఫేమస్. ఈ దోశ ఎక్కడదొరికినా ఇష్టంగా తినేవారు చాలామంది ఉంటారు. అయితే రాయలసీమలో ఎగ్దోశను ఎలా తయారు చేస్తారో.. ఎందుకు అక్కడ అది స్పెషల్ ఫుడ్నో.. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
మినపప్పు - 1 కప్పు
బియ్యం - రెండున్నర కప్పులు
మెంతి గింజలు - 1 స్పూన్
అటుకులు - అర కప్పు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - దోశలు వేయించేందుకు
గుడ్డు - మీరు తినేదానిని బట్టి
రెడ్ చిల్లీ చట్నీ కోసం..
ఎండు మిర్చి - 100 గ్రాములు
చింతపండు - 50 గ్రాములు
వెల్లుల్లి - 15 రెబ్బలు
ఉప్పు - తగినంత
నీరు - పేస్ట్ చేసేంత
నూనె - తాలింపు కోసం
ఆవాలు - అర టీ స్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
నీరు - చట్నీలో కలిపేందుకు
తయారీ విధానం
ముందుగా మినపప్పు, బియ్యం, మెంతులు, అటుకులు ఓ నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. అనంతరం వాటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ మాదిరిగా నీళ్లు పోస్తూ.. పిండిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దోశ పిండిని వీలైతే రాత్రంతా.. లేదా మరో నాలుగు గంటలు పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల పిండి కాస్త పొంగి.. దోశలు రుచిగా వస్తాయి. అటుకులు దోశలకు మంచి రంగును, మెంతులు క్రిస్పీగా ఉండేలా చేయడంలో హెల్ప్ చేస్తాయి.
ఎగ్ దోశ చేయడం ఈజీనే కదా.. దోశ మీద ఎగ్స్ వేస్తే అదే ఎగ్ దోశ అనుకుంటారు. కానీ రాయలసీమలో దోశ వేసిన తర్వాత ఎగ్ వేయరు. దోశపై రెడ్ చట్నీని లేయర్‌గా వేసి.. అనంతరం దానిపై ఎగ్‌ని వేస్తారు. ఈ రెడ్ చట్నీ మీకు అదిరే రుచిని అందిస్తుంది. రెడ్ చిల్లీ చట్నీని తయారు చేయడం కోసం.. ఎండు మిర్చి.. ఉప్పు, చింతపండు, వెల్లుల్లిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దానిలో కాస్త నీరు పోసి.. మరోసారి పేస్ట్‌గా చేసుకోవాలి. అనంతరం చిన్న కడాయిపెట్టి దానిలో నూనె వేసి.. ఆవాలు కరివేపాకుతో తాలింపు వేయాలి. ముందుగా చేసుకున్న పేస్ట్‌ని దీనిలో వేసి బాగా కలపాలి. చిన్న మంటమీద దీనిని ఉడికించాలి. పేస్ట్‌లోని నీరు పోయి.. నూనె పైకి వస్తున్న టైమ్‌లో స్టౌవ్‌ను బంద్ చేయాలి. దీనిని గాలి చేరని కంటైనర్‌లో ఉంచితే నెలరోజులు కూడా ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు.
ఇప్పుడు పులిసిన దోశ పిండిలో ఉప్పు, కుదిరితే నీరు వేసి బాగా కలపాలి. స్టౌవ్ వెలిగించి దానిపై దోశ పాన్ ఉంచండి. అది వేడి అయిన తర్వాత దానిపై కాస్త నూనె వేసి బాగా స్ప్రెడ్ చేసి.. ఇప్పుడు దోశ వేయండి. అనంతరం రెడ్ చిల్లీ చట్నీని వేసి బాగా స్ప్రెడ్ చేయండి. అది కాస్త ఉడుకుతున్న సమయంలో గుడ్లు వేయండి. స్టౌవ్ మంటను సిమ్‌లో ఉంచి.. దానిపై మూత పెట్టండి. అప్పుడు పై నుంచి కూడా గుడ్డు ఉడకడం ప్రారంభమవుతుంది. మరోవైపు తిప్పాల్సిన అవసరం ఉండదు. లేదంటే మూత లేకుండా ఓ వైపు వేగిన తర్వాత మరో వైపు దోశను వేయించాలి. అంతే వేడి వేడి ఎగ్ దోశ రెడీ. దీనిని మీకు నచ్చిన చట్నీతో కలిపి లాగించేయవచ్చు. పల్లీ చట్నీ అయితే దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్.
Also Read : హోటల్ స్టైల్ పూరీ కర్రీ.. ఈ సింపుల్ రెసిపీ మంచి టేస్ట్ ఇస్తుంది..