అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Metaverse Wedding: మెటావర్స్‌లో పెళ్లి, ‘అవతార్‌’ జంటకు వర్చువల్ ఆశీర్వాదాలు, దేశంలోనే తొలిసారి

చెన్నైకు చెందిన ఓ జంట దేశంలోనే తొలిసారి మెటావర్స్‌లో పెళ్లి రిసెప్షన్ నిర్వహించారు. ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

టెక్నాలజీ మన జీవితాలను ఎలా మార్చేసిందో తెలిసిందే. ముఖ్యంగా మొబైల్ ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. అది లేనిదే ఏ పని జరగదు. అలాగే పర్సుల్లో డబ్బులు పెట్టుకుని తిరిగే రోజులు కూడా దాదాపు కనుమరగైనట్లే. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలే చేస్తున్నారు. సోషల్ మీడియాకు సైతం ప్రజలు అలవాటు పడిపోయారు. వీడియో కాల్స్, చాట్స్.. ఇంకా చాలానే జరుగుతున్నాయ్. కరోనా సమయంలో ఈ టెక్నాలజీతో ఎంతో ఉపయోగపడింది. తాజా ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట ‘మెటావర్స్’. అంటే.. అదో డిజిటల్ మాయా లోకం. ఇందులో మీరు ఉండరు. కానీ, మీ అవతారాలు(మీ రూపాలు) జీవిస్తాయి. ఆ ప్రపంచంలో మీరు స్వేచ్ఛగా విహరించవచ్చు. వివిధ షోలు, ఆటలు కూడా చూడవచ్చు. కొత్త వ్యక్తులను కలవచ్చు, స్నేహం కూడా చేయొచ్చు. చివరికి అందులో పెళ్లిల్లు, రిసెప్షన్లు కూడా చేసుకోవచ్చు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, తమిళనాడుకు చెందిన ఈ జంట ఏం చేశారో తెలుసుకోవల్సిందే. 

సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న దినేష్ ఎస్పీ, ఇంజినీరింగ్ చేస్తున్న జనగానందిని ఫిబ్రవరి 6న శివలింగపురం గ్రామంలో పెళ్లి చేసుకున్నారు. అయితే, వారు తమ పెళ్లి రిసెప్షన్ కొత్తగా ఉండాలని అనుకున్నారు. ఈ సందర్భంగా వారికి కొత్త ఆలోచన వచ్చింది. మెటావర్స్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా అందులోనే వేదికను ఏర్పాటు చేసి.. వారి బ్యాక్‌గ్రౌండ్ స్క్రీన్‌లో పెళ్లి వేడుక వీడియోను ప్లే చేశారు. మెటవర్స్‌లోని వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరుకావాలని తమ స్నేహితులకు మెసేజ్ పెట్టారు. దీంతో వారి ఫ్రెండ్స్ వర్చువల్‌గా ఆ రిసెప్షన్‌కు హాజరయ్యారు. తమ ‘అవతార్’లను అతిథులుగా పంపించి.. వధువురుల రూపాలను ఆశీర్వదించారు. 

TardiVerse అనే టెక్ స్టార్ట్-అప్ సహాయంతో ఈ జంట రిసెప్షన్ కోసం హాగ్వార్ట్స్ థీమ్ మెటావర్స్‌ను ఏర్పాటు చేశారు. చిత్రం ఏమిటంటే.. ఇందులో ఎప్పుడో మరణించిన వధువు తండ్రి కూడా పాల్గొన్నట్లుగా త్రీడీ అవతార్‌ను రూపొందించారు. ఆయన ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తున్నట్లుగా సృష్టించారు. ఈ జంటకు ఇండియా, వివిధ దేశాల్లో ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులకు నాన్-ఫంగబుల్ టోకెన్‌(NFT) రూపంలో ఆహ్వానాలను పంపారు. ఈ రిసెప్షన్‌‌లో వెనకాల స్క్రీన్‌పై సంగీత కచేరీ ప్రదర్శించారు. వధువరులకు చదివింపులు(నగదు బహుమతి) చేయడం కోసం క్యూఆర్ కోడ్‌ను కూడా రిసెప్షన్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రిసెప్షన్ సరే.. మరి, విందు కూడా ఇలాగే ఇస్తారా? అని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇలా మెటావర్స్‌లో పెళ్లి రిసెప్షన్ వేడుక నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ విధంగా ఆ కొత్త జంట పేరు మెటావర్స్‌ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 

మెటావర్స్ అంటే?: ఇప్పటికే మనం.. చాటింగ్, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ ద్వారా ఎక్కడో ఉన్నవాళ్లతో మాట్లాడగలుగుతున్నాం. మెటావర్స్ ద్వారా వారిని స్వయంగా కలవచ్చు కూడా. వారితో కలిసి ఆటలు కూడా ఆడవచ్చు. షికార్లు కూడా చేయొచ్చు. మీరు కాలు కదపకుండానే.. ఈ కల్పన ప్రపంచంలో విహరించవచ్చు. ఇప్పటికే మీరు  పబ్‌జీ ద్వారా స్నేహితులతో కలిసి ఆటలు ఆడుతున్నారు. భవిష్యత్తులో వారి రూపాలను కూడా మెటావర్స్‌లో చూడవచ్చు. వారు ఎంత దూరంలో ఉన్నా వర్చువల్‌గా కలుసుకోవచ్చు. సామాజిక మాధ్యమంలో ఇదో విప్లవాత్మక ముందడుగు. ఇప్పటికే చాలామంది ఈ వర్చువల్ వరల్డ్‌లో జీవించేందుకు తమ ‘అవతార్’లను రూపొందించుకున్నారు. అంటే.. వారిలాంటి రూపమే ఆ వర్చువల్ వరల్డ్‌లో జీవిస్తుందన్నమాట. ఆ అవతార్‌తో ఎవరైనా కలవచ్చు. ఇటీవలే ‘మెటా’గా పేరు మార్చుకున్న ‘ఫేస్‌బుక్’ సంస్థ సరికొత్త ఆవిష్కరణే ఈ మెటావర్స్. 

Also Read: వర్చువల్‌గా రేప్ చేశారు.. మెటావర్స్‌ ‘అవతార్‌’లపై యువతి ఆరోపణ, స్పందించిన ఫేస్‌బుక్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget