News
News
వీడియోలు ఆటలు
X

Ice Apple: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!

వేసవిలో చల్ల చల్లని తాటి ముంజలు తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఇవి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని ఇస్తాయి.

FOLLOW US: 
Share:

వేసవిలో లభించే అద్భుతమైన ప్రయోజనాలు అందించే పండు ఐస్ యాపిల్. అదేంటబ్బా అని ఆలోచిస్తున్నారా? ఐస్ యాపిల్ అంటే త్వరగా కొంతమందికి తెలియకపోవచ్చు కానీ తాటి ముంజలు అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. దీన్నే నంగు, తడ్గోలా అని కూడా పిలుస్తారు. జ్యూసీగా తియ్యగా ఉండే తాటి ముంజలు వేసవి కాలంలో విరివిగా అందుబాటులో ఉంటాయి. ఇది దాహాన్ని తీర్చడమే కాదు అద్భుతమైన రుచిని అదిస్తుంది. తాటి ముంజని మలయాళంలో పనా నాంగ్విన్, తమిళంలో నంగు, హిందీలో తారీ, బెంగాలీలో తాల్, మరాఠీలో తడ్గోలా, కన్నడలో టాటేనింగు, గుజరాతీలో తడ్ పహాలి వంటి విభిన్నమైన పేర్లతో పిలుస్తారు.

ఐస్ యాపిల్స్ లో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది పోషకాలు నిండిన అద్భుతమైన పండు అని చెప్తారు. తాటిపండు వేసవిలో ఉత్తమమైందిగా పరిగణిస్తారు. జెల్లీ రూపాన్ని కలిగి ఉండే ఈ పండు అత్యంత పోషకాలు నిండినది. చక్కెర, విటమిన్లు, ఇనుము, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇది తింటే శరీరం చల్లబడుతుంది. వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఈ వేసవిలో తాటి ముంజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక విధాలుగా మేలు చేస్తుంది. కడుపు సమస్యలన్నింటికీ తాటి ముంజలు చక్కని పరిష్కారం. ఆరోగ్యాన్ని మాత్రమే కాదు చర్మానికి కూడా అద్భుతాలు చేస్తుంది.

మధుమేహులు తినొచ్చు

డయాబెటిక్ రోగులు పండ్లు తినే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటారు. కానీ ఎటువంటి భయం లేకుండా వీళ్ళు ఈ ఐస్ యాపిల్స్ తినొచ్చు. ఇందులోని పోషకాల కారణంగా ఆరోగ్యకరమైన బలమైన రోగనిరోధక వ్యవస్థని అందిస్తాయి. ఇందులో విటమిన్ ఏ, సి, బి7 పుష్కలంగా ఉన్నాయి. కేలరీలు పెంచకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఎక్కువ సేపు సంతృప్తిగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర పెరుగుదలని నివారిస్తుంది.

బరువు తగ్గుతారు

ఐస్ యాపిల్ అత్యధికంగా నీటిని కలిగి ఉంటుంది, పొట్ట నిండుగా ఉంచడం వల్ల అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ. డైటరీ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహకరిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

యాంటీ ఏజింగ్ గుణాలు

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో పాటు ఫైటోన్యూట్రియెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సహాయపడతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. ముఖం మెరిసేలా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా అడ్డుకుంటుంది. 

ఐస్ యాపిల్స్ వల్ల అందం

⦿ తరచూ తాటి ముంజలు తినడం వల్ల వేసవిలో వచ్చే దద్దుర్లు వంటి చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

⦿ దురద, చికాకు నుంచి ఉపశమనం పొందటం కోసం చర్మాన్నికి రాసుకోవచ్చు. దురద ఉన్న ప్రాంతంలో రాసుకోవడం వల్ల తగ్గుతుంది.

⦿ తాటి పండు జుట్టు పొడిబారకుండా చేస్తుంది. నిర్జీవమైన జుట్టుని రిపేర్ చేస్తుంది.

⦿ జుట్టుని బలంగా మార్చి సహజ కండిషనర్ గా పని చేస్తుంది.

⦿ జుట్టు చిట్లి పోవడం, తెల్ల జుట్టు, బట్టతల రాకుండా చేయడంలో తాటి ముంజలు గొప్పగా పని చేస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: రంజాన్ ఉపవాసం విరమించిన తర్వాత ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటారో తెలుసా?

Published at : 24 Mar 2023 07:39 PM (IST) Tags: Tati Munjalu Ice Apple Nungu Palmyra Fruit Ice Apple Benefits

సంబంధిత కథనాలు

White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే

White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే

Hair: పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులు ఆకులతో ఇలా చేయండి

Hair: పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులు ఆకులతో ఇలా చేయండి

Heart Attack: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?

Heart Attack: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?

Foods For Skin: ఆరోగ్యకరమైన చర్మం కోసం ఈ ఐదు ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సిందే

Foods For Skin: ఆరోగ్యకరమైన చర్మం కోసం ఈ ఐదు ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సిందే

Alcohol: ఆల్కహాల్ తక్కువ తాగినా ప్రమాదమే, శరీరంలో ఏం జరుగుతుందంటే...

Alcohol: ఆల్కహాల్ తక్కువ తాగినా ప్రమాదమే, శరీరంలో ఏం జరుగుతుందంటే...

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!