Ramadan Food: రంజాన్ ఉపవాసం విరమించిన తర్వాత ఏయే ఆహార పదార్థాలు తీసుకుంటారో తెలుసా?
పవిత్రమైన రంజాన్ ఉపవాసం దీక్షలో భాగంగా ముస్లింలు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు తయారుచేసుకునే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
రంజాన్ మాసంలో ముస్లింలు నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష చేస్తారు. కనీసం లాలాజలం కూడా మింగరు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. కరుణ, కృతజ్ఞత, మతపరమైన అంకిత భావానికి ప్రతీకగా ఉపవాసం చేస్తారు. సూర్యోదయానికి ముందు సహర్, సూర్యుడు అస్తమించిన తర్వాత ఇఫ్తార్ విందు మాత్రమే తీసుకుంటారు. ఈ రంజాన్ ఉపవాస దీక్షలో ముస్లింలు తీసుకునే ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వాళ్ళు తీసుకునే ఆహారాలు ప్రాంతం, దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
రంజాన్ మాసం ఎలా గడుపుతారు
లూనార్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెల రంజాన్ మాసం. కఠిన నిబంధనలతో ఉపవాసం చేస్తూ దాతృత్వ కార్యక్రమాలు చేస్తూ, నిత్యం ప్రార్థనలతో గడుపుతారు. ఉపవాసాన్ని విరమించుకునేతప్పుడు చాలా మంది ముస్లింలు హలాల్ అయిన ఆహారాన్ని మాత్రమే ఎంచుకుంటారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం దీన్ని అనుసరిస్తారు. హలాల్ చేయని ఆహారం ముట్టుకుంటే అది క్షమించరాని నేరంగా పరిగణిస్తారు. పంది మాంసం, పంది కొవ్వు, ఆల్కహాల్ లేని ఆహారాలు తీసుకోవాలి. ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా ఉండే విధంగా ప్రాసెస్ చేసిన వాటినే తింటారు.
హరామ్
హరామ్ అంటే ముస్లింలు నిషేధించిన ఆహారాలను సూచిస్తుంది. పంది కొవ్వు, ఆల్కహాల్, సరైన ఇస్లామిక్ వధ లేకుండా మరణించిన జంతువు మాంసం, రక్తం అసలు తీసుకోకూడదు. హరామ్ పదార్థం కలిసి ఉన్న ఆహారం కూడా నిషేధిత జాబితాలోకే వస్తుంది.
సహర్
సూర్యోదయానికి ముందు చేసే భోజనాన్ని సహర్ లేదా సెహ్రీ అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు తెల్లవారు జామున 3 గంటలకు నిద్రలేచి ఆహారం సిద్ధం చేసుకుని తింటారు. ఈ సమయంలో చాలా మంది భోజనాన్ని మితంగా తీసుకుంటారు.
ఇప్తార్
ముస్లింలందరూ రంజాన్ ఆచారంలో భాగంగా సహర్ తిన్నా తినకపోయినా ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ తప్పకుండా తింటారు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాసం విరమించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. కొన్ని ఖర్జూరాలు తీసుకుని ముందుగా ఉపవాసం విరమిస్తారు. రంజాన్ మాసంలో ముఖ్యంగా తొమ్మిది సంప్రదాయ ఆహారాలను వాళ్ళు తీసుకుంటారు. అవేంటంటే..
కబాబ్: కబాబ్ తయారు చేయడానికి ఉపయోగించే హలాల్ మాంసాలు ఉంటాయి. చికెన్, మటన్, గొడ్డు మాంసం తీసుకుంటారు.
Fattoush సలాడ్: చాలా మంది రంజాన్ లో తీసుకునే భోజనం తేలికగా ఉండాలని ఎంచుకుంటారు. అటువంటి వారికి ఈ సలాడ్ మంచి ఎంపిక.
పకోడీ: ఉల్లిపాయలు, వంకాయలు, మిరపకాయలు వంటి కూరగాయాలతో వీడిని తయారు చేసుకుంటారు. రంజాన్ టైమ్ లో తినేందుకు ఇది ఉత్తమ శాఖాహార ఎంపిక.
ఖీర్: ముస్లింలకు ఎంతో ఇష్టమైన స్వీట్ ఖీర్. వీళ్ళు చేసిన ఖీర్ రుచి మరెవరు చేసినా రాదు. జీడిపప్పు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ తో దీన్ని తయారు చేసుకుంటారు.
కునాఫే: సేమ్యా, వివిధ రకాల పండ్లుతో దీన్ని తయారు చేస్తారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి వంటకాలు చేసే విధానం వాటి పేర్లు మారుతూ ఉంటాయి.
హలీమ్: అందరూ రంజాన్ మాసంలో ఎదురుచూసేది హలీమ్ కోసమే. బాగా మెత్తగా పేస్ట్ లాగా ఉడికించిన మాంసంలో డ్రై ఫ్రూట్స్, మసాలాలు జోడించి సర్వ్ చేస్తారు.
కిబ్బే: గోధుమ లేదా మైదా పిండిలో ఉడికించని పచ్చి మాంసం పెట్టి బాల్స్ లాగా బాగా డీప్ ఫ్రై చేస్తారు.
చాట్ ఫ్రూట్ సలాడ్: రంజాన్ మాసంలో అందరూ తప్పనిసరిగా తీసుకునే మరో ముఖ్యమైన పదార్థం ఫ్రూట్ సలాడ్. అన్ని రకాల పండ్లు ముక్కలుగా కోసి వాటిలో చాట్ మసాలా కలుపుకుని ఆరగిస్తారు.
బక్లావా: ఈ స్వీట్ డెజర్ట్ లేకుండా రంజాన్ ఆచారం పూర్తి కాదు. వేరుశెనగ, తేనె, సుగంధ ద్రవ్యాలు, పిండి ఉపయోగించి దీన్ని తయారుచేస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?