News
News
వీడియోలు ఆటలు
X

Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?

రంజాన్ మాసం వచ్చిందంటే అందరూ ఎదురు చూసేది హలీమ్ కోసం. ఎంతో రుచిగా ఉండే హలీమ్ తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం మొదలైపోయింది. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ నిత్యం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. రంజాన్ మాసం అంటే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది హలీమ్. ముస్లిం వాళ్ళు మాత్రమే కాకుండా అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సమయంలో ఎక్కడ చూసినా హలీమ్ సెంటర్స్ కనిపించేస్తాయి. నోరూరించే హలీమ్ తినేందుకు చిన్న పెద్ద ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఇది చాలా రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల కోల్పోయిన శక్తిని హలీమ్ తింటే తిరిగి పొందవచ్చు.

హలీమ్ అంటే ఏంటి?

మటన్, బీఫ్, చికెన్ తో హలీమ్ తయారు చేస్తారు. చూసేందుకు పేస్ట్ లాగా మెత్తగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నింటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గోధుమలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, శనగపప్పు, మినపప్పు, వేస్తారు. ఇవే కాదు మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, వామ్ము, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, నల్ల మిరియాలు, కుంకుమ పువ్వు, బెల్లంతో పాటు డ్రై ఫ్రూట్స్ పిస్తా, జీడిపప్పు, అంజీరా, బాదం పప్పు వేస్తారు. గ్రేవీగా ఉండే వేడి వేడి హలీమ్ చూస్తే ఎవరికైనా నోరూరిపోతుంది. దాని మీద కొత్తిమీర, ఫ్రైడ్ ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్క వేసి గార్నిష్ చేసి ఇస్తారు.

ఎలా చేస్తారు?

హలీమ్ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది. గోధుమలు, పప్పులు రాత్రంతా నానబెట్టి బాగా ఉడికించుకుని పెట్టుకోవాలి. మటన్ కూడా ఖైమా లాగా చేసుకుని ఉడికించుకోవాలి. అన్ని రకాల మసాలాలు వేసిన తర్వాత గ్రేవీ మాదిరిగా రావడం కోసం బాగా ఉడికిస్తారు. ఎంత ఎక్కువగా ఉడికిస్తే రుచి అంత అద్భుతంగా ఉంటుంది. సన్నని మంట మీద ఉడికించడం వల్ల హలీమ్ వండటానికి కనీసం 6-7 గంటల సమయం పడుతుంది.

హలీమ్ ఆరోగ్యకరమేనా?

కేలరీలు అధికంగా ఉండే హలీమ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది తక్షణమే శరీరానికి శక్తినిస్తుంది. ఇందులోని పీచు పదార్థం కారణంగా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ చేర్చడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. మటన్, డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం.

గోధుమలు ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. దీని తయారీకి ఉపయోగించే మసాలా దినుసుల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడే వారికి చక్కని ఆహారమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఇలా వచ్చింది

ఎంతో మంది ఇష్టంగా తినే ఈ హలీమ్ ని ఆరేబియన్స్ తీసుకొచ్చారు. హరీస్ అని పిలుస్తారు. 10వ శతాబ్దంలో కితాబ్ అల్ తబిక్(వంటల పుస్తకం)లో హలీమ్ రెసిపి గురించి తొలిసారిగా రాశారు. హైదరాబాద్ నిజాం ఆర్మీ దగ్గర ఉండే అరేబియన్ సైన్యం దీన్ని భారత్ లోకి తీసుకొచ్చింది.

ఒక్కో దేశంలో ఒక్కోలా

హలీమ్ ని ఒక్కపక్కరూ ఒక్కో పేరుతో పిలుస్తారు. అరేబియన్లు, ఆర్మేనియా వాళ్ళు 'హరీస్' అంటారు. టర్కీ, ఇరాన్, అజర్ బైజాన్, ఇరాక్ లో హలీమ్ ని ‘దాలీమ్’ అని అంటారు. పాకిస్థాన్ లో 'కిచర' అని పిలుస్తారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: అధిక రక్తపోటు అదుపులో ఉంచాలా? అయితే ఇవి తినండి, వీటిని తినకండి

Published at : 24 Mar 2023 11:57 AM (IST) Tags: ramadan Haleem Ramadan 2023 Harees Halim Health Benefits Haleem Uses Ramadan Festival

సంబంధిత కథనాలు

Memory Loss: లైంగిక జీవితం సంతృప్తిగా లేకపోతే మతిమరపు వస్తుందా? స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Memory Loss: లైంగిక జీవితం సంతృప్తిగా లేకపోతే మతిమరపు వస్తుందా? స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?

డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?