అన్వేషించండి

Sudha Reddy: 200 క్యారెట్ డైమండ్ జ్యువలరీతో ఆకట్టుకున్న సుధారెడ్డి - మెట్‌ గాలాలో మెరిసిన తెలుగు వాణిజ్యవేత్త

Sudha Reddy: బిజినెస్ ఉమెన్ సుధా రెడ్డిని మెట్ గాలా ఈవెంట్‌లో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. హీరోయిన్లకు ధీటుగా రెడీ అయినా సుధా.. తన ఒంటి మీద ఏకంగా 200 క్యారెట్ డైమండ్ జ్యువలరీని ధరించారు.

Sudha Reddy At Met Gala 2024: 2024 మెట్ గాలా ఈవెంట్ ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతో నిండిపోయింది. ఈ ఈవెంట్‌లో ఒకరికి మించి మరొకరు ముస్తాబయ్యి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలా వైరల్ అవుతున్నవారిలో బిజినెస్ ఉమెన్ సుధా రెడ్డి కూడా ఒకరు. ఒక ఐవరీ సిల్క్ గౌన్‌లో మెట్ గాలా ఈవెంట్‌కు హాజరయ్యారు సుధా రెడ్డి. సినీ సెలబ్రిటీలకు పోటీ ఇచ్చే ఫ్యాషన్ సెన్స్‌తో సుధా అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో తన సిల్క్ గౌన్ గురించే నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. గౌన్ మాత్రమే కాదు తను మెడలో ధరించిన డైమండ్ నెక్లెస్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఫ్యామిలీకి గుర్తుగా..

సుధా రెడ్డి ‘అమోర్ ఎటెర్నో’ అనే జ్యువలరీ బ్రాండ్‌కు చెందిన డైమండ్ నెక్లెస్‌ను ధరించారు. ఇది ఏకంగా 180 క్యారెట్ డైమండ్ నెక్లెస్ అని సమాచారం. ఈ డైమండ్ నెక్లెస్‌కు ధరించిన లాకెట్టే 25 క్యారెట్లు ఉంటుందట. ఈ నెక్లెస్‌కు ఒక 25 క్యారెట్ హార్ట్ షేప్ డైమండ్‌ లాకెట్‌తో పాటు మరో మూడు 20 క్యారెట్ల హార్ట్ షేప్ డైమండ్స్ కూడా ఉన్నాయి. ఆ మూడు హార్ట్స్‌ను తన భర్త, ఇద్దరు పిల్లలు మానస్, ప్రణవ్‌కు ప్రతీకగా ధరించారట సుధా రెడ్డి. నెక్లెస్ మాత్రమే కాదు సుధా రెడ్డి చేతికి పెట్టుకున్న రెండు రింగ్స్ కూడా డైమండ్సే అని తెలుస్తోంది. అందులో ఒకటి 23 క్యారెట్ డైమండ్ రింగ్ కాగా మరొకటి 20 క్యారెట్ డైమండ్ రింగ్ అని సమాచారం.

వంద కోట్లు..

సుధా రెడ్డి ధరించిన రింగ్స్ ధర దాదాపు 20 మిలియన్ ఉంటుందని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఏకంగా రూ.165 కోట్లు. మెట్ గాలా ఈవెంట్‌లో తన అప్పీయరెన్స్ ద్వారా హైలెట్ అయ్యారు సుధా రెడ్డి. ఈమె మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ (ఎమ్ఈఐఎల్)కు డైరెక్టర్ కూడా. బిజినెస్‌లో సుధా ఎంత బిజీగా ఉన్నా.. చారిటీ సంబంధిత విషయాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా సుధా రెడ్డికి 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

4500 గంటలు కష్టపడ్డారు..

మెట్ గాలాలో తను ధరించిన గౌన్ ఫోటోలను పోస్ట్ చేస్తూ దాని డిజైన్ గురించి, మేకింగ్ గురించి చెప్పుకొచ్చారు సుధా రెడ్డి. తను ధరించిన ఐవరీ సిల్క్ గౌన్‌ను తయారు చేయడానికి 80 మంది డిజైనర్లు.. 4,500 గంటలు కష్టపడ్డారట. దీనిపై పర్ల్ ఫ్లవర్స్‌తో పాటు 3డీ బటర్ ఫ్లై డిజైన్స్ కూడా జతచేర్చారు. ఈ గౌన్‌ను ఫరా అలీ ఖాన్ డిజైన్ చేశారని కూడా సుధా రెడ్డి బయటపెట్టారు. బిజినెస్ లో ఆమె స్కిల్స్ చూసి అందరూ తనను ‘క్వీన్ బీ ఆఫ్ హైదరాబాద్’ అని అంటుంటారు.

Also Read: విడాకులపై శ్రీజ కొణిదెలకు నెటిజన్ ప్రశ్న - మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే అతనితో కలిసి ఉంటారా?

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget