అన్వేషించండి

Summer Diet : మండుతున్న సూరీడు.. హాట్ సమ్మర్​లో హీట్​ని తగ్గించుకునేందుకు ఏమి తింటే మంచిది? ఏమి తినకూడదు? 

Hot Weather Diet Tips : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువయ్యాయి. ఈ సమయంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే.. హీట్ వేవ్ ఎఫెక్ట్ ఉండదు.. ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో ఉప్పు, నూనె, ఫాస్ట్ ఫుడ్స్, కెఫిన్ మానుకోండి.
  • శరీరాన్ని చల్లబరిచే కూరగాయలు, పండ్లు, మజ్జిగ తీసుకోండి.
  • రోజుకు 3-4 లీటర్ల నీరు, కొబ్బరి నీరు తాగాలి.
  • మధ్యాహ్నం 12-3 మధ్య ఎండలో తిరగడం తగ్గించండి.

Best and Worst Foods in Summer : ఎండలు రోజురోజుకీ తీవ్రంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ అలెర్ట్ కూడా ఇస్తున్నారు. ఈ సమయంలో డీహైడ్రేషన్, అలసట, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు వేడిని తగ్గించే చిట్కాలు ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు. లేదంటే శరీరం త్వరగా డీహైడ్రేట్ అయి అనేక సమస్యలకు గురవుతుంది. కాబట్టి వేసవిలో ఎలాంటి ఫుడ్ తినాలి.. ఎలాంటి ఫుడ్ దూరంగా ఉంచాలో.. వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో చూసేద్దాం. 

ఎండల్లో తినకూడని ఫుడ్స్

వేసవిలో ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినకూడదు. ఇవి శరీరంలో నీటిని తగ్గిస్తాయి. డీప్ చేసిన ఫ్రైడ్ ఫుడ్స్ జోలికి వెళ్లకూడదు ఇవి శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. బర్గర్లు, పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్స్ జీర్ణక్రియను తగ్గించి.. అలసటను పెంచుతాయి. కొందరు వేసవిలో కూడా టీ, కాఫీలు.. కేఫిన్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఇవి శరీరానికి హైడ్రేషన్ అందించకపోగా.. డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండండి. 

అలాగే షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, కూల్‌డ్రింక్స్ జోలికి వెళ్లకూడదు. ఇవి శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి. మటన్, ఫ్రైడ్ చికెన్ వంటి మాంసాహారం జోలికి వెళ్లకండి. ఇవి త్వరగా జీర్ణం కాకపోగా.. శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. మరి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే శరీరంలో వేడి తగ్గి హైడ్రేటెడ్​గా ఉంటామో చూసేద్దాం. 

ఎండల్లో తినాల్సిన ఫుడ్స్

వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఎక్కువగా తాగాలి. కనీసం రోజుకు 3 నుంచి 4 లీటర్లు నీరు తాగాలి. కాకరకాయ, దోసకాయ, సొరకాయ వంటి వాటర్ రిచ్ కూరగాయలు డైట్లో చేర్చుకోవాలి. ఇవి శరీరాన్ని కూల్‌గా ఉంచుతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే వాటర్‌మెలన్, మస్క్‌మెలన్ కూడా తీసుకోవచ్చు. ఇవి మీకు ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి. బొప్పాయిని కూడా వేసవిలో తీసుకుంటే మంచిది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేసి.. శరీరాన్ని లైట్‌గా ఉండేలా చేస్తుంది.

మజ్జిగ శరీరానికి చల్లదనం ఇచ్చి డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. నిమ్మరసం విటమిన్ Cతో పాటు ఎలక్ట్రోలైట్స్ అందిస్తుంది. కొబ్బరి నీరు నేచురల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్​ అవుతుంది. వెంటనే ఎనర్జీ అందిస్తుంది. వేసవిలో ఎక్కువ మసాలాలు ఉండేవి కాకుండా లైట్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అవి సులభంగా జీర్ణమవుతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. కానీ బయటకు వెళ్లాల్సి వస్తే.. నీరు తీసుకెళ్లండి. ఎక్కువ సేపు ఎండలో ఉండొద్దు. లైట్, కాటన్ దుస్తులు వేసుకోండి.  మద్యాహ్నం 12 నుంచి 3 మధ్య బయటకు వెళ్లడం తగ్గించండి. అలాగే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇవి డీహైడ్రేషన్, అలసట వంటివి తగ్గిస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget