(Source: ECI/ABP News/ABP Majha)
Snake On Plane: విమానంలో స్నేక్ బాబు ఫ్రీ జర్నీ, ఆ పాము ఎలా దూరిందబ్బా?
ఓ విమానంలో పాము ఫ్రీ జర్నీ చేస్తూ దొరికిపోయింది. దీంతో ఆ విమానాన్ని వెంటనే కిందికి దించి.. పామును పట్టుకెళ్లిపోయారు.
మీరు ‘స్నేక్స్ ఆన్ ఏ ప్లేన్’ (Snakes On A Plane) సినిమా చూశారా? విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత వందలాది పాములు.. ప్రయాణికుల క్యాబిన్‌లోకి చొరబడతాయి. ఆ తర్వాత కనీవినీ ఎరుగని బీభత్సం సృష్టిస్తాయి. అదెలాగో సినిమా కాబట్టి.. థ్రిల్లింగ్‌గా, గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఎన్ని పాములొచ్చినా.. పాప్ కార్న్ నములుతూ ఆస్వాదిస్తాం. కానీ, నిజంగానే అలాంటి ఘటన చోటుచేసుకుంటే? తలచుకుంటేనే గుండె వేగంగా కొట్టుకుంటోంది కదూ. మనల్ని భయపెట్టడానికి వంద పాములు.. ఒక్కసారే రావాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ పీకి పందిరేయడానికి ఒక్క పాము కనిపిస్తే చాలు. విమానం ఆపండ్రోయ్.. అంటూ కంగారుపడిపోతాం.
అయితే, కౌలలాంపూర్‌లో నిజంగానే ఓ పాము విమానంలో కనిపించింది. అయితే, పామును చూసి ఎవరూ భయపడలేదు. పైగా, కూల్‌గా వీడియోలు తీసుకున్నారు. ఇక్కడ భయపడాల్సింది ప్రయాణికులు కాదు, పామే. ఎందుకంటే.. అందులో ఉన్నది మలేషియా ప్రజలు. అక్కడివారికి స్నేక్ కనిపిస్తే చాలు.. నూనెలో దోరగా వేయించుకుని స్నాక్స్‌లా తినేస్తారు. కేవలం మలేషియా వాళ్లే కాదు.. దక్షిణ ఆసియాలోని ఇండోనేషియా, కంబోడియా, ఫిలిపిన్స్, లావోస్, వియత్నాం, థాయ్‌లాండ్‌తోపాటు ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ప్రజలు సైతం పామును పకోడిల్లా నమిలి తినేస్తారు. ఇక ఈ విషయాలను పక్కన పెట్టి.. అసలు సంగతిలోకి వెళ్లిపోదాం.
కౌలలాంపూర్ నుంచి ‘ఎయిర్ ఏసియా ఎయిర్ బస్ A320-200 విమానం.. మలేసియాలోని తవౌకు బయల్దేరింది. అయితే, ఆ విమానంలోని ఓ లైట్‌లో ఏదో కదులుతూ కనిపించింది. తీక్షణంగా చూస్తే.. అది పాము. అందులోకి ఎప్పుడు, ఎలా దూరిందో ఏమో.. టికెట్ తీసుకోకుండా ఫ్రీ జర్నీ చేస్తూ పట్టుబడింది. ఆధారాల కోసం కొందరు దాన్ని వీడియో తీసి.. అధికారులకు చూపించారు. అయితే, ఆ పామును చూసి ఎవరూ భయపడలేదట. విమానం గమ్యానికి చేరిన తర్వాత ఆ పామును పట్టుకున్నారట. మరి, ఫ్రీ జర్నీ చేసినందుకు జరిమానా విధించారో లేదో మాత్రం తెలీదు.
ఈ వీడియోను హనా మోహ్సిన్ ఖాన్ అనే కమర్షియల్ పైలట్ ట్వీట్ చేసింది. అయితే, ఈ వీడియో ఆమే తీసిందా? లేదా మరెవరైనా తీసిన వీడియోను ఆమె పోస్ట్ చేసిందా అనేది తెలియరాలేదు. ఆమె ట్వీట్ బట్టి చూస్తే.. ఆ పాము ఎవరో ప్యాసింజర్ లగేజీ నుంచి విమానంలోకి వచ్చి ఉండాలి. లేదా.. విమానాశ్రయంలోనైనా వేరే మార్గాల్లో పాకేస్తూ వచ్చేసి ఉండాలి. అయితే, ఈ పామును చూసిన తర్వాత ప్రయాణికుల సేఫ్టీ కోసం అత్యవసరంగా ల్యాండ్ చేశారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం పిచ్చ వైరల్ అవుతోంది.
విమానంలో పామును ఈ వీడియోలో చూసేయండి:
Yikes!
— Hana Mohsin Khan | هناء (@girlpilot_) February 12, 2022
Snake on a plane!
Either an escaped pet from passenger carry on/luggage or possibly climbed its way into the aircraft from the ground.
Air Asia Airbus A320-200,Kuala Lumpur to Tawau.
This dude happily stayed inside the illuminated area till plane was diverted😂 pic.twitter.com/jqopi3Ofvp
Also Read: అరే ఏంట్రా ఇదీ, బోరుకొడుతోందని రూ.7 కోట్ల పెయింటింగ్‌తో సెక్యూరిటీ గార్డు చిలిపి పని!
Also Read: మరణం తరువాత జీవితం ఉంటుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?