అన్వేషించండి

నిద్రకు ముందు నీళ్లు తాగాలా? వద్దా?

నిద్రకు ఉపక్రమించే ముందు ఇక గ్లాసు నీళ్లు తాగాలా? వద్దా? అవి చల్లగా తాగాలా? లేక వెచ్చగా తాగాలా? అనే డైలమా చాలా మందికి ఉంటుంది.

ప్రస్తుత కాలంలో నిద్ర పట్టడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు . అందుకు రకరకాల కారణాలున్నాయి. నిద్రకు ఉపక్రమించిన తర్వాత కూడా గాడ్జెట్స్ చూడడం, విపరీతమైన కెఫెన్ వాడకం వంటివి నిద్రకు శత్రువులు. బ్రౌసింగ్ కు బదులుగా బుక్ చదవడం, మెడిటేషన్ చెయ్యడం వంటివి అలవాటు చేసుకోవడం మంచిది. ఇవన్నీ ఎలాగూ ఉండేవే. కొంత మందికి నిద్రకు ఉపక్రమించే ముందు ఇక గ్లాసు నీళ్లు తాగాలా? వద్దా? అవి చల్లగా తాగాలా? లేక వెచ్చగా తాగాలా? అనే డైలమా చాలా మందికి ఉంటుంది. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.

కొంతమంది నిద్రకు ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుందని అంటే ఇంకొంత మంది దాని వల్ల నిద్ర చెదిరిపోతుందని అంటున్నారు. అయితే నిద్రకు ముందు నీళ్లు తాగడం వల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్ లో ఉంటుందని అంటున్నారు. నిద్రలో ఢీ హైడ్రేషన్ అయితే శరీరం చల్లగా లేదా వేడిగా అవుతుందట. అందుకని నిద్రకు ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే బెటర్ అనేది నిపుణుల అభిప్రాయం.

శరీరం సౌకర్యంగా ఉంటే నిద్ర చెదిరిపోకుండా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2014 లొ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అనే జర్నల్ లో శరీరం డీహైడ్రేట్ అయితే మూడ్ మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడతుందని, అది ఓవరాల్ స్లీప్ సైకిల్ మీద ప్రభావం చూపుతుందని ప్రచురితమైన ఒక అధ్యయనం నిర్ధారిస్తోంది. అంటే నిద్రకు ముందే ఎక్కువ నీళ్లు తాగమని కాదు కానీ కాస్త నీళ్లు తాగా పడుకోవడంలో నష్టం లేకపోగా లాభమే అంటున్నారు. అయితే నిద్రకు ముందు ఎక్కువ నీళ్లు లేదా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మూత్ర విసర్జన కోసం మధ్యలో లేవాల్సి వస్తుంది. చాలా సమయం పాటు మూత్రం ఆపుకోవాల్సి వస్తుంది. ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిరంతరాయ నిద్ర అవసరం. మధ్యలో మేల్కోవడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఇలా ప్రతిరోజు జరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొన్ని సార్లు ఇలా పదేపదే నిద్రకు అంతరాయం కలగడం గుండె సంబంధ అనారోగ్యాలకు కారణం కావచ్చు అని కూడ నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

అందుకే నీళ్ల తాగిన తర్వాత వెనువెంటనే నిద్రకు ఉపక్రమించిడం అంత మంచిదికాదనే అంటున్నారు. ఇలా నీళ్లు తాగి అలా నిద్రపోతే మంచి నిద్రలో మూత్ర విసర్జన కోసం మేల్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి నిద్రలో డీహైడ్రేషన్ సమస్య రాకుండా, నిద్రకు అంతరాయం కలుగకుండా ఉండాలంటే నిద్రకు ఉపక్రమించేందుకు కాస్త ముందు కొద్దిగా నీళ్లు తాగి మూత్ర విసర్జన తర్వాత నిద్రపోవడం మంచిది. అంతేకాదు డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే పగటి పూట తప్పకుండా తగినన్ని నీళ్లు తాగడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

నిద్రకు ముందు వెచ్చని నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేట్ కాకుండా ఉండొచ్చు. అంతేకాకుండా సహజంగా డీటాక్సిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వెచ్చని నీరు రక్త ప్రసరణను కూడా మెరుగు పరుస్తుంది. వెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం నుంచి చెమట కూడా ఎక్కువగా వస్తుంది. అందువల్ల చర్మ కణాలు శుభ్రపడుతాయి. నిద్రకు ముందు నీళ్లు తాగడం మీకు తప్పనిసరి అయితే మాత్రం తప్పకుండా వెచ్చని నీటిని ప్రిఫర్ చెయ్యడం మంచిది. ఇది శరీరం హైడ్రేటెడ్ గా ఉంచెందుకు, బాడీ టెంపరేచర్ స్తిమితంగా ఉంచేందుకు కూడా తోడ్పడుతుంది. అంతేకాక శరీరం నుంచి మలినాలను కూడా తొలగించేందుకు అవకాశం కలుగుతుంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Embed widget