News
News
X

Corn Flakes: షాకింగ్, కార్న్ ఫ్లాక్స్ తినడం మానేయమని చెబుతున్న హార్వర్డ్ పరిశోధన

బ్రేక్ ఫాస్ట్‌లో కార్న్‌ఫ్లాక్స్ తినే వారి సంఖ్య పెరిగిపోయింది. అలాంటి వారికి ఇది షాకింగ్ న్యూస్.

FOLLOW US: 
Share:

ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లేవారు కార్న్ ఫ్లాక్స్‌ను అధికంగా తింటారు. దీన్ని ప్రత్యేకంగా వండాల్సిన అవసరం లేదు. పాలలో ఈ కార్న్ ఫ్లాక్స్ వేసుకుంటే చాలు బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోతుంది. అందుకే కార్న్ ఫ్లాక్స్ తక్కువ సమయంలోనే ఎక్కువ మంది మనసు దోచుకుంది. అయితే  కార్న్ ఫ్లాక్స్ తినేవారికి ఒక షాకింగ్ న్యూస్... హార్వర్డ్  పరిశోధకులు చేసిన అధ్యయనంలో కార్న్ ఫ్లాక్స్ తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం లేదని, పైగా ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందని తేలింది. 

కార్న్ ఫ్లాక్స్ తినడం వల్ల మధుమేహం, ఫ్యాటీ లివర్, ఊబకాయం, అధిక రక్తపోటు, శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు పెరిగిపోతాయి.  ఇంట్లో వంట చేయడం కుదరనప్పుడు ఎక్కువమంది ఈ కార్న్ ఫ్లాక్స్ పై ఆధారపడిపోతారు. ఇది రెడీమేడ్ ఆహారం.కానీ దీన్ని తినడం వల్ల అలాంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే.

కార్న్ ఫ్లాక్స్‌ను అల్పాహారంగా మార్చి, దాన్ని మరింత ఆరోగ్యవంతంగా చేయడానికి కొంతమంది దానిపై స్ట్రాబెర్రీలు, పండ్ల ముక్కలు, బాదం, తేనె కలుపుకుంటారు. ఎన్ని కలిపినా కూడా కార్న్ ఫ్లాక్స్ వల్ల శరీరానికి ప్రమాదమే. వీటిని మొక్కజొన్న పిండితోనే కదా తయారు చేస్తారు అనే సందేహం రావచ్చు. నిజమే వాటిని మొక్కజొన్న పిండితోనే తయారు చేస్తారు. కానీ అవి చక్కెరతో లోడ్ చేసి ఉంటాయి. అలాగే ఇవి ప్రాసెస్డ్ ఆహారం కోవకే వస్తాయి. నిల్వచేసిన ఆహారం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఒరిగేదేమీ లేదు. అంతా అనారోగ్యమే.

కార్న్ ఫ్లాక్స్ లో తక్కువ ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది. మధ్యాహ్నభోజనంలో ఆహారం అధికంగా తినే అవకాశం ఉంది. ఇలా తరచూ జరిగితే అధిక బరువు బారిన పడడం ఖాయం. అలాగే ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల పేగు ఆరోగ్యం ప్రమాదం బారిన పడుతుంది. 

డయాబెటిస్ ఉంటే
ఈ పరిశోధన చేసిన డాక్టర్ ఫ్రాంక్ హు మాట్లాడుతూ... కార్న్ ఫ్లాక్స్‌లో చక్కెర, ఉప్పు అధికంగా ఉంటాయని, ఇవి మధుమేహ రోగులకు, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి ప్రమాదం అని చెప్పారు. వీటిని తినడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఊబకాయం బారిన త్వరగా పడతారని, వీటివల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరిగిపోతుందని వివరించారు. పాలు కాస్త చక్కెర కలిపి తినేవారు కూడా ఉన్నారు. దీనివల్ల ప్రమాదం ఇంకా పెరుగుతుంది. డయాబెటిక్ రోగులు కార్న్ ఫ్లాక్స్ ను పూర్తిగా మానేయాలి. వారికి తెలియకుండానే రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగిపోతాయి. అంతేకాదు కార్న్ ఫ్లాక్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ 93. అంటే  చాలా ఎక్కువనే చెప్పాలి. మధుమేహ రోగులకు కార్న్ ఫ్లాక్స్ పూర్తిగా మంచివి కావు.

Also read: సమీప భవిష్యత్తులో భారతీయులను పట్టి పీడించే ఆరోగ్య సమస్యలు ఇవే - చెబుతున్న అధ్యయనం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 07 Feb 2023 08:45 AM (IST) Tags: Harvard research Corn Flakes Corn Flakes side Effects

సంబంధిత కథనాలు

పెదవులు పొడిబారుతున్నాయా? అలసటగా ఉందా? అయితే, ప్రమాదమే - వెంటనే ఇలా చేయండి

పెదవులు పొడిబారుతున్నాయా? అలసటగా ఉందా? అయితే, ప్రమాదమే - వెంటనే ఇలా చేయండి

International Day Of Happiness: సంతోషమే సగం బలం - హ్యాపీగా ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

International Day Of Happiness: సంతోషమే సగం బలం - హ్యాపీగా ఉంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Vitamin A: విటమిన్ A లోపిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Vitamin A: విటమిన్ A లోపిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

ఇన్ఫ్లూయేంజా వల్ల జలుబు, జ్వరంతో బాధపడుతున్నారా? ఈ ఐదు సూపర్ ఫుడ్స్‌ను మీ డైట్ లో చేర్చుకోండి

ఇన్ఫ్లూయేంజా వల్ల జలుబు, జ్వరంతో బాధపడుతున్నారా? ఈ ఐదు సూపర్ ఫుడ్స్‌ను మీ డైట్ లో చేర్చుకోండి

Weight Loss Tips: డైటింగ్ చేయకుండా, వ్యాయామం లేకుండా బరువు తగ్గే సులభమైన పద్ధతులు ఇదిగో

Weight Loss Tips: డైటింగ్ చేయకుండా, వ్యాయామం లేకుండా బరువు తగ్గే సులభమైన పద్ధతులు ఇదిగో

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్