Salt: మూడు రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమమైందో తెలుసా?
ఉప్పు లేకుండా కాస్త కూడా ఆహారం తీసుకోవడం కష్టం. అయితే దాన్ని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.
కూరల్లో అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందట ఉప్పు. ఎందుకంటే ఎంత చక్కగా కూర వండిన కూడా ఉప్పు లేనిదే దానికి రుచి ఉండదు. అందుకే ఇది తప్పనిసరి. కానీ ఉప్పు పరిమితంగా తీసుకున్నప్పుడే అది ఆరోగ్యానికి అవసరమైన ప్రయోజనాలు అందిస్తుంది. అపరిమితంగా తీసుకుంటే మాత్రం సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. జీవక్రియని పెంచుతుంది. కండరాల సంకోచాలని నియంత్రిస్తుంది. ఎక్కువ ఉప్పు తీసుకుంటే అధిక రక్తపోటు వంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఆహారంలో తగిన పరిమాణంలో మాత్రమే ఉప్పుని జోడించుకోవాలి.
ఆహారానికి రుచి ఇస్తుంది. జీర్ణక్రియని సులభతరం చేస్తుంది. శరీర పనితీరుకి అవసరమైన సోడియం అందిస్తుంది. అయితే మీరు ఎటువంటి ఉప్పు తీసుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమే. ఉప్పులో అనేక రకాలు ఉన్నాయి. సముద్రపు ఉప్పు, పింక్ సాల్ట్, టేబుల్ సాల్ట్ ఏది ఆరోగ్యానికి మెరుగైన ప్రయోజనాలు అందిస్తుంది.
సముద్రపు ఉప్పు
సముద్రపు నీటిని ఆవిరి నుంచి ఇది తయారవుతుంది. మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఇందులో ఉండే ముఖ్యమైన ఖనిజాలు. ఎన్ఐహెచ్ ప్రకారం ప్రాసెస్ చేయబడిన టేబుల్ సాల్ట్ కంటే సముద్రపు ఉప్పు ఆరోగ్యకరమైనది. ఆహారంలో దీన్ని చేర్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాల రుచి కూడా చక్కగా ఉంటుంది.
టేబుల్ సాల్ట్
టేబుల్ సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుతో సహా అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. న్యూరాన్ ట్రాన్స్మిషన్, కండరాల సంకోచాలకు ఇది ముఖ్యం. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం దీన్ని మితంగా తీసుకోవడం మంచిది. ఆహారంలో టేబుల్ సాల్ట్ తగిన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
పింక్ సాల్ట్
పింక్ సాల్ట్ ని హిమాలయన్ ఉప్పు అని కూడ పిలుస్తారు. దీని ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ప్రజాదరణ పొందుతోంది. హిమాలయ ఉప్పు గులాబీ రంగులో ఉంటుంది. సంప్రదాయ టేబుల్ సాల్ట్ కంటే ఎక్కువ ఖనిజాలు కలిగి ఉన్నాయి. తేలికపాటి రుచి కలిగి ఉన్నప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మితంగా తీసుకుంటే మంచిది.
ఏ ఉప్పు ఉత్తమం
ఆహార రుచిని మెరుగుపరిచే ఉప్పు ఏది తీసుకుంటే మంచిదనే సందేహం అందరికీ ఉంటుంది. అనేక రకాల ఉప్పులో ఏది ఉత్తమం తెలుసుకోవడం ముఖ్యం. ఉప్పు తరచుగా రక్తపోటుతో ముడిపడి ఉన్నప్పటికీ శారీరక ప్రక్రియకి ఇది చాలా అవసరం. రోజువారీ ఉప్పు వినియోగం 2,300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరానికి ఉప్పు తగినంత అందాల్సిందే. ఉప్పు అధికంగా చేరినా ప్రమాదమే, తక్కువగా చేరినా ప్రమాదమే. ఉప్పు తగ్గితే కింద పడిపోవడం, తల తిరగడం వంటివి వస్తాయి. కొన్నిసార్లు షాక్, కోమా వంటివి కూడా కలుగుతాయి. పూర్తిగా ఉప్పు శరీరంలో నశిస్తే మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి ఉప్పును తినాలని చెబుతున్నారు వైద్యులు. కాకపోతే ఎక్కువగా తినకుండా మితంగా ఉప్పును తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి