Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి
శరీరంలోని కొవ్వుని కరిగించి బరువుని అదుపులో ఉంచేందుకు ఈ సింపుల్ టెక్నిక్స్ పాటించండి.
మానసిక, శారీరక శ్రేయస్సు కోసం ఫిట్ గా ఉండటం చాలా అవసరం. ఫిట్ గా ఉండాలంటే బరువులు ఎత్తడం, జిమ్ కి వెళ్ళి చెమటలు పట్టేలా కష్టపడటం ఒక్కటే కాదు. రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ శరీరానికి శ్రమ కలిగించే పనులు చేసినా కూడా ఫిట్ గా ఉండవచ్చు. శరీరానికి చెమట పట్టేలా పనులు చేయడం కోసం క్లిష్టమైన పరికరాలు ఏమి అవసరం లేదు. కేలరీలు బర్న్ చేసుకునేందుకు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇలా చేశారంటే మీరు జిమ్ కి వెళ్ళకుండానే సులువుగా బరువు తగ్గేస్తారు. ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారు.
డాన్స్
బరువు తగ్గడానికి డాన్స్ గొప్ప మార్గం. జుంబా, హిప్ హాప్, బాలీవుడ్ డాన్స్, సల్సా, ఏరోబిక్ డాన్స్ వంటివి ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇష్టమైన సంగీతం వింటూ కాలు కదిపితే ఎంత సేపు డాన్స్ చేస్తున్నారో కూడా తెలియకుండా చేసేస్తారు. భారతీయ శాస్త్రీయ నృత్యం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఫిట్ నెస్ ని పెంచుతుంది.
వాకింగ్, రన్నింగ్
సింపుల్ గా మీ రోజుని వాకింగ్, రన్నింగ్, లేదా జాగింగ్ తో మొదలుపెట్టవచ్చు. ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే రోజంతా యాక్టివ్ గా ఉండేలా దోహదపడతాయి. సౌకర్యవంతంగా ఉండే స్పోర్ట్స్ షూస్ ఉంటే చాలు ఇక ఏ పరికరాలు అవసరం లేదు. మెల్లగా నడుస్తూ మధ్య మధ్యలో జాగింగ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు ఎక్కువ దూరం నడవాలని అనుకుంటే మోకాళ్ళ దగ్గర బ్యాండ్ వేసుకోవడం మంచిది. శరీర బరువు తగ్గించుకునేందుకు బరువులు ఎత్తవచ్చు. అధిక బరువు ఎత్తడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. కాళ్ళ మీద బరువు పడే విధంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎటువంటి సపోర్ట్ లేకుండా నిలబడే వ్యాయామాలు చేయవచ్చు. ఇవి ఎముకలు, కండరాలు ధృడంగా మారేలా చేస్తాయి. ఇనుము పాత్రలు బరువు మోయడానికి ట్రై చేయండి.
యోగా
డాన్స్, వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు కొవ్వుని కరిగించడంలో సహాయపడతాయి. అవి మాత్రమే కాదు యోగా చేయడం కూడా ముఖ్యమే. ఇది మనసుని, మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది. యోగా బలం, ఏకాగ్రతని పెంచుతుంది. కోర్ కండరాలు బలంగా మారేలా చేస్తుంది. ఒత్తిడిని అడుపులూ ఉంచి మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
బరువు పెరగాలని అనుకుంటే మీరు తీసుకునే రోజువారీ కేలరీలు బర్న్ చేసే కేలరీల కంటే ఎక్కువగా ఉండాలి. ఒకవేళ బరువు తగ్గడానికి అయితే కేలరీల లోటు ఉండేలా చూసుకోవాలి. శరీరం తీసుకునే దానికి అనుగుణంగా వ్యాయామం చేయడం తప్పనిసరిగా ఉండాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఐరన్ పాత్రల్లో వంట చేస్తే నిజంగా ఆ సమస్యలు రావా? ఇందులో నిజమెంతా, ప్రయోజనాలేమిటీ?