వీడియో: గోళీల్లాంటి కళ్లు.. గాజు ముఖం.. నమ్మండి, ఇది చేపండి!
ఈ చేపను చూసిన తర్వాత ఎవరూ ఇక అమ్మాయిల నయనాలను ‘మీనా’ కళ్లు అని అభివర్ణించరు.
ఈ ఫొటో చూడగానే.. ఇదేదో గాజు బొమ్మ అనుకున్నారు కదూ. కానే కాదు.. ఇదొక వింత చేప. గాజుతో తయారు చేసిన సబ్‌మెరిన్ క్యాప్సుల్స్ తరహాలో ఉన్న ఈ చేప.. ఇప్పుడు శాస్త్రవేత్తలనే ఆశ్చర్యంలో ముంచేస్తోంది. అందుకే, దీనిపై ప్రత్యేకంగా ఒక డాక్యుమెంటరీ తయారు చేసి.. దాని ప్రత్యేకతను ప్రపంచానికి చూపించారు.
కంటికి కనిపించే భూమిని మాత్రమే మన ప్రపంచం అని అనుకుంటాం. ఇక్కడ ఉండే జీవులు మరెక్కడా ఉండవని భావిస్తాం. కానీ, 71 శాతం భూగ్రహాన్ని నీరే ఆక్రమించింది. ఇందులో 96.5 శాతం సముద్రపు నీరే ఉంది. మిగతావన్నీ నదులు, సరస్సులు తదితరాలు. మరి, ఆ స్థాయిలో భూగ్రహాన్ని ఆక్రమించిన సముద్రంలో ఎంత పెద్ద ప్రపంచం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భూమి కంటే వేల రెట్లు.. వివిధ జీవులు నివసిస్తున్నాయి. సముద్ర తలంపై కొన్ని.. సముద్ర అడుగున ఉండే చీకటి ప్రపంచంలో మరికొన్ని జీవులు దర్జాగా బతికేస్తున్నాయ్. అంగారకుడికి నిచ్చెన వేసిన శాస్త్రవేత్తలు సైతం తెలుసుకోలేనని అనేక రహస్యాలు సముద్రంలో ఉన్నాయి. ఎన్నో చిత్రవిచిత్ర జీవులు అక్కడ నివసిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ వింత చేప.
గతవారం.. ఈ చేప శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచేసింది. ఎందుకంటే.. దాని తల (ముఖం) మొత్తం చాలా పారదర్శకం(Transparent)గా గాజు ముఖంలా ఉంది. అంతేకాదు.. దాని కళ్లు వీధుల్లో పిల్లలు ఆడుకొనే గోళీల్లా పచ్చగా గుండ్రంగా ఉన్నాయి. మిగతా శరీరం మాత్రం నల్లగా ఉంది. పసిఫిక్ మహా సముద్రంలోని కొన్ని వేల అడుగుల లోతులో ఈ చేప కనిపించిందట. ఈ అరుదైన చేప వీడియోను మాంటెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (Monterey Bay Aquarium Research Institute- MBARI) డిసెంబరు 9న సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది.
Also Read: మారండ్రా బాబు.. గుర్రమెక్కిన వధువు.. స్కూటీపై వరుడిని ఊరేగించిన నయా పెళ్లి కూతురు!
ఇటీవల.. ROVs Ventana, Doc Ricketts క్రాఫ్ట్‌లను సముద్రంలోని 5,600 మీటర్ల లోతుకు పంపించామని MBARI తెలిపింది. సుమారు 27,600 గంటల నిడివి గల వీడియోను అవి రికార్డు చేశాయని పేర్కొంది. ఆ వీడియోను పరిశీలిస్తున్నప్పుడు ఈ 9 సార్లు కెమేరాకు చిక్కిందని, సుమారు 650 మీటర్ల లోతులో ఇది జీవిస్తున్నట్లు తెలుసుకున్నామని తెలిపింది. దాని రూపం ఆధారంగా పరిశోధకులు దానికి బర్రెల్య్ ఫిష్ (Barreleye Fish) అని పేరు పెట్టారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ చిత్రవిచిత్ర చేపపై మీరూ ఓ లుక్ వేసేయండి.
I spy with my barreleye, a new #FreshFromTheDeep!
— MBARI (@MBARI_News) December 9, 2021
During a dive with our education and outreach partner, the @MontereyAq, the team came across a rare treat: a barreleye fish (Macropinna microstoma). pic.twitter.com/XjYj04MOCt
Also Read: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. ఆపండ్రా మీ అరాచకం!
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి