Bride Rides Horse: మారండ్రా బాబు.. గుర్రమెక్కిన వధువు.. స్కూటీపై వరుడిని ఊరేగించిన నయా పెళ్లి కూతురు!
మారండ్రా బాబు.. గుర్రమెక్కిన వధువు.. స్కూటీపై వరుడిని ఊరేగించిన మరో పెళ్లి కూతురు!
‘‘ఎప్పుడూ అదే బ్యాండ్ బాజా.. అదే ఊరేగింపు.. కాస్త ట్రెండ్ మార్చండ్రా బాబు’’ అంటూ ఆ వధువులు.. తమ వరుడి పెళ్లి ఊరేగింపు బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నారు. రొటీన్‌కు భిన్నంగా.. వారే స్వయంగా వరుడి ఇంటికెళ్లి.. పెళ్లి మండపానికి ఊరేగిస్తూ తీసుకొచ్చారు. అయితే.. వీరు వెళ్లింది కారులో కాదు. ఒక వధువు గుర్రంపై ఊరేగుతూ వెళ్లితే.. మరో వధువు ఏకంగా స్కూటీ వేసుకుని బయల్దేరింది. ఈ ఘటనలు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నా.. ఒకే రోజు వైరల్‌గా మారాయి.
సాధారణంగా వరుడు గుర్రం మీదో.. కారులోనూ ఊరేగింపుగా తన ఇంటి నుంచి పెళ్లి మండపానికి చేరుకుంటాడు. ఉత్తరాదిలో ఈ సాంప్రదాయాన్ని ‘బరాత్’ అని అంటారు. అయితే, బిహార్‌లోని గయాలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన సీనియర్ ఎయిర్ హోస్టెస్ అనుష్క గుహా.. ఏకంగా గుర్రమెక్కి తనకు కాబోయే భర్తను పెళ్లి మండపానికి తీసుకొచ్చేందుకు బయల్దేరింది. లెహంగాతోనే ఆమె గుర్రంపై కూర్చొని బ్యాండ్ బాజా మధ్య.. వరుడు జీత్ ముఖర్జీ ఇంటికి వెళ్లింది. అయితే, జీత్ కారులో ఊరేగుతూ మండపానికి రాగా.. అనుష్క మాత్రం గుర్రం మీదే చేరుకుంది.
ఆమె తల్లి సుశ్మిత గుహ మాట్లాడుతూ.. ‘‘ఆమెకు బాల్యం నుంచి ఒక సందేహం ఉండేది. ఎప్పుడూ వరుడే గుర్రమెక్కి పెళ్లి మండపానికి వస్తాడు ఎందుకు? అని అడిగేది. అది సాంప్రదాయమని చెబితే.. ఆమె అంగీకరించేది కాదు. ఆ సాంప్రదాయాన్ని నేను బ్రెక్ చేస్తానని చెప్పేది. ఎట్టకేలకు గుర్రంపై ఊరేగి.. బరాత్‌లో పాల్గొంది’’ అని తెలిపింది. అయితే, మరో వధువు స్కూటీపై వరుడిని ఊరేగించడం కూడా వైరల్‌గా మారింది. ఆమె గురించి తెలుసుకొనే ముందు.. అనుష్క ఊరేగింపు వీడియోను చూసేయండి.
#WATCH बिहार: गया में एक दुल्हन ने घोड़ी पर चढ़कर अपनी बारात निकाली। (13.12) pic.twitter.com/7MmW7klciq
— ANI_HindiNews (@AHindinews) December 14, 2021
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో మరో వధువు.. వరుడిని తీసుకొచ్చేందుకు స్కూటీపై బయల్దేరింది. వరుడు రాహుల్ ఊరేగింపుగా పెళ్లి మండపానికి వచ్చే లోపే వధువు స్కూటీపై అతడి రిసీవ్ చేసుకుంది. ఆమె స్కూటీ నడుపుతుంటే వరుడు ఆమె వెనుక కూర్చొని పెళ్లి మండపానికి వచ్చాడు. అది చూసి అతిథులు, బంధువులు ఆశ్చర్యపోయారు. ఈరోజుల్లో పిల్లలు ఉన్నారే అంటూ.. విడ్డూరం చూసినట్లు చూస్తుండిపోయారు.
Also Read: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. ఆపండ్రా మీ అరాచకం!
Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి