అన్వేషించండి

Black Idlis: బొగ్గులు కావివి.. బ్లాక్ ఇడ్లీలు.. ఆపండ్రా మీ అరాచకం!

ఈ ఇడ్లీలను చూస్తే మీకు ఏమనిపిస్తోంది? పొయ్యలో బొగ్గులను నేరుగా ప్లేట్లో వేసి ఇచ్చేస్తున్నారేమో అనిపిస్తుందా? అయినా.. రోజూ ఆ తెల్ల ఇడ్లీలు ఏం తింటారు.. కాస్త నల్లవి కూడా ట్రై చేయండి.

ఫుడ్ అంటే.. చూడగానే నోరూరేలా ఉండాలి. కానీ, ‘‘బాబోయ్’’ అని ముఖం చిట్లించేలా ఉండకూడదు. ఇదిగో ఈ ఇడ్లీలను చూస్తే మీకు అదే ఫీలింగ్ కలుగుతుంది. ఇదేంటీ మాడిపోయిన ఇడ్లీలు వడ్డిస్తున్నారా? లేదా బొగ్గులనే ఇడ్లీలుగా మార్చేశారా అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే.. వాటిని కావాలనే నల్ల రంగులో తయారు చేసి ‘బ్లాక్ ఇడ్లీ’ అని నామకరణం చేశారు. ఈ వెరైటీ ఇడ్లీలను మీరు తిని తరించండని పిలుస్తున్నారు. ఈ ఇడ్లీలను చూసిన ఆహార ప్రియులు.. ఇక ఆపండ్రా మీ అరాచకం అంటూ సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల చాక్లెట్ మ్యాగీ, రసగుల్లా చాట్, పిజ్జా దోశలు ఏ స్థాయిలో వైరల్‌గా మారాయో తెలిసిందే. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ అల్పాహారాల్లో ఒకటైన దోశను వెరైటీ పేరుతో ఎన్ని చిత్ర హింసలకు గురిచేస్తున్నారో తెలిసిందే. తాజాగా ఇడ్లీని కూడా ఖూనీ చేసేస్తున్నారు. నాగపూర్‌లోని ఓ ఫుడ్ సెంటర్‌లో ‘బ్లాక్ డిటాక్స్ ఇడ్లీ’ పేరుతో నల్ల రంగు ఇడ్లీలను అమ్మేస్తున్నారు. ఫుడ్ బ్లాగర్ వివేక్, అయేషాలు ఇటీవల ఈ ఇడ్లీల వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. అంతే.. అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ‘‘మీరు ఎప్పుడైనా బ్లాక్ ఇడ్లీలను తిన్నారా?’’ అంటూ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఫాలోవర్లు రకరకాల సమాధానాలు ఇస్తున్నారు. 

ఇప్పటివరకు ఈ వీడియోను లక్ష మందికి పైగా లైక్ చేశారు. ‘‘వీళ్లను ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో రైన్ బో ఇడ్లీ కూడా తయారు చేసి అమ్మేస్తారు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ఇడ్లీ తెల్లగా ఉంటే మీకు ఏ నష్టం వచ్చింది?’’ అని ఇంకొకరు అన్నారు. ఏదో ఒక రోజు వీళ్లు.. ‘‘రాళ్లు, రప్పలతో కూడా ఇడ్లీలు తయారు చేసి వడ్డించేస్తారు’’ అని కామెంట్ చేశారు. అయితే, కొందరు మాత్రం.. ఈ ఇడ్లీ అంత నల్లగా మారేందుకు ఏం కలిపారని ఆసక్తిగా అడుగుతున్నారు. అన్నట్లు.. ఆ ఇండ్లీలో ఏం కలిపి ఉంటారు??

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VIVEK N AYESHA |NAGPUR BLOGGER (@eatographers)

Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే

Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్

Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget