Food Poisoning: ప్యాక్ చేసిన సలాడ్ ఆరగిస్తున్నారా? జాగ్రత్త ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది
సలాడ్ ఆరోగ్యకరమైన ఆహారం. కానీ అది ఇంట్లో చేసుకుంటే మంచిది అదే బయట నుంచి కొనుగోలు చేసి తింటే మాత్రం అనారోగ్యం బారిన పడక తప్పదు.
ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ఆహారాలు తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అవి మాత్రమే కాదు ఆరోగ్యకరమ అనుకునే కొన్ని ఆహారాలు కూడా అనారోగ్యంగా మారతాయి. వేసవిలో మనం తీసుకునే ఐస్ క్రీమ్, బరువు తగ్గేందుకు అత్యధికులు ఎంచుకునే మొలకలు వంటివి కూడా ఫుడ్ పాయిజనింగ్ అయి మన ప్రాణాల మీదకి తీసుకొస్తాయి. యూకే, యూఎస్ లో ఈ ఆహారాలు ఫ్రీజర్ లో పెట్టుకుని తినడం వల్ల ఎక్కువ మంది హాస్పిటల్ పాలవుతున్నారట. యూకేలో అనేక రకాల ఆహార పదార్థాల వల్ల వ్యాధికారక క్రిములు సాల్మొనెల్లా, లిస్టేరియా వ్యాప్తి చెందాయి. వీటి బారిన పడి ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ రెండు దేశాల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు భారీగా పెరుగుతున్నందున చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక్కోసారి ఆహారం చెడిపోయిందో లేదో ముక్కు ద్వారా వాసన చూసి పసిగట్టలేకపోవచ్చు. ఆహారాన్ని సరిగా నిల్వ చేయలేనప్పుడు వాటిని తీసి పారేయడమే మంచిది. ముక్కు ద్వారా వాసన చూసి అది చెడిపోయిందో లేదో తెలుసుకునే కంటే వాటిని సరైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేసుకోవడం, సరైన సమయానికి వాడుకోవడం మంచిదని సూచిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్న ఈ ఆహారాలు ప్రాణహాని కలిగించే ఫుడ్ పాయిజనింగ్ ని ఇస్తున్నాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐస్ క్రీమ్
అదేంటి చల్లగా ఉండే ఐస్ క్రీమ్ ఫుడ్ పాయిజనింగ్ కి ఎలా దారి తీస్తుందని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజం. క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా, ఇ.కోలి, లిస్టేరియా వంటి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ వేసవి వేడి ఉష్ణోగ్రతలో వృద్ధి చెందుతాయి. ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. లిస్టేరియా బ్యాక్టీరియాయ అయితే ఫ్రీజర్ లో సున్నా లేదా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుని జీవించగలదు. ఇది ఇతర ఆహార పదార్థాల ఉపరితలాల మీదకు సులభంగా వ్యాపిస్తుంది. కరిగిన ఐస్ క్రీమ్ ఎప్పుడు రీఫ్రీజ్ చేయకూడదని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
మొలకలు
మొలకెత్తిన గింజల్లో 30 శాతం కంటే ఎక్కువ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. మొలకల నుంచి వచ్చే సాల్మొనెల్లా వల్ల దాదాపు 19 మంది యూఎస్ వాసులు ఆస్పత్రి పాలయ్యారు. ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ప్రకారం అన్ని రకాల మొలకలు అల్ఫాల్ఫా, ముంగ్ బీన్, క్లోవర్, ముల్లంగి మొలకలతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. వాటి విత్తనాల వల్ల బ్యాక్టీరియా కాలుష్యం ఏర్పడుతుంది.
సలాడ్
ప్రతి ఒక్కరికీ భోజనంలో తప్పకుండా సలాడ్ తీసుకునే అలవాటు ఉంటుంది. మన దగ్గర అయితే అప్పటికప్పుడు చేసుకుంటారు. కానీ వివిధ దేశాల్లో సలాడ్ చేసి ప్యాకెట్స్ లో లభిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని హరించే వేసే మరొక పదార్థం. సలాడ్ కలుషితానికి అతి పెద్ద మూలం పాలకూర. లెట్యూస్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఎరువు వేసి పండించిన పాలకూరలో జంతువు మలం నుంచి వచ్చే బ్యాక్టీరియా సలాడ్ లో చేరుతుంది. యూరోపియన్ యూనియన్ ఫుడ్స్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ప్రకారం బ్యాగ్డ్ సలాడ్‌లు ఫుడ్ పాయిజనింగ్‌కి రెండవ అత్యంత పెద్ద కారణమని పేర్కొంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: బరువు తగ్గేందుకు జీడిపప్పు తినేయండి - కానీ ఒక షరతు!