అన్వేషించండి

Sabudana Benefits: సగ్గు బియ్యంతో బరువు తగ్గే ఛాన్స్.. అదొక్కటే కాదు మరెన్నో ప్రయోజనాలు

సాబుదానా లేదా సగ్గు బియ్యం ఎలా పిలుచుకుంటారో మీ ఇష్టం. అవి చేసే మేలు తెలుసుకుంటే నిత్యం వాటిని ఇంట్లో కొని పెట్టుకుంటారు.

చాలామంది సగ్గుబియ్యం ఏదో మొక్కకు కాస్తుందనుకుంటారు. కానీ కాదు, దాన్ని కర్రపెండలం దుంపలతో చేసే పిండి నుంచి తయారు చేస్తారు. పూర్వ కాలంలో వీటి వాడుక ఎక్కువగానే ఉండేది. పిజ్జాలు, బర్గర్ల కాలంలో మాత్రం చాలా తక్కువ మందిన వీటిని వినియోగిస్తున్నారు. వీటితో కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు మీరు.  కర్ర పెండలం ఆఫ్రికా దేశాలలో ప్రధాన ఆహారం. దాదాపు 20 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది మొక్క. కింద భూమిలో దుంపలు కాస్తాయి. మనదేశంలో కేరళ, తమిళనాడులలో ఎక్కువగా పండిస్తున్నారు. 

బరువు తగ్గేందుకు...
సగ్గుబియ్యంలో కొవ్వు ఉండదు, ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణ క్రియ వేగాన్ని తగ్గిస్తుంది. పేగులు పోషకాలను అధికంగా గ్రహించేలా చేస్తుంది. దీని వల్ల పొట్ట నింపుగా ఉన్న ఫీలింగ్ వచ్చి, ఆహారం త్వరగా తీసుకోరు. కాబట్టి బరువు తగ్గే అవకాశం ఉంది. వీటిలో పోషక విలువలకు కూడా లోటు లేదు. అయితే కేలరీలు మాత్రం అధికంగా ఉంటాయి. కనుక మితంగా తింటే బరువు తగ్గే అవకాశం ఉంది. 

పిల్లలకు....
పోషకాహార లోపం ప్రధానంగా పిల్లల్లోనే కనిపిస్తుంది. ఆ లోపంతో బాధపడేవారికి సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తినిపిస్తే త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. నైజీరియాలో పిల్లలపై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. కర్రపెండలంలో దొరికే పిండిపదార్థం పిల్లల్లో శక్తిని అందిస్తుంది. 

ఎంత బలమో...
వందగ్రాముల సగ్గుబియ్యంతో చేసిన ఆహారం తింటే 20 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. ఇది రోజువారీ అవసరాన్ని తీరుస్తుంది. ఇనుము, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఎముకలను బలంగా మారుస్తాయి. 

గుండెకు రక్ష
సగ్గుబియ్యం రోజూ తినడం అలవాటు చేసుకుంటే గుండె వ్యాధులు రాకుండా ఉంటాయి. వీటిలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలాగే అమిలోజ్ అనే పిండి పదార్థం అధికంగా లభిస్తుంది. 

గర్భిణీలకు
గర్భం ధరించడానికి ముందు, ధరించిన తరువాత కూడా సగ్గుబియ్యాన్ని తినడం అలవాటుగా మార్చుకోవాలి. ఇవి గర్భంలో బిడ్డ ఎదుగుదలకు సహకరిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ బి6, ఫోలేట్లు పిండానికి శక్తిని అందిస్తాయి.  బిడ్డలో న్యూరల్ ట్యూబ్ లోపం లేకుండా ఇది నిరోధిస్తుంది. 

ఏ వయసులో ఉన్నవారిలోనైనా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కనుక ఇంటిల్లిపాదికి మేలు చేసే సగ్గుబియ్యాన్ని మెనూలో చేర్చుకోవడం అన్నివిధాలా మంచిది. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Monsoon Hair Fall : వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడుతుందా? కారణాలివే.. తగ్గించేందుకు నిపుణులు చెప్పిన చిట్కాలు
వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడుతుందా? కారణాలివే.. తగ్గించేందుకు నిపుణులు చెప్పిన చిట్కాలు
Blood Tests : రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?
రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?
Blood in Urine : మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు
మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
LPG Tanker Explosion: టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
Embed widget