కసిగా 10 వేల అడుగులు టార్గెట్ పెట్టుకుని నడిచేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవు, ఈ టిప్స్ పాటించండి
నడక మంచి వ్యాయామని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించిన విషయమే. ఎంత సమయం పాటు నడవాలి? లేక ఎంత దూరం నడవాలి అనే విషయాల గురించి చాలా వాదాలు ఉన్నాయి.
నడిస్తే బరువు తగ్గిపోవచ్చని చాలామంది అనుకుంటారు. దీంతో చాలామంది పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటారు. రోజుకు 10 వేల అడుగులు నడుస్తూ వేగంగా బరువు తగ్గిపోడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఏ మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావారు.. ఊబకాయులకు ఈ టార్గెట్ అంత మంచిది కాదంటున్నారు. అది ఎందుకో చూడండి.
రోజూ పదివేల అడుగులు నడిచేవారు త్వరగా బరువు తగ్గగలరని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది అందరికీ వర్తించదని అంటున్నారు. బరువు ఎక్కువగా ఉన్నవారు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారికి ఇది సరైన టార్గెట్ కాదంటున్నారు. స్థూల కాయంతో బాధ పడేవారు 10 వేల అడుగులు నడవ కూడదు. నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలి. ఎందుకంటే అతి బరువు వల్ల కీళ్లు, కండరాల మీద భారం పడి మరింత ఒత్తిడికి లోనవుతారు. అది మరింత నొప్పికి కారణం కాగలదు. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి కూడా ఇది మంచిది కాదు.
కొన్ని ఆరోగ్య సంబంధ కారణాలతో అధిక బరువుతో బాధపడుతున్న వారు లేదా జన్యు సంబంధ కారణాలతో బరువు పెరిగిన వారు ఇలా ఎక్కువ శ్రమతో కూడిన బరువు తగ్గే విధానాలను అనుసరించడం వల్ల కొత్త సమస్యలు రావచ్చని కూడా కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి వారు మొబిలిటి కలిగి ఉండేందుకు, ఫ్లేక్సిబుల్ గా ఉండేందుకు అనువైన వ్యాయామాల మీద దృష్టి సారించడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఒకేసారి 10 వేల అడుగులు నడిస్తే దీర్ఘకాలిక కండర కణజాలాలకు నష్టం జరగవచ్చు. సపోర్టింగ్ కండరాలు బలహీన పడడం వల్ల కొద్ది పాటి శారీరక శ్రమ వల్ల కూడా గాయాలయ్యి మరింత అసౌకర్యం ఏర్పడవచ్చు.
కీళ్లను ఎలా బలోపేతం చేసుకోవాలి?
10 వేల అడుగుల లక్ష్యాన్ని ఛేధించడానికి ముందు శరీరాన్ని సన్నద్దం చేస్తూ కొన్ని ప్రత్యేక వామ్అప్ వ్యాయామాలు ప్రాక్టీస్ చెయ్యాలి.
- అన్ని కీళ్లను వామప్ చేసే విధంగా కీళ్లను ముందుగా కదపాలి.
- కుర్చీలో కూర్చుని మోకాలిని పూర్తిగా స్ట్రెచ్ చేస్తూ దగ్గరకి లాక్కోవాలి. ఇలా ఒక్కోకాలికి 5 -10 సార్లు చెయ్యాలి.
- కుర్చిలో కూర్చుని నిలబడడం తర్వాత కాళ్లు ఎత్తి ఛాతి దగ్గరకు తీసుకోవడం ఇలా 5 సార్లు చెయ్యాలి. ఇలా చేస్తే మోకాళ్లు, తుట్టి దగ్గర కదలికలు సులువవుతాయి.
- కుర్చి వెనుక నిలబడి కుర్చిని పట్టుకుని నెమ్మదిగా బొటన వేళ్ల మీద నిలబడి.. మడిమలను కిందకు దించాలి. ఇలా 5-10 సార్లు చెయ్యాలి.
ముందుగా చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని నడక ప్రారంభించి.. క్రమంగా అడుగుల సంఖ్యను పెంచుతూ ఫోవడం వల్ల నెమ్మదిగా 10 వేల అడుగుల నడక లక్ష్యాన్ని చేరుకోవడం ఉత్తమం.
Also Read : Water Park Safety Tips: పిల్లలను వాటర్ పార్క్‌కు తీసుకెళ్లున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.