Water Park Safety Tips: పిల్లలను వాటర్ పార్క్‌కు తీసుకెళ్లున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే!
ఈ మధ్య కాలంలో సెలవుల్లో అమ్యూజ్మెంట్ పార్కుల్లో ఎంజాయ్ చెయ్యడం చాలా పెరిగింది. అందులో వాటర్ పార్క్ లకు వేసవిలో చాలా డిమాండ్ ఉంటుంది. మరి వాటర్ పార్క్ లో ఎంజాయ్ చెయ్యాలనుకుంటే జాగ్రత్తలు పాటించాలి.
వేసవి సెలవుల్లో రకరకాల ప్రదేశాలు చూడటానికి వెళ్తుంటారు. మరికొందరు అమ్యూజ్మెంట్ పార్కుల్లో ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు ఈ పార్కుల్లో బోలెడు ఫన్. వేసవి వేడిలో వాటర్ పార్క్‌కు వెళ్తే.. ఆ హాయే వేరు. వేడి వాతావరణంలో నీటిలో ఆటలాడుతుంటే.. భలే సరదాగా ఉంటుంది. అయితే, ఆ వాటర్ పార్కులో మీరు మాత్రమే ఉండరు. ఎంతోమంది ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి.. తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా ముప్పు తప్పదు.
ముందుగా వాటర్ పార్కుల నిర్వహణ పరిశీలించాలి
ఈ మధ్య నగరం చుట్టు పక్కల చాలా వాటర్ పార్కులు ఏర్పాటు చేశారు. కొన్ని విశాలంగా ఆకర్శణీయంగా ఉంటున్నాయి. అన్ని పార్కుల్లో ఎలాంటి సౌకర్యాలను ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. నీటి శుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది కూడా చాలా ముఖ్యం. మంచి వాటర్ రైడ్‌ను ఎంజాయ్ చెయ్యడానికి భద్రత చాలా ప్రధానమని మరచిపోవద్దు. ఇంటర్నెట్‌లో పూర్తి స్థాయిలో పరిశోధన చేసిన తర్వాతే ఏ పార్క్ అయితే మంచిదో నిర్ణయించుకోవాలి.
అవసరమైన వస్తువులను తీసుకువెళ్లాలి
వాటర్ పార్క్‌లో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్తున్నపుడు తప్పకుండా కొన్ని వస్తువులు తీసుకువెళ్లాలి. వాటిలో ఒక జత అదనంగా దుస్తులు, సన్ స్క్రీన్ లోషన్, పౌడర్, వాటర్ బాటిల్, ఫస్ట్ ఎయిడ్ కిట్, కొద్దిగా స్నాక్స్ వెంట ఉంచుకోవడం మంచిది.
పిల్లలను ఒంటరిగా వదలొద్దు
పిల్లలు పార్క్‌లో ఎక్కడికి వెళ్లినా వెంట మీరు తప్పకుండా వెళ్లాలి. వారి మీద ఒక కన్ను వేసి ఉంచడం అవసరం. పిల్లలకు ఏర్పాటు చేసిన హద్దులను వారు దాటకుండా కచ్చితంగా జాగ్రత్త పడాలి. ఏ రైడ్‌కు కూడా వారిని ఒంటరిగా పంపించవద్దు.
ముందుగా ఫోన్ చెయ్యాలి
వాటర్ పార్క్‌ను చేరడానికి ముందే అక్కడి ఆఫీసుకు కాల్ చేసి తెరచి ఉందని నిర్ధారించుకోవాలి. టికెట్ ధరలు ఇతర సదుపాయల గురించి కూడా వాకబు చేసేందుకు అవకాశం ఉంటుంది.
త్వరగా చేరుకోవాలి
వీలైనంత త్వరగా వాటర్ పార్క్‌ను చేరుకోవడం మంచిది. మీరు ఎంత ఆలస్యంగా చేరితే అక్కడ రద్దీ అంత పెరగవచ్చు. జనం ఎక్కువగా ఉంటే పిల్లలు సరిగ్గా ఎంజాయ్ చెయ్యలేరు. పార్క్ తెరవడానికి 10 నిమిషాల ముందే అక్కడికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే మీకు నచ్చిన రైడ్ ఎంపిక చేసుకోవడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావచ్చు. రద్దీ తట్టుకునేందుకు గాను వీలైనంత త్వరగా గమ్యం చేరాలి.
Also read : Anger Management Tips: కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే.. కూల్ కూల్.. సూపర్ కూల్!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.