News
News
వీడియోలు ఆటలు
X

Mango: మామిడిపండుతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీలు - వీటితో ఈజీగా బరువు తగ్గొచ్చు

మామిడిపండు సీజన్ వచ్చేసింది. వాటిని తింటూ సులువుగా బరువు తగ్గండి.

FOLLOW US: 
Share:

సీజనల్ ఫ్రూట్ మామిడిపండు. వేసవిలో మాత్రమే దొరికే ఈ పండును కచ్చితంగా తినమని చెబుతారు పోషకాహార నిపుణులు. విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యుట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇది తినడం వల్ల మన శరీరం ఇనుమును సులువుగా శోషించుకుంటుంది.  జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు మామిడిపండు ఎంతో అవసరం. అలాగే బరువు తగ్గించే డైట్ లో కూడా ఇది ఒక భాగం. వీటిని తింటూ బరువును సులువుగా తగ్గొచ్చు. వైద్యులు కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ బరువు తగ్గమని సూచిస్తారు. మామిడి పండుతో సింపుల్‌గా చేసుకునే రెసిపీలు ఇవిగో. వీటిని పెద్దగా వండాల్సిన అవసరం లేదు. 

మామిడిపండు ఓట్స్ స్మూతీ
ఓట్స్ - రెండు స్పూన్లు 
మామిడిపండు - ఒకటి 
చియా సీడ్స్ - ఒక స్పూన్ 
నీళ్లు - ఒక గ్లాసు

తయారీ ఇలా
1.  స్టవ్ మీద కళాయియి పెట్టి అందులో ఒక గ్లాసు నీరు వేయాలి. 
2. ఆ నీళ్లలో ఓట్స్, చియా సీడ్స్ వేసి ఉడికించాలి అవి మెత్తగా అయ్యాక చల్లారనివ్వాలి. 
3. ఈ మొత్తం మిశ్రమాన్ని బ్లెండర్లో వేసి జ్యూస్ లా చేసుకోవాలి. 4. ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసులో వేసి పైన మామిడి పండు ముక్కలను వేసుకోవాలి. మామిడి పండు ఓట్స్ స్మూతీ రెడీ అయినట్టే. 
.................................

కొబ్బరితో మామిడిపండు ఓట్ మిల్
లేత కొబ్బరి - 50 గ్రాములు 
కొబ్బరి పాలు - అర గ్లాసు 
ఓట్స్ - అర కప్పు 
మామిడిపండు ముక్కలు - అరకప్పు 
డ్రై ఫ్రూట్స్ తరుగు - గుప్పెడు 
తేనె - ఒక స్పూను 
యాలకుల పొడి - చిటికెడు

1. ఒక గిన్నెలో పైన చెప్పిన అన్ని పదార్థాలను వేసి బాగా కలిపి రాత్రంతా ఉంచాలి.  
2. గిన్నెపై మూత పెట్టడం మర్చిపోవద్దుచ లేదా ఫ్రిడ్జ్ లో పెట్టినా మంచిదే. 
3. ఉదయం లేచాక వాటిని అల్పాహారంగా తింటే ఆరోగ్యానికి మంచిది. రుచి కూడా అదిరిపోతుంది.
.................................

మామిడి సలాడ్
వర్జిన్ ఆలివ్ ఆయిల్ - ఒక స్పూను 
పాలకూర - గుప్పెడు 
మామిడిపండు - ఒకటి 
తేనె - ఒక స్పూను 
మిరియాల పొడి- చిటికెడు

1. పాలకూర ఆకులను బాగా కడిగి సన్నగా తురుముకోవాలి. 
2. మామిడిపండును కూడా సన్నగా తరగాలి. 
3. సలాడ్ చేయడానికి ఒక గిన్నెను తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి గిన్నె కింద అడుగుభాగానికి బాగా పట్టించాలి.
4.  ఆ గిన్నెలో పాలకూర తరుగును, మామిడిపండు తరుగును వేయాలి.
5. వాటిని బాగా కలపాలి. తేనే, పెప్పర్ కూడా చల్లి బాగా కలుపుకోవాలి. 
6. ఆలివ్ ఆయిల్‌ను పైన చల్లుకొని సలాడ్ తినాలి. 
ఈ మామిడి సలాడ్ కంటికి, చర్మానికి, మెదడుకు, కాలేయ పనితీరుకు మేలు చేస్తుంది. 

Also read: సాధారణ ఉప్పుకు బదులు రాతి ఉప్పు వాడి చూడండి, ఎన్ని ప్రయోజనాలో

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 27 Mar 2023 12:26 PM (IST) Tags: Recipes with Mango Mango Recipes for WeightLoss WeightLoss Recipes

సంబంధిత కథనాలు

Diabetes: డయాబెటిస్ రోగులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రాగి పుల్కాలు

Diabetes: డయాబెటిస్ రోగులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రాగి పుల్కాలు

Palak Biryani: పాలకూర బిర్యానీ ఇలా చేశారంటే అదిరిపోతుంది

Palak  Biryani: పాలకూర బిర్యానీ ఇలా చేశారంటే అదిరిపోతుంది

Potato Papads: బంగాళాదుంపలతో అప్పడాలు చేస్తే అదిరిపోతాయి

Potato Papads: బంగాళాదుంపలతో  అప్పడాలు చేస్తే అదిరిపోతాయి

Carrot Dosa: నోరూరించే క్యారెట్ దోశ, పిల్లలకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్

Carrot Dosa: నోరూరించే క్యారెట్ దోశ, పిల్లలకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్

Mango Recipes: పచ్చి మామిడితో ఇలా చట్నీ చేస్తే దోశె, ఇడ్లీలోకి అదిరిపోతుంది - వేసవి తాపం తగ్గుతుంది కూడా

Mango Recipes:  పచ్చి మామిడితో ఇలా చట్నీ చేస్తే దోశె, ఇడ్లీలోకి అదిరిపోతుంది - వేసవి తాపం తగ్గుతుంది కూడా

టాప్ స్టోరీస్

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి