News
News
X

Spiced Ghee: అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే మసాలా నెయ్యి - దీన్ని తయారు చేయడం ఎలా అంటే

మామూలు నెయ్యి అందరికీ తెలుసు, కానీ మసాలా నెయ్యి చాలా స్పెషల్. చాలా తక్కువమందే వాడతారు.

FOLLOW US: 
Share:

తెలుగిళ్లల్లో నెయ్యి లేనిదే భోజనం పూర్తి కాదు. వేడివేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. నెయ్యిలో మసాలా నెయ్యి అని వేరే రకం కూడా ఉంది. కానీ దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది అందంతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. సాధారణ నెయ్యిలాగే దీన్ని వాడుకోవచ్చు. కాకపోతే రుచిలో కొంచెం తేడా ఉంటుంది.

ఎలా చేయాలి?
సాధారణ నెయ్యితోనే ఈ మసాలా నెయ్యిని చేసుకోవచ్చు. ముందుగా సాధారణ నెయ్యిన చేసి పెట్టుకోవాలి. కావాల్సినప్పుడల్లా ఈ మసాలా నెయ్యిని కొద్దిగా చేసుకుని తినవచ్చు. లేదా అధికంగా చేసుకుని దాచుకున్నా పాడవ్వదు. 

కావాల్సిన పదార్థాలు
నెయ్యి - రెండు స్పూన్లు
కారం - చిటికెడు
కుంకుమ పువ్వు - రెండు రేకలు
సోంపు పొడి - అరటీస్పూను
యాలకుల పొడి - చిటికెడు
పసుపు - అర స్పూన్లు

తయారీ ఇలా.. 
ఒక గిన్నెలో కారం, కుంకుమపువ్వు రేఖలు, సోంపు పొడి, యాలకుల పొడి, పసుపు, నెయ్యి వేసి బాగా కలపాలి. అదే మసాలా నెయ్యి. అయితే పైన చెప్పిన నిష్పత్తుల్లో మాత్రమే కలపాలి. లేకుంటే రుచి మారిపోతుంది. ఈ మసాలా నెయ్యిని చపాతీలపై రుద్దుకొని తింటే ఆ రుచే వేరు. అలాగే గోరువెచ్చని పాలలో దీన్ని కలుపుకొని తాగినా ఎంతో మంచిది. 

ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్లు A, D, E, K పుష్కలంగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో వాడిన మసాలా దినుసులు శరీరానికి వెచ్చదనాన్ని అందించడంతోపాటు, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్ధ్యాన్ని కూడా ఇస్తాయి.

కీళ్ల నొప్పులకు...
కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ నెయ్యి ఎంతో మేలు చేస్తుంది. కీళ్ళకు లూబ్రికేషన్ అందిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో దీన్ని వాడడం మంచిది. ఇది మంటను తగ్గించి కీళ్ల నొప్పులను రాకుండా అడ్డుకుంటుంది. మసాలా నెయ్యిలో గుండెకు అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ అయినా HDL తగిన స్థాయిలో శరీరంలో ఉంటే గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

జుట్టు అందానికి
కొందరికి జుట్టు పెళుసుగా ఉంటుంది. మాడు పొడిపొడిగా ఉండి ఇబ్బంది పెడుతుంది. ఇలాంటివారు ఆహారంలో మసాలా నెయ్యిని తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. జుట్టు కింద మాడు కూడా తేమవంతంగా మారి, పొడిదనాన్ని పోగొట్టుకుంటుంది. జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి

Also read: పాన్ నమిలాక తినకూడని ఆరు ఆహార పదార్థాలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 17 Jan 2023 07:39 AM (IST) Tags: Ghee benefits Telugu Recipes Making Of Spiced Ghee Spiced Ghee

సంబంధిత కథనాలు

Paneer: పాలతోనే కాదు పప్పుతో కూడా పనీర్ తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే

Paneer: పాలతోనే కాదు పప్పుతో కూడా పనీర్ తయారు చేసుకోవచ్చు, ఎలాగంటే

Rotis Cooking: రోటీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి, మెత్తగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయ్!

Rotis Cooking: రోటీలు చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి, మెత్తగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయ్!

Green Peas Recipe: పచ్చిబఠానీ - చీజ్ కట్‌లెట్ రెసిపీ, సాయంత్రానికి టేస్టీ స్నాక్

Green Peas Recipe: పచ్చిబఠానీ - చీజ్ కట్‌లెట్ రెసిపీ, సాయంత్రానికి టేస్టీ స్నాక్

Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Prawns Recipe: గోంగూర రొయ్యల ఇగురు - వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Mutton Recipe: మటన్ రోస్ట్ ఇలా చేశారంటే ఒక్క ముక్క కూడా మిగలదు

Mutton Recipe: మటన్ రోస్ట్ ఇలా చేశారంటే ఒక్క ముక్క కూడా మిగలదు

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని