Paan: పాన్ నమిలాక తినకూడని ఆరు ఆహార పదార్థాలు ఇవే
పాన్ లేదా కిళ్లీ తినడం చాలామందికి అలవాటు. అయితే అది తిన్నాక కొన్ని రకాల ఆహారాలు తినకూడదు.
భారతీయ భోజనంలో పాన్‌కు మంచి స్థానమే ఉంది. పొట్ట నిండుగా భోజనం చేశాక చివరలో కిళ్లీ నమలనిదే భోజనం పూర్తికానట్టే భావిస్తారు ఎంతోమంది. అందులోను పాన్ లో వాడే తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేద గ్రంథాలైనా చరకసహితం, శుశ్రుత సంహితంలో తమలపాకుల గొప్పతనాన్ని, చికిత్సా సామర్ధ్యాన్ని ప్రస్తావించారు. తమలపాకులు తినడం వల్ల అందులోని పోషకాలు శరీరంలో వెచ్చదనాన్ని కలిగిస్తాయి. వీటిని తినడం వల్ల పొట్ట, పేగుల్లోని PH అసమతుల్యతను సమర్ధవంతంగా అడ్డుకుంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తమలపాకులు తినడం వల్ల భోజనం జీర్ణం అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. తమలపాకులను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. ఎన్నో రుచులను కలిపి ఇప్పుడు పాన్‌ను రకరకాలుగా తీసుకుంటున్నారు. అయితే పాన్ తిన్నాక, తినకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. ఆ విషయం చాలామందికి తెలియదు. కిళ్లీ నమిలాక ఇతర ఆహార పదార్థాలు తినేందుకు కూడా ప్రయత్నిస్తారు. పాన్ తిన్నాక ఒక గంట పాటు తినకూడని పదార్థాలు ఏమిటంటే...
పాలు
కిళ్లీ నమిలాక ఓ గంట వరకు పాలు తాగకూడదు. తాగితే దంత సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయి.
మందులు
పాన్ నమిలాక ఎలాంటి మందులను వేసుకోకూడదు. లేకుంటే కొందరిలో తలనొప్పి, కడుపునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కిళ్లీ నమిలాక ఒక గంట పాటు ఏమీ తినకుండా అలా ఉండి, ఆ తర్వాతే మందులు వేసుకోవాలి.
ఫ్రూట్ జ్యూస్
పండ్ల రసాలు కనిపించగానే చాలామంది తాగేందుకు ఇష్టపడతారు. కానీ కిల్లి వేసుకున్నాక ఫ్రూట్ జ్యూస్ లు, కూల్ డ్రింకుల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అవి నోటి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.
మసాలా
మసాలాతో వండిన పదార్థాలను కూడా కిళ్లీ తిన్నాక తినకూడదు. వాటిని తింటే మలబద్ధకంతో పాటు జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది చివరికి కడుపునొప్పికి కారణం అవుతాయి.
చల్లని నీళ్లు
పాన్ నమిలాక నోరంతా అదొక రకంగా ఉంటుంది. ఆ టైంలో చల్లని వాటర్ తాగగానే ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది. అందుకనే చాలామంది కళ్లీ తిన్నాక చల్లని నీరు తాగడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల నోరు, ఛాతిపై ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలగవచ్చు. అల్సర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కిళ్లీ నమిలాక చల్లని నీరు తాగకూడదు.
Also read: గుండెపోటు వస్తున్నట్టు మీ చర్మం రంగు ముందే చెప్పేస్తుందా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.